ARMY-public-schools-8000-teacher-jobs-online-registration-notification

ARMY-public-schools-8000-teacher-jobs-online-registration-notification

Army Public School Teachers Recruitment 2020 | టీచర్ లేదా లెక్చరర్ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త.

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8000 వరకు ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రతీ ఏటా ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 8000 పోస్టుల భర్తీ జరుగుతుంది

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT, ప్రైమరీ టీచర్-PRT పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ.

అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 20 చివరి తేదీ. అడ్మిట్ కార్డులు 2020 నవంబర్ 4న విడుదలౌతాయి.

ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాయాలనుకునేవారికి రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో 2020 నవంబర్ 4 నుంచి నవంబర్ 13 వరకు లింక్ అందుబాటులో ఉంటుంది. 2020 నవంబర్ 21 లేదా 22 తేదీల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు 2020 డిసెంబర్ 2న విడుదలౌతాయి

Registering for APS is a 2 Step process as mentioned pdf file

ARMY PUBLIC SCHOOLS REGISTRATION OFFICIAL WBSITE

New User పైన క్లిక్ చేయండి. ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత Proceed పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత PGT, TGT, PRT పోస్టుల్లో మీరు అప్లై చేసే పోస్టును సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ రిజిస్ట్రేషన్ చేయాలి. 

ఆ తర్వాత ఫీజు చెల్లించి ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఇమెయిల్ ఐడీకి, ఎస్ఎంఎస్ రూపంలో రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. 

మూడు దశల పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ ద్వారా ఎంపిక చేస్తారు. స్టేజ్ 1 లో స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నవంబర్ 21, 22 తేదీల్లో ఉంటుంది. 

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES హెడ్ క్వార్టర్స్‌ ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి స్కోర్ కార్డ్ లభిస్తుంది. ఈ స్కోర్ కార్డ్ జీవితాంతం వేలిడ్‌లో ఉంటుంది. స్క్రీనింగ్ ఎగ్జామ్ పాసైన మూడేళ్లలోపు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ జాబ్‌కు దరఖాస్తు చేయొచ్చు. 

ఎంపిక ప్రక్రియలో ఇతర దశలకు దరఖాస్తు చేసేందుకు ఈ స్కోర్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే స్కోర్ కార్డ్ ఉన్నవారు తమ స్కోర్ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాయొచ్చు. లేదా అప్‌గ్రేడింగ్ కోసం రాయొచ్చు. అంటే టీజీటీ పాసైనవారు పీజీటీకి దరఖాస్తు చేయొచ్చు. అయితే ఇందులో స్కోర్ కార్డ్ వచ్చినంత మాత్రానా ఉద్యోగం లభిస్తుందని కాదు. 

AP AGRICET-2020 NOTIFICATION & ONLINE APPLICATION FORM

AP EAMCET COUNCILLING SCHEDULE & CUT OFF RANKS 2019

error: Content is protected !!