best-pension-plan-for-senior-citizens-Income-pmvvy-2020

best-pension-plan-for-senior-citizens-Income-pmvvy-2020

అద్భుతమైన పెన్షన్‌ పథకం ఆఖరు తేదీ మార్చి 31

Pradhan Mantri Vaya Vandana Yojana

మీ రిటైర్‌మెంట్‌ పొదుపుపై అధిక వడ్డీ రేటుతో కూడిన రెగ్యులర్‌ ఆదాయంకోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే అద్భుతమైన పెన్షన్‌ పథకం అందుబాటులో ఉంది.

అదే ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పెన్షన్‌ పథకం. 

ఈ పథకంలో చేరేందుకు ఈ నెల 31 చివరి తేదీ. దీని గడువు పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకం హామీపూర్వక పెన్షన్‌ను అందిస్తుంది.

ఇది సీనియర్‌ సిటిజన్లకు అద్భుతమైన పెన్షన్‌ పథకమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పథకానికి సంబంధించిన వివరాలు మీకోసం.. 

ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి తక్షణ యాన్యుటీ అందించే పథకం పీఎంవీవీవై. రిటైర్మెంట్‌ అనంతరం నిలకడగా ఆదాయం అందుకునే వీలుంటుంది.

10 ఏళ్లపాటు నెలకు రూ.1,000 (కనిష్ఠ పింఛన్‌) నుంచి రూ.10,000 (గరిష్ఠ పింఛన్‌) అందించే హామీ ఇస్తుంది.

అంతే కాదు ఇన్వెస్ట్‌ చేసిన వ్యక్తి మరణానంతరం నామినీలకు పర్చేజ్‌ ధర తిరిగి చెల్లించడం ద్వారా డెత్‌ బెనిఫిట్‌  అందిస్తుంది. దీన్ని ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది.

ఈ పథకం గడువు మార్చి 31 వరకే ఉంది. ప్రభుత్వం ఇంతవరకు ఆ స్కీమ్‌ గడువును  పొడిగించలేదు. 60ఏళ్ల వయసు పైబడి, బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తం నిల్వగా ఉన్న వారు ఈ యాన్యుటీ స్కీమ్‌ కొనుగోలు చేసే అంశం పరిశీలించవచ్చు.

స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి వారు యాన్యువిటీ కొనుగోలు చేసిన పరిమాణం ఆధారంగా ఎంత మొత్తానికి అర్హత ఉంటే అంత మొత్తాన్ని తక్షణ పింఛనుగా చెల్లించేందుకు బీమా కంపెనీ ఇచ్చే కాంట్రాక్టునే తక్షణ యాన్యుటీగా వ్యవహరిస్తారు. 

LIFE INSURANCE CORPORATION OF INDIA MAIN WEBSITE

చెల్లింపు విధానం

పింఛను చెల్లింపునకు నాలుగు ఆప్షన్లుంటాయి. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికం. ఇన్వెస్టర్లు ఈ నాలుగు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఎంచుకున్న ఆప్షన్‌ ఆధారంగా నెలవారీ ఆప్షన్‌ తీసుకున్న వారికి స్కీమ్‌లో చేరిన తేదీ నుంచి నెల రోజులు దాటగానే పింఛను మొత్తం జమ చేస్తారు. అలాగే త్రైమాసికానికి ప్రతి 3 నెలలకు ఒకసారి, అర్ధ సంవత్సరానికి ప్రతి 6 నెలలకు ఒకసారి, వార్షిక ఆప్షన్‌కు ప్రతి 12 నెలలకు ఒకసారి పింఛను జమ చేస్తారు. నెఫ్ట్‌, ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ విధానం రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే దానితో అనుసంధానమైన ఖాతాలో పింఛను జమ అవుతుంది.

ఎలా కొనుగోలు చేయాలి?

