Applications-for-CBT-for-Selection-of-Resource-Persons-AP-CSE

Applications-for-CBT-for-Selection-of-Resource-Persons-AP-CSE

State Council of Educational Research and Training – AP, Amaravati. Notification for Selection of

Upadhyaya Shikshana Nestham (Teacher Educators) And

Sankethika Sikshana Nestham

(Digital/E-content Resource Persons)

Last Date for Submission of Applications for CBT for Selection of Resource Persons is 14th Sept 2019

రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు*

★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు. 

★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు *దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగింపు.*

★  ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహణ

★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్‌) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది. 

★ ఆసక్తిగల ఉపాధ్యాయులు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో సీబీటీ పరీక్ష నిర్వహించనున్నారు.

★ ఉపాధ్యాయులకు హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్లో పంపనున్నారు. ఉపాధ్యాయులుగా రెండేళ్లు పని చేసిన అనుభవం, ఇంకా కనీసం మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. 

★ అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు…

SAMPLE QUESTIONS & MODEL PAPERS FOR COMPUTER BASED TEST (CBT)

* రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు*

★ జిల్లాలో ఉపాధ్యాయులకు పలు పోస్టుల్లో పనిచేయటానికి అవకాశం కల్పిస్తూ ఎస్‌సీఈఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల. 

★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు. 

★ ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం. 

★ వీరికి ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహించనున్నారు. 

★ ఈ-కంటెంట్‌ రైటర్లు, రిసోర్సు పర్సన్లు, డైట్‌ లెక్చరర్లు, విషయ(సబ్జెక్టు) నిపుణులు, డీసీఈబీ సభ్యులు, ఎస్‌సీఈఆర్టీలో నియామకానికి ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. 

★ పోస్టును బట్టి నిర్దేశిత సిలబస్‌ను రూపొందించారు.

★ ఎస్‌సీఈఆర్టీ ఇటీవల ఉపాధ్యాయులకు శిక్షణ అందించటంపై ఒక సర్వే చేసింది. 

★ రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించింది. 

★ నేషనల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌), స్టేట్‌ లెవెల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (ఎస్‌ఎల్‌ఎఎస్‌), సమ్మెటివ్‌ పరీక్షల అంచనా, సమ్మెటివ్‌ ఎస్సెస్‌మెంట్‌ ఎనలెటిక్స్‌ అండ్‌ ఏన్యుయల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (ఏఎస్‌ఈఆర్‌) ఆధారంగా ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమని నిర్ధరణకు వచ్చింది. 

★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్‌) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది. 

వీరిని 8 రకాల రిసోర్సు బృందాలుగా విభజిస్తారు. ఎస్జీటీ, సబ్జెక్టు గ్రూపు, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సోషల్, హిందీ సబ్జెక్టు నిపుణుల్ని ఎంపిక చేయనున్నారు.

★ సాంకేతిక శిక్షణ నేస్తాలు పాఠ్యప్తుకాల ఆధారంగా ఈ-కంటెంట్, ఈ-పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయటం, డిజిటల్, వర్చువల్‌ తరగతి గదులు, డిజిటల్‌ విద్య శిక్షణ, కంప్యూటర్‌ లేబొరేటరీలను కచ్చితంగా ఉపయోగించటంలో శిక్షణ ఇస్తారు.

★ ఆసక్తిగల ఉపాధ్యాయులు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అన్ని జిల్లాల్లో సీబీటీ పరీక్ష నిర్వహించనున్నారు.

★ ఉపాధ్యాయులకు హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్లో పంపనున్నారు.

ఉపాధ్యాయులుగా రెండేళ్లు పని చేసిన అనుభవం, ఇంకా కనీసం మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. 

★ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఎస్‌సీఈఆర్టీలో పనిచేయటానికి జిల్లా నుంచి సీనియర్‌ అధ్యాపకులుగా 7గురు, అధ్యాపకులుగా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అన్ని విభాగాల్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాల్ని ప్రకటించారు.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

PROCEEDINGS & GUIDELINES AP CSE, AMARAVATHI

Applications for CBT for Selection of Resource Persons

error: Content is protected !!