AP TET EXAM 2024 Instructions
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – పాఠశాల విద్య
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) – జూలై 2024
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై-2024 అభ్యర్థులకు సూచనలు
- ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 03-10-2024 నుండి 21-10-20-24 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో జరుగుతుంది.
- మొదటి సెషన్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు జరుగుతుంది.
- ఇంతవరకు హాల్టికెట్ లు డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సత్వరమే తమ హాల్ టిక్కెట్లను https://aptet.apcfss.in వెబ్సైటు నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.
- పరీక్షా సమయానికి ఒకటిన్నర గంటల ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్ధులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయ కేంద్రానికి ఫోన్ సందేహాలు నివృత్తి కోవచ్చు.
- పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా తన గుర్తింపు కార్డును (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు మొదలైనవి) తీసుకొని వెళ్లవలెను .
- దివ్యాంగ అభ్యర్థుల కొరకు జిల్లా విద్యాధికారి SCRIBE ను ఏర్పాటు చేస్తారు. SCRIBE కేటాయింపబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్షా సమయం కేటాయించడం జరుగుతుంది.
- అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.
- నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, ఎటువంటి మాల్ Andhra Pradesh Public Examination (Prevention of Malpractices and Unfair means) Act, 1997 (No. 25 of 1997) 50 చర్యలు తీసుకోబడును.
- సెల్ ఫోన్, ట్యాబు, లాప్టాప్, కాలికులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోని తీసుకు వెళ్ళరాదు.
- హాల్ టికెట్ లో ఫోటో లేక పోయినా, సరిగా కనిపించకపోయినా, చిన్న సైజులో వున్నా అభ్యర్థి తన సరైన 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకువెళ్లి డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించి అనుమతిపొందాలి.
- అభ్యర్ధులు తమ హాల్టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి దగ్గర ఉన్న నామినల్ రోల్స్ లో సరిఅయిన ఆధారాలు చూపించి సరి చేయించుకోవచ్చు.
- నామినల్ రోల్స్ లో ఇక్కడ పొందుపరిచిన అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, ఫోటో అభ్యర్థి సంతకం మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు తదితర వివరాలు సరిచేసుకోవచ్చు.
ఇట్లు
SD/- విజయ్ రామ రాజు. వి. ఐఏఎస్, డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
DOWNLOAD AP TET EXAM 2024 Instructions BY AP CSE