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆఫ్‌లైన్‌లో  అయితే ఎల్‌ఐసీ శాఖకు వెళ్లి కొనుగోలు చేయవచ్చు.

మెచ్యూరిటీ బెనిఫిట్‌ : పాలసీ కాలపరిమితి 10 ఏళ్లు పూర్తయ్యే వరకు సజీవంగా ఉన్న వారికి యాన్యుటీ మొత్తం కొనుగోలు ధరతో పాటు చివరి వాయిదా పెన్షన్‌ కూడా చెల్లిస్తారు.

డెత్‌ బెనిఫిట్‌ : పాలసీ కాలపరిమితి లోగా పాలసీదారుడు మరణించినట్టయితే నామినీలకు కొనుగోలు ధర మొత్తం వాపసు చేస్తారు. 

రుణ సదుపాయం

పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత దానిపై రుణం తీసుకునే అవకాశం ఉంది. ఇన్వెస్ట్‌ చేసిన మొత్తంలో 75 శాతం రుణంగా ఇస్తారు. వడ్డీ రేటును అప్పటికి అమల్లో ఉన్న రేట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. పింఛను పొందేందుకు ఎంత కాలపరిమితి ఎంచుకుంటే అంతవరకు వడ్డీ జమ అవుతూ ఉంటుంది. పెన్షన్‌ వాయిదా అందుకోగానే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మధ్యలోనే స్కీమ్‌ నుంచి బయటకు రావాలనుకుంటే అప్పటికి చెల్లించిన వాయిదాలు పోగా మిగిలిన రుణం మొత్తాన్ని క్లెయిమ్‌ నుంచి మినహాయించి చెల్లిస్తారు.

ఎగ్జిట్‌ అవకాశం

పాలసీదారుడు లేదా పాలసీదారుని భార్య/భర్త ప్రాణాంతకమైన వ్యాధికి/తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు స్కీమ్‌ గడువు ముగియక ముందే బయటకు వచ్చే అవకాశం కల్పించారు.

పన్ను లాభం లేదు

ఈ స్కీమ్‌ కింద ఇన్వెస్ట్‌ చేసే మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 సీ కింద పన్ను  ప్రయోజనం పొందే ఆస్కారం లేదు.

అంటే ఆ మొత్తాన్ని ఐటీ రిటర్న్‌లో మినహాయింపుగా క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉండదు.

జీఎ్‌సటీ నుంచి మాత్రం మినహాయింపు ఉంది.

స్కీమ్‌ ప్రధానాంశాలు 

స్కీమ్‌లో చేరేందుకు కనీస వయసు : 

60 ఏళ్లు (గరిష్ఠ వయోపరిమితి ఏదీ లేదు.)

పాలసీ కాలపరిమితి : 10 ఏళ్లు

కనీస పింఛను : నెలకు రూ.1,000

గరిష్ఠ పింఛను : నెలకు రూ.10,000

(గరిష్ఠ పరిమితికి పైబడి అదనపు పెన్షన్‌ తీసుకునేందుకు వీలుండదు)

ఎంత మొత్తం చెల్లించాలి?

ఎవరు ఈ స్కీమ్‌లో చేరాలన్నా ఏకమొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఎవరు ఎంత మొత్తం పెన్షన్‌కు ఎంత చెల్లించాలి అనేది పట్టికలో చూడొచ్చు (మొత్తం రూపాయల్లో..)

వ్యవధి

కనీస

యాన్యుటీ

కనీస

పెన్షను

గరిష్ట

యాన్యుటీ

గరిష్ట

పెన్షను

సంవత్సరం

1,44,578

12,000

14,45,783

1,20,000

6 నెలలు

1,47,601

6,000

14,76,015

50,000

3నెలలు

1,49,068

3,000

14,90,000

30,000

నెలవారీ

1,50,000

1,000

15,00,000

10,000

Pradhan Mantri Vaya Vandana Yojana ONLINE APPLICATION CLICK HERE

error: Content is protected !!