* రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు*
★ జిల్లాలో ఉపాధ్యాయులకు పలు పోస్టుల్లో పనిచేయటానికి అవకాశం కల్పిస్తూ ఎస్సీఈఆర్టీ నోటిఫికేషన్ విడుదల.
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్ ఎడ్యుకేటర్స్), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు.
★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం.
★ వీరికి ఈ నెల 22న ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించనున్నారు.
★ ఈ-కంటెంట్ రైటర్లు, రిసోర్సు పర్సన్లు, డైట్ లెక్చరర్లు, విషయ(సబ్జెక్టు) నిపుణులు, డీసీఈబీ సభ్యులు, ఎస్సీఈఆర్టీలో నియామకానికి ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు.
★ పోస్టును బట్టి నిర్దేశిత సిలబస్‌ను రూపొందించారు.
★ ఎస్సీఈఆర్టీ ఇటీవల ఉపాధ్యాయులకు శిక్షణ అందించటంపై ఒక సర్వే చేసింది.
★ రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించింది.
★ నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్), స్టేట్ లెవెల్ ఎచీవ్మెంట్ సర్వే (ఎస్‌ఎల్‌ఎఎస్), సమ్మెటివ్ పరీక్షల అంచనా, సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ ఎనలెటిక్స్ అండ్ ఏన్యుయల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (ఏఎస్ఈఆర్) ఆధారంగా ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమని నిర్ధరణకు వచ్చింది.
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్) కింద ఎస్ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది.