AP-u-dise-2020-online-data-entry-user-mannual-instructions

AP-u-dise-2020-online-data-entry-user-mannual-instructions

AP UDISE Online Data Entry in DCF User Manual Guidelines at CSEAP.GOV.IN UDISE+ 2019-20 యూడైస్+ డాటా మరియు నమోదుపై కొన్ని సూచనలు: 

UDISE 2019-20 DCF లో సమాచారం పొందుపరిచేటప్పుడు ఈ క్రింది కోలమ్సును జాగ్రత్తగా నింపవలెను .

పాఠశాల పూర్తి పేరు Capital Letters లో వ్రాయవలెను (పాఠశాలకు ఎవరి జ్ఞాపకార్ధం అయినను పేరుపెట్టినచో ఆపేరుతో సైతము వ్రాయవలెను)

1.3 గ్రామం / వార్డు పేరు తప్పులేకుండా వ్రాయవలెను.

1.4 కోలం నందు పాఠశాల యొక్క కాంప్లెక్స్ పేరును నమోదు చేయవలెను( Reorganize చేసిన క్రొత్త కాంప్లెక్స్ పేరును వ్రాయవలెను.

1.5 Pincode ఖచ్చితముగా వ్రాయవలెను.

1.6 కోలం నందు పాఠశాల ఆవాసప్రాంతం యొక్క పంచాయితీ పేరు

1.8 కోలం నందు పాఠశాల ఆవాసప్రాంతం పేరు (ఆవాసప్రాంతం పేరు రికార్డు ప్రకారంగా వున్నపేరును వ్రాయవలెను అవసరమైనచో Hab master లో చెక్ చేసుకోవలెను)

1.11 కోలం నందు మునిసిపాలిటి వివరములు (మునిసిపాలిటీలకు మాత్రమే వర్తించును)

1.12 కోలం నందు city వివరములు (city లకు మాత్రమే వర్తించును)

1.14 (a) లో కేవలం పాఠశాల ప్రాధనోపాద్యాయుని పేరు మరియు ఫోన్ నెంబరు (b) & (c) కోలంల నందు Respondent అనగా ఈ DCF ని ఎవరైతే బాధ్యతగా నింపు Person పేరు మరియు ఫోన్ నెంబరు)

1.15 ఈ కోలంలో 3 నుంచి 10 తరగతులు వున్న Tribal Welfare పాఠశాలలను 1 నుంచి 10 తరగతులు వున్న Secondary School category లో 6వ నెంబరు కోడ్ వెయవలెను అదేవిధంగా 1 నుంచి 7 తరగతులు వున్న పాఠాశాలలను Upper Primary School category లో 2వ నెంబరు కోడ్ వేయవలెను).

1.16 1.15 నింపిన తరువాత ఆ సమాచార ప్రకారం 1.16 లో ప్రారంభ తరగతి ముగింపు తరగతులు ఖచ్చింతంగా వేయవలెను) ఇక్కడ ఒక వేళ ఆ పాఠశాల ప్రాంగణం లోపల అంగన్వాడి కేంద్రం ఉన్నను ప్రారంభ తరగతి 1వ తగరతినే వేయవలేను).

1.17 School type నకు సంబంధించి బాలకల పాఠశాలలు కాని ప్రభుత్వ / జిల్లాపరిషత్ పాఠశాలలకు Co-Education అని Tribal Welfare పాఠశాలలకు సంబంధించి బాలురు మరియు బాలికలకు వేరు వేరు పాఠశాలలు ఉన్నాయికాబట్టి అక్కడ ఏదైతే అది నింపాలి, ప్రాధమిక స్థాయిలో మాత్రము Co-Education ఉన్నాయి).

1.18 పాఠశాల యాజమాన్యాలకు సంబంధించి UDISE లో ఎక్కువ తప్పులుదొర్లుతున్నాయి.

కాబట్టి పాఠశాలల గుర్తింపు ధృవపత్రం ఆధారంగా management code లు వేయాలి 1.30 Does the School offers any Pre-vocational courses at Upper-Primary Stage?

పై కోలం నందు ఎదురుగా ప్రస్తుతం కొన్ని పాఠశాల యందు Vocational Courses భోధన జరుగుతున్నది.

కావున ప్రతి ఒక్కరు ఈ విషయను గమనించి అయా పాఠశలలో డాటా ఎంటర్ చేయవలెను.

YOUR SCHOOL U DISE PRINT PDF DOWNLOAD

Section 2:

Physical Facilities and Equipment’s Summery

2.1.2 Type of school building పై కోలం క్రింద పాఠశాలకు సంబంధంచిన గదులను బ్లాక్సు రూపంలొ డాటా ఎంటర్ చేయవలెను.

2.1.4 (a) Details of classrooms available in the school (For class Pre Primary to XII) పై కోలం నందు ఎన్ని తరగతి గదులు కలవు.

వాటిలో భొధనకు ఉపయోగిస్తున్నవి ఎన్ని, నిర్మాణ దశలో వున్నవి ఎన్ని మరియు శిథిలావస్థాలో గలవి ఎన్నోనమోదు చేయవలెను.

3.3 Teachers And Instructors (Including Head Teacher) ఈ టేబుల్ నందు ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిగత, విద్యా మరియు వృత్తి పరమైన అంశాలను కలిగి వుంటాయి.

కావున అయా పాఠశాలల నుండి సమాచారం సేకరించే సమయం నందు ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈ క్రింది అంశాలను గమనించగలరు.

  • 1. ఉపాద్యాయుని ఐ.డి. నంబర్ :

  • 2. ఉపాధ్యాయుని పేరు (ఇంటి పేరుతో సహ) :

  • 3. ఉపాధ్యాయుని హోదా :

  • 4. ఉపాధ్యాయుని పుట్టిన తేది:

  • 5. సర్వీస్ నందు చేరిన తేది :

  • 6. ప్రస్తుత పాఠశాల యందు చేరిన తేది :

  • 7. ఉపాధ్యాయుని ఆధార్ నం :

  • 8. ఉపాధ్యాయుని ఫోన్ నంబర్ :

  • 9. ఉపాధ్యాయుని విద్యా వివరములు :

YOUR SCHOOL U DISE PRINT PDF DOWNLOAD

ఉపాధ్యాయుడు ఇతర విషయములు :

4.2.Enrollment In Current Academic Session (By Social Category) పై పట్టిక నందు పాఠశాలలో చదువుతున్న విద్యార్ధుల యొక్క Caste Wise డాటాను సరిచూసుకొనవలెను.

ఈ టేబుల్ నందు పాఠశాలలో గల Caste wise Data కు online నందు గల Caste wise డాటాకు తేడా వున్న యడల Student Information System ద్వారా విద్యార్థుల యొక్క Caste ను మార్పు చేయవలెను.

ఈ పట్టిక ద్వారానే విధ్యార్ధి యొక్క మాధ్యమము (Medium) కూడా సరిచూసుకొనవలెను.

5.2 FACILITIES PROVIDED TO CHILDREN (PREVIOUS ACADEMIC YEAR, FOR UPPER PRIMARY GRADE VI-VIII) పై పట్టిక నందు విద్యార్ధులకు సంబంధించిన Free Text Books, uniforms, Transport facility and Escort వివరములు CSE Site నందు Student Information System ద్వారా Automatic గా సమాచారం పూరించవలెను.

6.1 Annual Examination Result In Previous Year For Grade – V

6.2 Annual Examination Result In Previous Year For Grade – Viii పై పట్టికల నందు “Number of student appeared” (Caste Wise Enrollment) వివరములు CSE Site నందు Student Information System ద్వారా Automatic గా సమాచారం పూరించవలెను. మిగిలిన రెండు కాలమ్స్ Number of Students Passed/Qualified మరియు Number of Students Passed with Marks>=60% ఉపాధ్యాయుల నుండి సేకరించి డాటా ఎంటర్ చేయవలెను.

8.2 Financial Assistance Received By the School పై పట్టిక నందు Non – Govt. Organization (NGO), Public Sector Undertaking (PSU), Community లేదా Other నుండి ఏదైన ఆర్ధికా సహయం పొందినచో అందుకు సంబంధించిన వివరములు నమోదు చేయవలెను.

SECTION 10 : PGI and Other Indicators (Only For Government And Government Aided Schools)

10.1 PGI Indicators పై పట్టిక ఈ సంవత్సరం ఇవ్వడం జరిగినది.

ఇందులో ఉపాధ్యాయుల మరియు విద్యార్ధుల యొక్క బయోమెట్రిక్ హాజరు, పరీక్షల సమాచారం, రిజిష్టర్ల గురించి సమాచారం ఇవ్వడం జరిగినది.

10.2 Other Indicators పై పట్టిక నందు పాఠశాల యందు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఇవ్వడం జరిగినది.

ఇందులొ భాగంగా వారు Youth Club, Eco Club, Teachers Identity Cards, DCR, VCR and Computers Maintenance గురించి ప్రశ్నించడం జరిగినది.

10.3 U.Category Wise Teaching Staff Particulars Details (U Table) పై పట్టిక UDISE నందు చాలా ప్రాముఖ్యత గలిగినది. ఇందులో పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల యొక్క Sanction Post, Working Post and Vacancy Position యెక్క వివరములు మాధ్యమం(Medium) వారిగా ఎంటర్ చేయవలెను.

ఈ పట్టిక ఆధారంగానే ఉపాధ్యాయుల యొక్క అన్ని పట్టికలను మనం డాటా ఎంటర్ చేయవలెను.

కావున U Table డాటా సమాచారం సరియైన క్రమంలొ డాటా ఎంటర్ చేయవలెను.

గమనిక : ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల వివరములు U Table నందు నమోదు చేయునప్పుడు Language Pandit Telugu ను School Asst., Telugu గా, Language Pandit Hindi ను School Asst., Hindi గా, Physical Education Teacher(PET) ను School Asst./PGT (Phy. Edn. ) గా Up-Gradation చేయటం జరిగింది.

Section 11 : School Safety పై పట్టిక కూడా ప్రస్తుత సంవత్సరం నందు కొత్తగా ఇవ్వడం జరిగినది.

ఈ పట్టిక నందు పాఠశాలకు సంబంధంచిన Safety Measurements గురించి వివరాలను పోందుపరచవలెను.

కావున ఈ డాటాను కూడా ప్రధానోపాద్యాయుల నుండి వివరంగా సేకరించవలసియున్నది.

గమనిక : పాఠశాలకు సంబంధించిన Physical Facilities గురించి సమాచారం ఎంటర్ చేయునప్పుడు ప్రస్తుతం అయా పాఠశాలలో నిర్మాణ దశలో గల సదుపాయాలను ఆ పాఠశాల ఆ సౌకర్యం కలిగివున్నదిగా భావించవలెను.

మరియు ప్రస్తుతం మనబడి నాడు-నేడు క్రింద ఆయా పాఠశాలకు అందిచబోయే సౌకర్యాలు కూడా పరిగణనలోకి తీసుకొనవలెను.

UDISE CONFIRMATION STATUS REPORT LINK

U DISE నమోదు చేయుటకు కొన్ని సూచనలు PDF

error: Content is protected !!