# BS-6-Bharath-Standard-6-vehicles-ready-transport-April-2020

- Link: https://amaravathiteacher.com/bs-6-bharath-standard-6-vehicles-ready-transport-april-2020/
- Published: 2020-03-19T09:20:40+05:30
- Author: amaravathiteacher

## **BS-6-Bharath-Standard-6-vehicles-ready-transport-April-2020**󠀁[](https://amaravathiteacher.com/bs-6-bharath-standard-6-vehicles-ready-transport-april-2020/)󠁿

### **బీఎస్‌–6 వాహనాలు రెడీ**

### **ఏప్రిల్‌ నుంచి రోడ్లపై రయ్‌ రయ్‌**

### **కాలుష్య నివారణకు చర్యలు**

### **బీఎస్‌–4 వాహనాల విక్రయాలపై రాయితీల జోరు**

### **ఏప్రిల్‌ నెలలో బీఎస్‌–6 వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. **

### **ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 (భారత్‌ స్టాండర్డు–6) వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం విదితమే. **

### **కాలుష్యానికి కారణమవుతున్న బీఎస్‌–4 వాహనాలు విక్రయాలు ఈ నెల 31 నుంచి నిలిపి వేయాలని ఆదేశించింది. **

### **ఈ నేపథ్యంలో రవాణాశాఖ ఇప్పటికే డీలర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చింది. **

### **ఈ నెల 31 లోగా బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. **

### **గడువు తీరిన తర్వాత రిజిస్ట్రేషన్లు అంగీకరించేది లేదని అధికారులు చెబుతున్నారు. **

### **రిజిస్ట్రేషను లేకుండా వాహనాలు తిరిగితే సీజ్‌ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.**

### **భారత్‌ స్టాండర్డ్‌ వాహనాలు వచ్చాయి ఇలా..**⏎ **వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్య ఉద్గారాలను బట్టి, ఇంజన్‌ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నారు. **

### **దీన్నే భారత్‌ స్టాండర్డ్‌ వాహనాలుగా చెబుతున్నారు. **

### **ఇందులో ఇప్పటి వరకు బీఎస్‌–2,3,4…తాజాగా బీఎస్‌ 6 వాహనాలు వచ్చాయి. 2001 నుంచి 2005 మధ్యలో బీఎస్‌–2 వాహనం రోడ్లపై హల్‌చల్‌ చేశాయి. **

### **2005లో బీఎస్‌–3 వాహనాలు మార్కెట్లోకి వచ్చింది. 2017లో బీఎస్‌–4 ఇప్పుడు ఏప్రిల్‌లో బీఎస్‌–6 వాహనం అందుబాటులోకి రానుంది. **

### **ఇది ఇప్పటికే మార్కెట్‌లో వాహన ప్రియులను ఊరిస్తోంది.**

### **అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో..**⏎ **అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బీఎస్‌–6 వాహనం వస్తోంది, ఇంజిన్‌ సామర్థ్యం మెరుగ్గా ఉండి వేగం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.**

### **ప్రధానంగా కాలుష్యం తక్కువగా వదిలే విధంగా దీన్ని తయారు చేశారు.**

### ** వీటిలో మైలేజ్‌ పరంగా 15 శాతం అధికంగా ఉన్నా ట్యాంకులో 2 నుంచి 3 లీటర్లు నిల్వ ఉంచుకుంటేనే వాహనం నడుస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. **

### **జిల్లాలో పలు షోరూంలో బీఎస్‌–6 వాహనాలు అమ్మకాలకు సిద్ధం చేశారు.**

### **పెట్రోల్‌ కూడా ప్రత్యేకమే**

### **బీఎస్‌–6 వాహనాలకు పెట్రోల్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. **

### **ఈ మేరకు ఏప్రిల్‌ నాటికి ఈ ఇంధనం పెట్రోల్‌ బంకులోకి అందుబాటులోకి రానుంది. **

### **అయితే ఈ పెట్రోల్‌ బీఎస్‌–4 వాహనాలకు కూడా వాడే విధంగా తయారు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.**

### **రిజిస్ట్రేషన్ల జోరు..**⏎ **బీఎస్‌–4 వాహనానను వదిలించుకునేందుకు డీలర్లు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.**

### ** రాయితీలు అందిస్తున్నారు. **

### **రోజుకు 100 నుంచి 200 వరకు వాహనాలకు రిజిస్ట్రేషన్లు జరుతున్నాయి. **

### **ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బీఎస్‌–4వాహనాలు వందల సంఖ్యలో ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. **

### **ఈ నెలాఖరు కల్లా వాహనాల అమ్మకాలు పూర్తవుతాయని చెబుతున్నారు.**

### **మార్చి 31 వరకే బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌**⏎ **ఈ నెల 31 వరకే బీఎస్‌–4 వాహనాలను రిజిస్ట్రేషన్లు ఉంటాయి.**

### ** ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనం అందుబాటులోకి వస్తోంది. **

### **మార్చి 31 తర్వాత బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తాం. **

### **రిజిస్ట్రేషన్‌ లేకుండా రోడ్డుపై వచ్చే వాహనాలను సీజ్‌ చేస్తారు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
