APRCET-2019 ద్వారా ఏపీలోని 14 యూనివర్సిటీలలో ఎం.ఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఏపీఆర్‌సెట్ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆంధ్రాయూనివర్సిటీ విడుదల చేసింది..
వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో
నవంబరు 8 నుంచి 12 వరకు పరీక్ష నిర్వహణ
ఏపీలోని యూనివర్సిటీలలో పీహెచ్‌డీ, ఎంఫిల్ ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2019 (ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2019 పరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఏపీఆర్‌సెట్ పరీక్షలను ఈ ఏడాది నవంబరు 8 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు.
మొత్తం 68 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షల కోసం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.