AP TEACHERS BIOMETRIC E-HAZAR ATTENDANCE THROUGH MOBILE APP – CSE MEETING HIGHLIGHTS
*🌺ఈరోజు విద్యా శాఖ కమీషనర్ శ్రీ చిన్న వీరభద్రుడు గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో డి.జి.ఇ, జాయింట్ డైరెక్టర్లు, యస్.సి.ఇ. ఆర్.టి డైరెక్టర్, కమీషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు.*
*🌺ప్రధానాంశాలు:🌺*
🏝️టీచర్ల హాజరును ఇకపై మొబైల్ ద్వారా నమోదు చేయనున్నాట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు స్పష్టం చేశారు. అలాగే పాఠశాల నిర్వహణ ఇతర విషయాలపై సమావేశం నిర్వహించారు.
▪️ఉపాధ్యాయుల హాజరును మొబైల్ ఫోన్లోనే నమోదు చేసేలా యాప్ను రూపొందిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు వెల్లడించారు. యాప్ల వినియోగానికి సంబంధించి వారం, పది రోజుల్లో మరో సమావేశం నిర్వహించనున్నట్లు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన తెలిపారు.
🌺సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు..
▪️నెలవారీ పదోన్నతుల్లో కేటగిరి 3, 4 మాత్రమే భర్తీ చేస్తారు. ▪️కొవిడ్-19 బారినపడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు. ▪️అర్హులైన ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాధికారులుగా పదోన్నతి. ▪️ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పోస్టులను డీఎస్సీలో భర్తీ చేయడమా? లేదంటే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించడమా? అనే దానిపై త్వరలో నిర్ణయం.
*🌺విద్యాశాఖలో రోజురోజుకు ఎక్కువైపోతున్న యాప్ ల వినియోగాన్ని తగ్గించాలని కోరగా అనవసరమైన యాప్ లను రద్దు చేసి, అవసరమైన యాప్ లను సరళీకృతం చేసే విధంగా త్వరలో వర్క్ షాపు చేపడతామని తెలియజేశారు.*
*🌺పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీనిపై ఈ రోజే సమావేశం కూడా నిర్వహించామని తెలిపారు.*
*🌺ఎమ్ఈవోల బదిలీలను నిర్వహించాలని కోరగా త్వరలో చేపట్టుటకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.*
*🌺నాడు నేడు పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులను ఇవ్వమని కోరగా దానిపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు.*
*🌺నెలవారీ పదోన్నతులను నిర్వహించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.*
*🌺సర్వీస్ రూల్స్ సాధించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, తగు ప్రతిపాదనతో సమావేశానికి రావాలని సంఘాలను కోరారు.*
*🌺పాఠశాలలో విద్యుత్ వినియోగ బిల్లులు తగ్గించుటకు 2 కేటగిరి నుండి 7 కేటగిరి కు మార్చాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.*
*🌺పెండింగ్ లో ఉన్న 400 హెచ్ఎం పోస్టుల మంజూరులో జాప్యం నివారించి వెంటనే మంజూరు చేయాలని కోరగా ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే డీఈఓ ల నుంచి సమాచారాన్ని తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.*
*🌺ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచాలని కోరగా ప్రతిపాదనలు పంపుతామని అన్నారు.*
*🌺అంతర్ జిల్లా బదిలీలు లను నిర్వహించాలని కోరగా ఎన్నికల కోడు ఉన్నందున నిర్వహించలేక పోయామని కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.*
*🌺610 జీవో పై పని చేస్తున్న వారికి పదోన్నతి, బదిలీలపై ప్రతిపాదనలు గవర్నమెంట్ కు పంపామని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.*
*🌺675 పి.ఇ.టిలు విద్యార్హత లేని కారణంగా ప్రమోషన్ పొందని వారి కొరకు వేసవి సెలవులలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తామని తెలిపారు.*
*🌺మోడల్ పాఠశాలలలో ఉపాధ్యాయులకు వార్డెన్ విధులు తొలగించాలని కోరగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.*
*🌺40 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలకు PSHM పోస్ట్ లు మంజూరు చేయమని కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.*
*🌺శాశ్వత బదిలీల కోడ్ రూపొందించుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.*
*🌺పోస్టుల పునర్విభజనలో భాగంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా జీతాలు ఇచ్చినప్పటికీ కేడర్ స్ట్రెంత్ సమస్యను పరిష్కరించవలసినదిగా కోరగా వేంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు.*
*🌺కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున పాఠశాలల నిర్వహణ పై గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గార్లతో సంప్రదించి తగు నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు.*
*🌺ప్రధానోపాధ్యాయులు, పండిట్ల బదిలీల ఉత్తర్వులు వెంటనే విడుదల చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారు.*
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
