# C.P-BROWN-Varshika-Patasalala-Telugu-poteelu-Competitions-2020

- Link: https://amaravathiteacher.com/c-p-brown-varshika-patasalala-telugu-poteelu-competitions-2020/
- Published: 2020-12-02T19:49:46+05:30
- Author: amaravathiteacher

## **C.P-BROWN-Varshika-Patasalala-Telugu-poteelu-Competitions-2020**

[[

### **తెలుగు రాష్ట్రాల పదవ తరగతి విద్యార్థులు, వారి తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాల కూడా ₹ 1,00,000 వరకూ నగదు బహుమతులు, సత్కారాలు,  ప్రశంసా పత్రాలు, ఇంకా తెలుగు ప్రజలు ₹ 100,000 విలువైన బహుమతులు**⏎ **గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.**

### **పోటీ – ముఖ్యమైన తేదీలు**

### **నమోదు ఆఖరు తేదీ**

 * 
   ### **Dec 10, 2020 (గురువారం)**
   

### **పోటీ తేదీ**

 * 
   ### **Dec 13, 2020 ఆదివారం (పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహింపబడుతుంది).**
   

### **విజేతల ప్రకటన**

 * 
   ### **Dec 20, 2020 ఆదివారం.**
   

### **వివరాలు**

### 󠀁[**1. పోటీ ఎందుకు?**](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-Enduku)󠁿

### **󠀁[2. పోటీకి సీ పీ బ్రౌన్ – SPB పేర్లెందుకు?](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-Perenduku)󠁿**

### **󠀁[3. పోటీ ఎవరికి?](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-evariki)󠁿**

### **󠀁[4. విద్యార్థుల్లో పదవ తరగతి విద్యార్థులకే ఎందుకు?](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-Padava)󠁿**

### **󠀁[5. 2018, 2019 లో విజేతలు](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-2018-vijetalu)󠁿**

### **󠀁[6. 2020 పోటీ బహుమతులు](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-Bahumatulu)󠁿**

### **󠀁[7. పోటీ – ముఖ్యమైన తేదీలు](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-tedeelu)󠁿

### **󠀁[8. పోటీలో ఎలా పాల్గొనాలి?](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-ela-palgonali)󠁿

### **󠀁[9. పోటీ ఎలా ఉంటుంది?](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-ela-untundi)󠁿

### **󠀁[10. ఎలా సన్నద్ధం కావాలి?](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Potee-ela-sannadham)󠁿

### **󠀁[11. విజేతల నిర్ణయ విధానం](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#Vijeta-Nirnayam)󠁿

### **󠀁[12. నిబంధనలు](https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about?utm_source=ap-teachers&utm_medium=SMS&utm_campaign=CPB-SPB-Potee#potee-nibandanalu)󠁿**

### **తెలుగు భాషకు ఆలంబన తెలుగు సాహిత్యం. **

### **ఈ ఆధునిక యుగంలో ఆ సాహిత్యాన్ని సులువుగా ఆస్వాదించడానికి, దాసుభాషితం శ్రవణ మాధ్యమంలో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు సాహిత్యం పరిఢవిల్లడానికి భాషాభిమానం అవసరం. **

### **అది పాఠశాల దశలోనే ఏర్పడితే జీవితాంతం ఉంటుంది. **⏎ **ఒక విషయం మీద విద్యార్థులలో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా ఉపకరిస్తాయి. మాథ్స్ / సైన్స్ ఒలంపియాడ్ తరహాలో తెలుగుకీ ఒక పోటీ ఉండాలని భావించి, ఈ పోటీ రూపకల్పన చేయడం జరిగింది.**

### **2. పోటీకి సీ పీ బ్రౌన్ – SPB పేర్లెందుకు?**

### **విదేశీయుడై ఉండి, ఉద్యోగరీత్యా భారత దేశానికి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడమే కాకుండా, అందులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేసిన ఆంగ్లేయుడు, సి.పి.బ్రౌన్. ఆయన తెలుగు భాషా సాహితీ లోకానికే ఆదర్శప్రాయుడు.**⏎ **తెలుగంతా ఆంగ్లమయం అయిపోతున్న ఈ రోజుల్లో, తెలుగు భాష పట్ల విద్యార్థులలో అభిమానం పెంచడానికి ఈ ఆంగ్లేయుడినే స్ఫూర్తిగా తీసుకోవడం ఉచితమనిపించింది. ****అందుకే ఆయన పేరున ₹ 1 లక్ష నగదు బహుమతిని ‘దాసుభాషితం CPB బహుమతి’ గా విజేతలైన విద్యార్థులకు వారి తెలుగు అధ్యాపకులకు అందజేస్తున్నాము. ఈ బహుమతి “కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి”తో సమానం.****ఇక, తెలుగు భాషపై శ్రీ S P బాలసుబ్రమణ్యం గారికి ఎంత ప్రేమ ఉండేదో మనందరికీ తెలుసు. గతంలో అడగ్గానే పోటీ కి ముందు మాటను చెప్పి పోటీను, విద్యార్థులను ఆశీర్వదించారు. ఆయన ఇపుడు మన మధ్య లేరు.****గత రెండు ఏళ్ళల్లో పిల్లలతో పాటు పెద్దలూ ఈ తెలుగు పోటీపై ఆసక్తి చూపారు. శ్రీ SPB పేరు మీద పోటీను తెలుగు వారందరికీ విస్తరించి, తెలుగు భాష పై మనకున్న ప్రేమను చాటి చెప్పే అవకాశంగా పోటీని మలచటం ఆయనకు సరియైన నివాళి అనిపించింది.****అందుకే ఆయన పేరున ₹ 1 లక్ష విలువైన దాసుభాషితం యాప్ సబ్‌స్క్రిప్‌షన్ ప్లాన్ లను ‘దాసుభాషితం SPB బహుమతి‘ గా విజేతలకు అందజేస్తున్నాము.**

### **󠀁[ONLINE RGISTRATION FOR CLICK HERE](https://dasubhashitam.typeform.com/to/gcOa9Mw2)󠁿**

### **󠀁[Dasubhashitam — Telugu Audio Books CLICK HERE](https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam)󠁿**

### **3. పోటీ ఎవరికి ?**

### **‘దాసుభాషితం SPB బహుమతి‘ కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎవరైనా పోటీ పడవచ్చు.**⏎ **‍****ప్రవేశ రుసుమేమీ లేదు. అయితే పోటీలో పాల్గొనటానికి స్మార్ట్‌ఫోన్ అవసరం ఉంటుంది.**

### **దాసుభాషితం CPB బహుమతి కి పోటీ ప్రధానంగా పాఠశాలల మధ్య. కేవలం ప్రజ్ఞ ఉన్న కొద్ది మంది విద్యార్థులకే ఈ పోటీ పరిమితం కాదు. తమతమ పాఠశాలల తరఫున ఎక్కువ మంది పదవ తరగతి విద్యార్థులు పాల్గొని, సంచితంగా (అంటే cumulative గా) అత్యధిక మార్కులతో, ఇతర పాఠశాలలపై గెలిచి పాఠశాలకు, గురువులకు, తమకు గుర్తింపు సాధించుకునే అవకాశం ఈ పోటీ కల్పిస్తుంది. **⏎ **తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క పాఠశాల మాత్రమే విజేతగా నిలుస్తాయి. రెండవ మూడవ స్థానాలు ఉండవు. ****తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.**

### **4. విద్యార్థుల్లో పదవ తరగతి విద్యార్థులకే ఎందుకు?**

### **ఇందుకు నాలుగు కారణాలు.**

 1. 
    ### **మొదటిది, పోటీ రసవత్తరంగా ఉండాలంటే అందులోని ప్రశ్నలు, కొన్ని సులువుగా, కొన్ని కఠినంగా సరైన మిశ్రమంలో విభిన్నంగా ఉండాలి.**
    
 2. 
    ### **పదవ తరగతి విద్యార్థులైతే ఎక్కువ పాఠ్యాంశాలని చదివి ఉంటారు కనుక, వేర్వేరు అంశాలలో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ప్రశ్నావళిని ఆసక్తికరంగా కూర్చవచ్చు.**
    
 3. 
    ### **రెండవది, గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతి గణనీయమైన మొత్తంలో ఉంది కనక పెద్ద తరగతి విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.**
    
 4. 
    ### **మూడవది, ఈ పోటీ పూర్తిగా Online మాధ్యమం ద్వారా నిర్వహించబడుతుంది. అంటే విద్యార్థికి కొంచెమైనా సాంకేతిక అవగాహన తప్పనిసరి. పరిణితి రీత్యా పదవ తరగతి విద్యార్థులకు ఈ  అవగాహన ఉంటుంది.**
    
 5. 
    ### **నాల్గవది, పాఠశాలలో ఇదే తమ ఆఖరి విద్యా సంవత్సరం కాబట్టి, ఈ పోటీలో గెలిస్తే తమ తెలుగు ఉపాధ్యాయులకు, పాఠశాలకు అది తగిన గురుదక్షిణగా భావించి, విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు.**
    

### **2020 బహుమతులు**

### **దాసుభాషితం CPB బహుమతి భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో విజేతగా ప్రకటింపబడిన పాఠశాలకు సమకూరేవి:**

 * 
   ### **పోటీలో పాల్గొన్న విద్యార్థులకు – రూ. 40000 (ఉమ్మడిగా), ప్రశంసా పత్రాలు.**
   
 * 
   ### **తెలుగు ఉపాధ్యాయులకు (ఉమ్మడిగా) – రూ 10,116, సత్కారం, ప్రశంసా పత్రం. **
   
 * 
   ### **పాఠశాల యాజమాన్యానికి – జ్ఞాపిక **
   

### **దాసుభాషితం SPB బహుమతి లో భాగంగా**

 * 
   ### **5 గురికి – ₹ 12000 విలువ ఉన్న దాసుభాషితం మహారాజ పోషక వార్షిక ప్లాన్.\***
   
 * 
   ### **40 మందికి – ₹ 1000 విలువ ఉన్న దాసుభాషితం పరిపోషక వార్షిక ప్లాన్.\*\***
   

### **\* మహారాజ పోషక ప్లాన్ ద్వారా దాసుభాషితం యాప్ లో ఉన్న ప్రీమియం కాంటెంట్ అంతా వినవచ్చు.**⏎ **\*\* పరిపోషక ప్లాన్ ద్వారా దాసుభాషితం యాప్ లో ఉన్న ఉచిత కాంటెంట్ ను ప్రకటనల అంతరాయం లేకుండా, ఆఫ్‌లైన్ లో వినవచ్చు.**

### **పోటీలో ఎలా పాల్గొనాలి?**

 * 
   ### **పోటీలో పాల్గొనటానికి స్మార్ట్‌ఫోన్ లో దాసుభాషితం యాప్ ఉండడం తప్పనిసరి.**
   
 * 
   ### **దాసుభాషితం యాప్ ను 󠀁[Play Store](https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam)󠁿 నుంచి 󠀁[App Store](https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474)󠁿 నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.**
   
 * 
   ### **పోటీ సంబంధిత సమాచారమంతా యాప్ నోటిఫికేషన్ ద్వారానే ఇవ్వబడుతుంది. కాబట్టి యాప్ నోటిఫికెషన్స్ కు అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.**
   

### **పోటీ నిబంధనలు**

### **పోటీకి నమోదు చేసుకునేటప్పుడు మీ ఇమెయిల్, ఫోన్ నెంబర్ ను విధిగా ