తెలుగు రాష్ట్రాల పదవ తరగతి విద్యార్థులు, వారి తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాల కూడా ₹ 1,00,000 వరకూ నగదు బహుమతులు, సత్కారాలు, ప్రశంసా పత్రాలు, ఇంకా తెలుగు ప్రజలు ₹ 100,000 విలువైన బహుమతులు గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.
పోటీ – ముఖ్యమైన తేదీలు
నమోదు ఆఖరు తేదీ
Dec 10, 2020 (గురువారం)
పోటీ తేదీ
Dec 13, 2020 ఆదివారం (పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహింపబడుతుంది).
ఈ ఆధునిక యుగంలో ఆ సాహిత్యాన్ని సులువుగా ఆస్వాదించడానికి, దాసుభాషితం శ్రవణ మాధ్యమంలో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు సాహిత్యం పరిఢవిల్లడానికి భాషాభిమానం అవసరం.
అది పాఠశాల దశలోనే ఏర్పడితే జీవితాంతం ఉంటుంది.
ఒక విషయం మీద విద్యార్థులలో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా ఉపకరిస్తాయి. మాథ్స్ / సైన్స్ ఒలంపియాడ్ తరహాలో తెలుగుకీ ఒక పోటీ ఉండాలని భావించి, ఈ పోటీ రూపకల్పన చేయడం జరిగింది.
2. పోటీకి సీ పీ బ్రౌన్ – SPB పేర్లెందుకు?
విదేశీయుడై ఉండి, ఉద్యోగరీత్యా భారత దేశానికి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడమే కాకుండా, అందులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేసిన ఆంగ్లేయుడు, సి.పి.బ్రౌన్. ఆయన తెలుగు భాషా సాహితీ లోకానికే ఆదర్శప్రాయుడు.
తెలుగంతా ఆంగ్లమయం అయిపోతున్న ఈ రోజుల్లో, తెలుగు భాష పట్ల విద్యార్థులలో అభిమానం పెంచడానికి ఈ ఆంగ్లేయుడినే స్ఫూర్తిగా తీసుకోవడం ఉచితమనిపించింది.
అందుకే ఆయన పేరున ₹ 1 లక్ష నగదు బహుమతిని ‘దాసుభాషితం CPB బహుమతి’ గా విజేతలైన విద్యార్థులకు వారి తెలుగు అధ్యాపకులకు అందజేస్తున్నాము. ఈ బహుమతి “కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి”తో సమానం.
ఇక, తెలుగు భాషపై శ్రీ S P బాలసుబ్రమణ్యం గారికి ఎంత ప్రేమ ఉండేదో మనందరికీ తెలుసు. గతంలో అడగ్గానే పోటీ కి ముందు మాటను చెప్పి పోటీను, విద్యార్థులను ఆశీర్వదించారు. ఆయన ఇపుడు మన మధ్య లేరు.
గత రెండు ఏళ్ళల్లో పిల్లలతో పాటు పెద్దలూ ఈ తెలుగు పోటీపై ఆసక్తి చూపారు. శ్రీ SPB పేరు మీద పోటీను తెలుగు వారందరికీ విస్తరించి, తెలుగు భాష పై మనకున్న ప్రేమను చాటి చెప్పే అవకాశంగా పోటీని మలచటం ఆయనకు సరియైన నివాళి అనిపించింది.
అందుకే ఆయన పేరున ₹ 1 లక్ష విలువైన దాసుభాషితం యాప్ సబ్‌స్క్రిప్‌షన్ ప్లాన్ లను ‘దాసుభాషితం SPB బహుమతి‘ గా విజేతలకు అందజేస్తున్నాము.
‘దాసుభాషితం SPB బహుమతి‘ కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎవరైనా పోటీ పడవచ్చు. ప్రవేశ రుసుమేమీ లేదు. అయితే పోటీలో పాల్గొనటానికి స్మార్ట్‌ఫోన్ అవసరం ఉంటుంది.
దాసుభాషితం CPB బహుమతి కి పోటీ ప్రధానంగా పాఠశాలల మధ్య. కేవలం ప్రజ్ఞ ఉన్న కొద్ది మంది విద్యార్థులకే ఈ పోటీ పరిమితం కాదు. తమతమ పాఠశాలల తరఫున ఎక్కువ మంది పదవ తరగతి విద్యార్థులు పాల్గొని, సంచితంగా (అంటే cumulative గా) అత్యధిక మార్కులతో, ఇతర పాఠశాలలపై గెలిచి పాఠశాలకు, గురువులకు, తమకు గుర్తింపు సాధించుకునే అవకాశం ఈ పోటీ కల్పిస్తుంది.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క పాఠశాల మాత్రమే విజేతగా నిలుస్తాయి. రెండవ మూడవ స్థానాలు ఉండవు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
4. విద్యార్థుల్లో పదవ తరగతి విద్యార్థులకే ఎందుకు?
