Balotsav-VVIT-Namburu-programmes-from-Nov-28th-to-Nov-30th

Balotsav-VVIT-Namburu-programmes-from-Nov-28th-to-Nov-30th

వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.

అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకూ ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే.

వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు.

అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. మొత్తం 20 అంశాలలో 42 విభాగాలలో దేశం నలుమూలల నుండి సుమారుగా 700 పాఠశాలలకు చెందిన 12 వేల మంది పైచిలుకు విద్యార్ధులతో వివిఐటి బాలోత్సవ్ 2017ను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము.

అదే విధంగా ఈ సంవత్సరం వివిఐటి బాలోత్సవ్ 2018లో మొత్తం 18 అంశాలలో 60 విభాగాలలో పోటీలు నర్సరీ నుండి పదవ తరగతి వరకు గల విద్యార్ధుల మధ్య నిర్వహించబడతాయి.

నవంబరు 30 నుండి డిసెంబరు 2 వరకు జరగబోతున్న బాలోత్సవ్ – 2018 ని కూడా అదేవిధంగా ఆనందోత్సాహాలతో పాల్గొని మీ పండుగను విజయవంతం చేయాలని మిమ్మల్నందరినీ వివిఐటికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

పోటీలు జరుగు సాంస్కృతిక అంశాలు

బాలోత్సవ్ కు నియమ నిబంధనలకు ఇక్కడ క్లిక్ చేయండి

బాలోత్సవ్ 2019 నందు పాల్గొనదలచిన ప్రతి ఒక్కరు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను.

అందుకు ఈ క్రింద ఇచ్చిన రెండు పద్ధతులలో మీకు నచ్చిన ఏదైనా ఒక దానిని అనుసరించవచ్చు.

1. బాలోత్సవ్ 2019 ఎంట్రీ ఫారం ను  డౌన్ లోడ్   చేసుకొనవలెను.

దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు.

కన్వీనర్,

వివిఐటి బాలోత్సవ్ 2019,

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,

నంబూర్ గ్రామం,

పెదకాకాని మండలం,

గుంటూరు జిల్లా.

ఆంధ్రప్రదేశ్ 522508

2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.

VVIT BALOTSAV ANDROID MOBILE APP DOWNLOAD HERE

BALOTSAV PROGRAMME ENTRY FORM DOWNLOAD HERE

బాలోత్సవ్ అఫిషియల్ వెబ్సైట్

error: Content is protected !!