APSRTC-ticket-booking-starts-pratham-mobile-app-from-july-20

APSRTC-ticket-booking-starts-pratham-mobile-app-from-july-20

ఏపీలో ఈ నెల 20 నుంచి ప్రథమ్ బస్సు టికెట్లు

ముందు ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోలో పరిధిలో యాప్ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్. ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ యాప్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎండీ సూచిస్తున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ ప్రథమ్ బస్సు టికెట్ల జారీకి అంతా సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి నగదు రహితంగా ప్రథమ్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సులకు టికెట్లను జారీ చేయనున్నారు.

ముందు ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోలో పరిధిలో యాప్ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు.

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీకాకుళం-1, అనకాపల్లి, మచిలీపట్నం, విజయనగరం, గుంటూరు -1,2, అమలాపురం, రావులపాలెం, చిత్తూరు-2, తాడిపత్రి డిపోల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ యాప్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎండీ సూచిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఏపీఎస్ ఆర్టీసీ సమూల మార్పులు చేస్తోంది.

బస్సుల్లో నగదు ద్వారా టికెట్ల కొనుగోలుకు స్వస్తి చెబుతూ మొత్తం ఆన్‌లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా అన్ని రకాల బస్సు సర్వీసులకు టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ సరికొత్త యాప్‌ను రూపొందించింది.

ఈ యాప్‌కు ‘ప్రథమ్’ పేరు పెట్టారు.

ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది యాప్‌ చూపిస్తుంది.

అలా బస్సును ఎంపిక చేసుకుని టికెట్ కొనుగోలు చేయవచ్చు.

నగదు చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

టికెట్ జారీ అయినట్లు మెసేజ్‌తో పాటు 4 అంకెల పిన్ నంబర్ వస్తుంది. ప్రయాణికుడు బస్సు ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్ నంబర్ చెబితే సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

error: Content is protected !!