apply-new-pan-card-by-using-aadhar-card-details

apply-new-pan-card-by-using-aadhar-card-details

కొత్తగా పాన్‌ (శాశ్వత ఖాతా నంబరు) కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించి, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌.

ఆదాయం పన్ను (ఐటీ) డిపార్ట్‌మెంట్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని  ప్రారంభించింది.

అయితే, ఇది ఆధార్‌ కార్డు ఉన్నవారికే సుమా. ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ చేస్తారు. అదీ ఉచితంగా. 

మన ఆధార్ కార్డును ఉపయోగించి రెండు నిమిషాల్లో పాన్ కార్డు కు అప్లై చేసి కొత్త కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 మన యొక్క ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు ను కొత్తగా తీసుకోవాలి అనుకుంటే ముందుగా మన యొక్క మొబైల్ నెంబర్ ను మన ఆధార్ నెంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

దీని తర్వాత కింద ఇచ్చిన లింకు ఓపెన్ చేసి అందులో మన యొక్క ఆధార్ నెంబరు మరియు ఇచ్చిన కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క మోబైల్ కి ఓటిపి రావడం జరుగుతుంది.

దీనిని ఎంటర్ చేయగానే మన ఆధార్ కార్డు లో ఉన్న వివరాలన్నీ చూపించడం జరుగుతుంది.

ఇవన్నీ సరిగా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మనకి పాన్ కార్డుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

  • ఈ-మెయిల్‌కు పాన్‌ కార్డు పొందగోరేవారు ఆ వివరాలను సైతం అందించాలి. 

  • ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా మీరు అందించిన డేటాను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వద్దనున్న సమాచారంతో సరిపోల్చి చూస్తారు. ఆ వెంటనే ఈ-పాన్‌ను జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తానికి మహా అయితే 10 నిమిషాల సమయం పట్టవచ్చు. 

  • ఆ తర్వాత మీరు మీ పాన్‌ను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘చెక్‌ స్టేటస్‌ లేదా డౌన్‌లోడ్‌ పాన్‌’ అప్షన్‌ను క్లిక్‌ చేసి ఆధార్‌ నంబరును ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. 

  • ఒకవేళ మీ ఆధార్‌తో ఈ-మెయిల్‌ కూడా అనుసంధానమై ఉంటే,  పాన్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ మెయిల్‌ రూపంలో మీ ఇన్‌బాక్స్‌కు చేరుతుంది.

సౌలభ్యాలు

  • పాన్‌ జారీ పూర్తి ఉచితం

  • దరఖాస్తు చాలా సులభం

  • నిమిషాల్లో ముగిసే ప్రక్రియ 

ఎవరు అర్హులు..? 

  • ఇదివరకెన్నడూ పాన్‌ కార్డు  తీసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు (మైనర్లు మినహా)

  • ఆధార్‌తో మొబైల్‌ నంబరు  అనుసంధానితమై ఉండాలి

  • ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ పూర్తి వివరాలు ‘తేదీ-నెల-సంవత్సరం’ ఫార్మాట్‌లో ఉండాలి

Click Here To Apply NEW PAN CARD

INCOME TAX SOFTWARE 2019-20 LATEST UPDATED VERSION

error: Content is protected !!