C.P-BROWN-Varshika-Patasalala-Telugu-poteelu-Competitions-2019
సి.పి.బ్రౌన్ తెలుగు క్విజ్ పోటీలు
* విషయము: ‘దాసుభాషితం’ – సి.పి. బ్రౌన్ వార్షిక తెలుగు క్విజ్ పోటీ – 2019″ – విద్యార్థులలో మాతృ భాష మీద మక్కువ పెంపొందించటం – ద్వారా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కొరకు – పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ – కొరకు – ఉత్తర్వులు.*
పోటీలో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకునేందుకు potee2019 అని టైప్ చేసి 99520 29498 కి వాట్సాప్ పంపితే లింక్‌ను పంపిస్తామని సూచించారు. వివరాలకు
https://www.youtube.com/watch?v=uAFy7D1WFzc&feature=youtu.be
యూట్యూబ్ లింక్‌ను సందర్శించవచ్చని తెలిపారు.
సందర్భంలోని లేఖకు సంబంధించిన “సి.పి.బ్రౌన్ వార్షిక తెలుగు క్విజ్ పోటీ 2019″ స్వరూప పత్రాన్ని జత చేస్తూ, “దాసుభాషితం” అను సాహితీ సంస్థ తెలుగు భాషాభివృద్ధికి, వ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించ తలపెట్టిన తెలుగు క్విజ్ కార్యక్రమ వివరాలను తమ జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలకు తెలియజేస్తూ, నిర్వాహకుల సూచనల మేరకు పదవ తరగతి విద్యార్థులందరూ, తమ తమ పేర్లు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకుని, ఆన్ లైన్ ద్వారా సదరు క్విజ్ కార్యక్రమంలో పాల్గొని ప్రయోజనం పొంద వలసినదిగా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలు ఈయవలసినదిగా జిల్లా విద్యా శాఖాధికారులను ఇందుమూలముగా కోరడమైనది.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారికి పాఠం చెప్పే తెలుగు ఉపాధ్యాయులు, ఇంకా వారి పాఠశాల కూడా రూ. 30,000 వరకూ నగదు బహుమతులు, సత్కారాలు, ప్రశంసా పత్రాలు గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.
పోటీ తేదీ, స్వరూపం
-
డిసెంబర్ 2019 నెల ద్వితీయార్థంలో నిర్వహించబడే ఈ పోటీ లో విద్యార్థులు computer ద్వారా గాని, smart phone ద్వారా గాని పాల్గొనవచ్చు. పోటీ జరిగే తేదీని, నమోదు చేసుకున్న విద్యార్థులకు తెలియజేస్తాం.
-
దరఖాస్తు ఫారంలో మీరు ఇచ్చిన మొబైల్ ఫోను నెంబరుకు, email కు నిర్ణీత తేదీ నాడు SMS & Email ద్వారా ఒక ‘లింకు’ వస్తుంది. ఆ లింకు నొక్కగానే తెరుచుకునే ప్రశ్నా పత్రం కొద్ది సేపు మాత్రమే తెరచి ఉంటుంది.
-
ప్రశ్నా పత్రంలో తెలుగు భాష, సాహిత్యాలకు సంబంధించిన మొత్తం 20 ప్రశ్నలుంటాయి.
-
ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు సమాధానాలుంటాయి. ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గడువులోగా గుర్తించాల్సి ఉంటుంది.
పోటీలో ఎవరు పాల్గొనవచ్చు?
తెలంగాణా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ప్రవేశ రుసుమేమీ లేదు.
ఎలా పాల్గొనాలి?
అర్హులైన పదవ తరగతి విద్యార్థులు 2019 తేదీ లోగా తమ దరఖాస్తును ఈ లింక్ ద్వారా సమర్పించాలి.
బహుమతులు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విజేతగా ప్రకటింప బడిన పాఠశాలలుకు, ఆయా పాఠశాలల తెలుగు ఉపాధ్యాయులకు, పదవ తరగతి విద్యార్థులకు, ఈ క్రింది బహుమానాలు ఇవ్వబడతాయి.
-
గెలిచిన పాఠశాలలో పోటీలో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థులకు రూ. 10000 నగదు బహుమతి సమానంగా పంచి చెక్కు రూపంలో అందజేయడం జరుగుతుంది.
-
గెలిచిన పాఠశాల విద్యార్థులందరిలోనూ ఎక్కువ ప్రశ్నలకి సరియైన సమాధానాలు ఇచ్చిన విద్యార్థి(ని)కి అదనంగా రూ. 1116 లభిస్తాయి. ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే ఈ బహుమతి వారికి సమానంగా పంచడం జరుగుతుంది.
-
ఆ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయిని రు.5,116 నగదు పురస్కారం, పండిత సత్కారం అందుకుంటారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే ఈ బహుమతి వారికి సమానంగా పంచడం జరుగుతుంది.
-
అలాగే, అత్యధిక సంఖ్యలో తెలుగు ప్రజ్ఞావంతులను తయారు చేసిన పాఠశాలకు ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక కూడ లభిస్తాయి.
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
