OFFICERS JOBS IN INDIAN NAVY WITH INTER PLUS JEE MAIN SCORE
JEE MAIN లో అర్హత సాధించిన ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఇండియన్ నేవీ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.
B.TECH విద్యను ఉచితంగా అందించడంతోపాటు సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగాన్నీ ఇస్తోంది.
ఎంపికైతే మంచి జీతంతోపాటు ఎన్నో రకాల అలవెన్స్‌లనూ చిన్నవయసులోనే పొందవచ్చు.
ఇంటర్మీడియట్ తర్వాత జేఈఈ రాసిన అభ్యర్థులకు ఇంజినీరింగ్ ప్రధాన లక్ష్యం. అదీ పూర్తికాగానే ఉద్యోగం. ఇందుకోసం చాలా ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ రెండింటినీ ఉచితంగా అందిస్తోంది భారత నౌకాదళం. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి ఉంటే చాలు..
కొన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు పెట్టి ఎంపిక చేసుకుంటారు. ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందిస్తారు.
కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూ నుంచి డిగ్రీ పట్టాను అందుకోవచ్చు.
ఆ తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ నేవీలో ఉద్యోగం ఇస్తారు.
మొదటి నెల నుంచే దాదాపు లక్ష రూపాయలు వేతనంగా అందుతుంది. ఇతర ఎన్నో అలవెన్స్‌లూ ఉంటాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే భారతీయ నావికాదళం విడుదల చేసిన 10+2 టెక్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరు అర్హులు:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్ -2019లో అర్హత సాధించి ఉండాలి.
పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ.ఉండాలి.
అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి. జులై 2, 2000 – జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
జేఈఈ-2019 మెయిన్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్టు చేస్తారు.
వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆగస్టు – అక్టోబరు మధ్య కాలంలో బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి.
తొలిరోజు స్టేజ్-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి.
ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్-2లో ఇంటర్వ్యూలు చేస్తారు.
దీనిలో భాగంగా సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు.