2019-20 విద్యాసంవత్సరంలో SC, ST, విద్యార్థులకు లాటరీ పద్దతి ద్వారా 3వతరగతి,
5వ తరగతి, 8వ తరగతికి ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశానికి పరీక్షా జూన్ 7వ తేదిన జరుగుతుంది.
ఎంపిక చేసిన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 2019-20 విద్యాసంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఎఎస్) పథకం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కల్పించే ఉచిత విద్యకుఎంట్రన్స్ పరిక్ష జరుగుతుంది.
2019-2020 సంవత్సరానికిగానుఆంధ్రప్రదేశ్ప్రభుత్వంవారుషెడ్యులుకులములవిద్యార్దిని/ విద్యార్దులకుఉన్నతప్రమాణాలుకలిగినవిద్యనుకల్పించుటకొరకుబెస్టుఎవైలబుల్స్కూలుపధకమునందు1వ తరగతి ప్రవేశము (డేస్కాలర్)మరియు 5వ తరగతి, 8వ తరగతి లో హాస్టల్వసతితో ఉన్నత ప్రమాణాలు కలిగిన ప్రైవేటు స్కూల్సు నందు ప్రవేశము పొంది 10 వ తరగతి వరకు ఉచితముగా చదువు కొనుటకు అవకాసంకల్పిస్తున్నారు.
5 వతరగతి చేరగోరు వారికి 4వ తరగతి పాట్యాంశముల పై ప్రవేశపరీక్ష ద్వారా వచ్చిన మెరిట్ ఆదారముగా ప్రవేశములు కల్పించబడును.
ప్రవేశపరీక్ష హాల్ టికెట్స్ విద్యార్దులు జ్ఞానభుమి ఆన్ లైను నందు నమోదు చేసిన సెల్ ఫోన్ నంబర్స్ కు ది.05.6.2019 నుండి మెసేజెస్ రూపములో పంపించ బడును.
5 వ తరగతికి, 8వ తరగతికి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించు తేది. 07.06.2019.
ప్రవేశపరీక్ష రిసుల్ట్ ది. 10.06.2019 న ప్రకటించబడును.
బెస్ట్ అవైలబుల్ స్కీము ద్వార 1వ తరగతి చదివే విద్యార్ధికి సంవత్సరానికి Rs. 20,000/- (డేస్కాలర్),
5 వతరగతి, 8 వ తరగతి విద్యార్దికి (హాస్టల్ వసతి స్కూలు ఫీజు కలిపి) Rs. 30,000/- (పుస్తకాలు, స్కూలు యూనిఫాము,షూస్) ఖర్చుల నిమిత్తము సాంఘిక సంక్షేమ శాఖ వారు పాటశాల యాజమాన్యానికి మంజూరు చేస్తారు.
5వ తరగతి, 8 వ తరగతి విద్యార్ధులకు ప్రవేశ పరీక్షా వ్రాయుటకు హాల్ టికెట్స్ వెబ్సైట్ లో వుంచారు.
ఆధార నెంబరు, మొబైల్ నెంబరు సహయంతో హాల్ టికెట్స్ తీసుకోవచ్చు.