*♦ఫిబ్రవరి 29 కటాఫ్.. పెర్ఫార్మెన్స్ పాయింట్ల స్థానంలో సర్వీసు*
*♦సీఎం సంతకం, త్వరలో ఉత్తర్వులు*
*♦ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, కౌన్సెలింగ్*
బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
66 రోజుల కిందటే సిద్ధమైన బదిలీల ఫైల్‌పై సీఎం జగన్ శనివారం సంతకం చేశారు.
ఆ వెంటనే సంబంధిత ఫైలు పాఠశాల విద్య శాఖ ముఖ్యకార్యదర్శికి చేరింది. బదిలీలు చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ఉత్తర్వులు వచ్చే వారంలో విడుదల కానున్నాయి.
తొలుత ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్, తర్వాత బదిలీలకు వీలుగా షెడ్యూల్ విడుదల కానుంది.
కొవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలకు సంబంధించి గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, వ్యక్తమైన సూచనలు, సలహాల మేరకు విధివిధానాలపై కొంత మేరకు స్పష్టత వచ్చింది.
ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీకి అర్హులవుతారు.
అయితే, ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేళ్లు పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఈసారి బదిలీల్లో పెర్ఫార్మెన్స్ పాయింట్లకు బదులు సర్వీస్ పాయింట్లను(ఏడాదికి 0.5) ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.
గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నారు.
గతంలో 80 మంది విద్యార్థులకు 4 పోస్టులు, 100 మంది విద్యార్థులకు 5 పోస్టులు, 120 మంది విద్యార్థులకు 6 పోస్టులు ఇచ్చారు. అప్పుడు నిష్పత్తి 23గా ఉండగా ప్రస్తుతం దాన్ని 1:30గా నిర్ణయించారు.
మొత్తం మీద కొన్ని మార్పులతో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
రాష్ట్రంలో దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. సుమారు లక్ష మంది బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.
మరో వైపు విద్యాశాఖ కమిషనర్ సైతం బదిలీలు చేపట్టేందుకు వీలుగా పూర్తి సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి తీసుకు వచ్చారు. రేషన్ లైజేషన్ కు సంబంధించి జిల్లా విద్యాధికారులు సిద్ధం చేసిన నివేదికలు, సంబంధిత అంశాల పరిశీలన ప్రక్రియ సైతం పూర్తయింది.
ప్రస్తుతం ఏ స్కూలులో ఏ పోస్టు ఖాళీగా ఉంది, 5 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? 8 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు?
ఏ స్కూలులో ఎందరు అనే అంశాలపై సిద్ధమైన సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ మరో మారు తనిఖీ చేస్తోంది.
జిల్లా విద్యాధికారుల ద్వారా ఆయా పాఠశాలలకు ఈ సమాచారం పంపి ప్రధానోపాధ్యాయుల నుంచి సరి చూసి అధికారికంగా ఖరారు చేసే ప్రక్రియ సాగుతోంది. రెండు రోజుల్లో ఈ వివరాలన్నీ పక్కాగా ఖరారవుతాయి.
మరో వైపు టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో చేపట్టేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ కూడా సిద్ధమవువతోంది.
ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉపాధ్యాయులు ఆన్ లైన్ బదిలీలను వ్యతిరేకిస్తున్నా అదే విధానం లోనే ప్రక్రియ చేపట్టబోతున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దస్ర్తం వచ్చిన వెంటనే బదిలీలకు ప్రాథమిక విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది.
ఉపాధ్యాయ బదిలీలు 2020 – మాస్టర్ డేటా అప్లికేషన్ – డీఈఓ లాగిన్*
వీరు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ వివరాలను జిల్లా విద్యాధికారుల వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు.
వీరు కాకుండా 8ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు మరో 20 వేల వరకు ఉన్నారు. అంటే ఈసారి మొత్తంగా 35 వేల మంది తప్పనిసరిగా బదిలీ కానున్నారు.
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాలల కేటగిరీలు, ఖాళీలు, ప్రాధాన్య కోటా వినియోగం వివరాలను నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
హెచ్‌ఆర్‌ఏ 20 శాతం, 14.5 శాతం, 12 శాతం ఉన్నవి, బడుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
ఐచ్ఛికం ఇవ్వగానే ఆ పాఠశాల ఏ కేటగిరీ కిందకు వస్తుందో తెలుస్తుంది.*
*రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. వీటిని జిల్లా విద్యాధికారికార్యాలయం నమోదు చేయనుంది.*
8ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు గతంలో ప్రాధాన్య కేటగిరీని వినియోగించుకున్నారా లేదా అన్నది నమోదు చేయనున్నారు.
ఈ సదుపాయాన్ని 8ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.*
*రేషనలైజేషన్ పై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డీఈవో కార్యాలయం అన్ని రకాల ఉపాధ్యాయ ఖాళీలను అప్లోడ్ చేయాలని జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు విద్యాశాఖ ఆదేశించింది*.
*కమిషనరు కార్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన సమావేశం శుక్రవారంతో ముగిసింది*.
*16న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, 7న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, 18న చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన అధికారులతో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు దేవానందరెడ్డి సమీక్ష నిర్వహించారు*.
*పాఠశాలల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రేషనలైజేషన్ ద్వారా ఎన్ని ఖాళీ అవుతాయి, బదిలీల వల్ల ఏర్పడే ఖాళీల వివరాలను రూపొందించాలని విద్యాశాఖ ఆదేశించింది.
విద్యార్థులు 60 వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఇద్దరు టీచర్లను, విద్యార్థుల సంఖ్య 90 వరకు ఉంటే ముగ్గురిని, ఆ తర్వాత ప్రతి 30 మందికి ఒక టీచర్ చొప్పున కేటాయింపు ఉంటుంది.*
*ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే అక్కడ పోస్టులను తీయొద్దని అధికారులకు చెప్పినట్లు సమాచారం.*
*ఉన్నత పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు ఉంటే 9 మంది ఉపాధ్యాయులు, ఆపైన ప్రతి 40 మంది విద్యార్థులకు 2-3 చొప్పున ఉపాధ్యాయుల సంఖ్య కేటాయించనున్నట్లు సమాచారం*.
ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సైతం చర్యలు తీసుకుంటున్నారు.
బదిలీల్లో తీసుకువస్తున్న మార్పులు, తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి గురువారం ఇబ్రహీంపట్నంలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
దీంతో మళ్లీ జిల్లాలో హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి*.
*విద్యాశాఖ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో తెలియజేసిన అంశాల పరంగా చూస్తే ఇప్పటివరకు ఉన్న విధానంలో మార్పులు చేసి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గతంలో బదిలీల ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల లాగిన్ నుంచి వారి వివరాలతో కూడిన సమాచారం హెచ్‌ఎం, ఎంఈవో, డీవైఈవో, డీఈవోల లాగిన్‌కు చేరేది.
ఆ తరువాత కూడా కొందరు మార్పులు, చేర్పులు చేసుకునేవారు. ఈ సారి విధానంలో కొన్ని మార్పులు చేశారు.
ఉపాధ్యాయులు తమ ఐడీ ద్వారా లాగిన్‌లో తమ సర్వీసు వివరాలు నమోదు చేస్తే, పాఠశాల వివరాలపై ప్రధానోపాధ్యాయులు లాగిన్ ద్వారా మాత్రమే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఐడీలు అందరికీ తెలియడంతో ఏవైనా తప్పులు దొర్లే అవకాశం ఉంటుందని, హెచ్‌ఎం లాగిన్ ద్వారా దరఖాస్తులు పూరిస్తే అలాంటివాటికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.
ఉపాధ్యాయుల లాగిన్ నుంచి తమ సర్వీసుకు సంబంధించిన వివరాలు హెచ్‌ఎం లాగిన్‌కు వెళ్లాక తిరిగి ఉపాధ్యాయులు ఏదైనా మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తే కచ్చితంగా హెచ్‌ఎం చరవాణికి ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే సదరు ఉపాధ్యాయుడు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.హెచ్‌ఎం లాగిన్‌లో మార్పులు చేస్తే డీవైఈవో చరవాణీకి ఓటీపీ వెళ్తుంది.
ఇలా ఎక్కడికి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మార్పులకు అవకాశం లేకుండా ముందుగానే ఉపాధ్యాయులు తమ వివరాలను లాగిన్‌లో జాగ్రత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై జిల్లావిద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులకు బదిలీ దరఖాస్తు నమూనాపై అవగాహన కల్పించారు.*
*సర్వీసును బట్టే పాయింట్లు*
*గతంలో ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయించేవారు.
పాఠశాల అభివృద్ధికి దాతలనుంచి నిధులు సమీకరించినా, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న వారికి కూడా పాయింట్లు కేటాయించేవారు ప్రస్తుతం అలాంటివి లేకుండా కేవలం సర్వీసును బట్టే పాయింట్లు కేటాయించనున్నారు.
ఏకేటగిరీలో ఎన్నాళ్లు పనిచేశారో ఆ వివరాలను ప్రామాణికంగా చేసుకుని పాయింట్లు కేటాయిస్తారు.
వాటిని బట్టే బదిలీలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతోపాటు మొత్తం ఖాళీలు.. ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేసిన వారి ఖాళీలు కలిపి చూపించేవారు ప్రస్తుతం ఎంతమంది ఉపాధ్యాయులైతే పనిచేస్తున్నారో ఆ ఖాళీలను మాత్రం చూపాలని నిశ్చయించినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మిగులు ఖాళీలను కూడా కేటగిరీ 1, 2,3 విభాగాలు విభజిస్తారు.
వాటిని ఎవరూ కోరుకోకుండా నిబంధనలు విధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20మంది విద్యార్థులు ఉండి ఇద్దరు కన్నా ఎక్కువమంది ఉపాధ్యాయులు ఉంటే వారిని హైస్కూల్‌కు బదిలీ చేస్తారు. ఇది కూడా హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాతే చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది.
ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ కౌన్సెలింగ్ విధానం అవగాహన కొరకు*
ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలను రూపొందిస్తోంది.
కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు. మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు. . ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.
మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.
MEO గారు DEO గారికి పంపుతారు.
DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.
ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు నీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.
ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.
క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.
8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.
బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.
ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.
ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
8 & Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.
కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చు.చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.
ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.
EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.
ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.
నీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places priority ఆధారంగా నీకు place allotment జరుగుతుంది.
బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.
నీకు place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది.ఎటువంటి అపోహలకి తావులేదు.
ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్ చేస్తుంది.
ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.
మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(presnt ప్లేస్)కేటాయించబడుతుంది.
బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.