ఇందుకు నాలుగు కారణాలు.
మొదటిది, పోటీ రసవత్తరంగా ఉండాలంటే అందులోని ప్రశ్నలు, కొన్ని సులువుగా, కొన్ని కఠినంగా సరైన మిశ్రమంలో విభిన్నంగా ఉండాలి.
పదవ తరగతి విద్యార్థులైతే ఎక్కువ పాఠ్యాంశాలని చదివి ఉంటారు కనుక, వేర్వేరు అంశాలలో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ప్రశ్నావళిని ఆసక్తికరంగా కూర్చవచ్చు.
రెండవది, గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతి గణనీయమైన మొత్తంలో ఉంది కనక పెద్ద తరగతి విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మూడవది, ఈ పోటీ పూర్తిగా Online మాధ్యమం ద్వారా నిర్వహించబడుతుంది. అంటే విద్యార్థికి కొంచెమైనా సాంకేతిక అవగాహన తప్పనిసరి. పరిణితి రీత్యా పదవ తరగతి విద్యార్థులకు ఈ అవగాహన ఉంటుంది.
నాల్గవది, పాఠశాలలో ఇదే తమ ఆఖరి విద్యా సంవత్సరం కాబట్టి, ఈ పోటీలో గెలిస్తే తమ తెలుగు ఉపాధ్యాయులకు, పాఠశాలకు అది తగిన గురుదక్షిణగా భావించి, విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు.
2020 బహుమతులు
దాసుభాషితం CPB బహుమతి భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో విజేతగా ప్రకటింపబడిన పాఠశాలకు సమకూరేవి:
పోటీలో పాల్గొన్న విద్యార్థులకు – రూ. 40000 (ఉమ్మడిగా), ప్రశంసా పత్రాలు.
తెలుగు ఉపాధ్యాయులకు (ఉమ్మడిగా) – రూ 10,116, సత్కారం, ప్రశంసా పత్రం.
పాఠశాల యాజమాన్యానికి – జ్ఞాపిక
దాసుభాషితం SPB బహుమతి లో భాగంగా
5 గురికి – ₹ 12000 విలువ ఉన్న దాసుభాషితం మహారాజ పోషక వార్షిక ప్లాన్.*
40 మందికి – ₹ 1000 విలువ ఉన్న దాసుభాషితం పరిపోషక వార్షిక ప్లాన్.**
* మహారాజ పోషక ప్లాన్ ద్వారా దాసుభాషితం యాప్ లో ఉన్న ప్రీమియం కాంటెంట్ అంతా వినవచ్చు. ** పరిపోషక ప్లాన్ ద్వారా దాసుభాషితం యాప్ లో ఉన్న ఉచిత కాంటెంట్ ను ప్రకటనల అంతరాయం లేకుండా, ఆఫ్‌లైన్ లో వినవచ్చు.
పోటీలో ఎలా పాల్గొనాలి?
పోటీలో పాల్గొనటానికి స్మార్ట్‌ఫోన్ లో దాసుభాషితం యాప్ ఉండడం తప్పనిసరి.
దాసుభాషితం యాప్ ను PlayStore నుంచి App Store నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పోటీ సంబంధిత సమాచారమంతా యాప్ నోటిఫికేషన్ ద్వారానే ఇవ్వబడుతుంది. కాబట్టి యాప్ నోటిఫికెషన్స్ కు అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.
పోటీ నిబంధనలు
పోటీకి నమోదు చేసుకునేటప్పుడు మీ ఇమెయిల్, ఫోన్ నెంబర్ ను విధిగా ఇవ్వవలసి ఉంటుంది. పోటీ సంబంధిత సమాచారం మీకు మరో విధంగా చేరవేసేందుకు మాకు సులువవుతుంది.
అయితే, మీ వివరాలు ఎవ్వరికి ఇవ్వబడవు.
పోటీ దరఖాస్తు ఫారంలో సరియైన వివరాలు ఇచ్చే బాధ్యత విధ్యార్థులదే.
బహుమతుల వితరణ సమయంలో విద్యార్థులు గెలిచిన పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నవారని ధృవీకరించవలసి ఉంటుంది.
ఫలితాల నిర్ణయంలో దాసుభాషితం న్యాయ నిర్ణేతల నిర్ణయమే అంతిమం. దీనిలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు ఉండదు.