ప్రభుత్వం నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 పాయింట్లను వచ్చిన పదోతరగతి గ్రేడ్‌కు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు.
సీట్ల కేటా యింపు సమయంలో సమాన గ్రేడ్ పాయింట్లు ఉన్నట్టయితే మొ దట గణితం తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, తర్వాత సోషల్, ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
అయినా సమానమైతే పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్న వారికి అవకాశం ఇస్తారు.
* ఫీజులు ఇలా..*
*ప్రవేశం పొందిన విద్యార్థులు ఐఐఐటీలో ఆరు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు మొదటి రెండేళ్ల వార్షిక రుసుంగా రూ. 36వేలు ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకుగానూ వార్షిక రుసుం రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
* ఉచిత సౌకర్యాలు*
*పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి అర్హులో వారికి విద్య, హాస్టల్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వమే కల్పిస్తుంది.
* కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన పత్రాలు*
*దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైతే సమర్పించారో కౌన్సిలింగ్‌లో అవి సమర్పించాల్సి ఉంటుంది.కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, కాండక్ట్, టీసీ, మెమోతో పాటు రిజర్వేషన్ వర్తించే పత్రాలేమైనా ఉంటే అన్నింటినీ సమర్పించాలి.
* దరఖాస్తు చేసుకోవాలిలా..*
*అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మీ సేవా, ఏ.పి ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 150 చెల్లించాలి.
ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉంటుం ది.
ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ సెంటర్‌లోనే చెల్లించాలి. సెంటర్‌చార్జి అదనంగా రూ. 25 వసూలు చేస్తారు.
ఐఐఐటీ*
* ప్రవేశ అర్హతలు*
*2019 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
* రిజర్వేషన్లు*
*ట్రిపుల్ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గానూ 85 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.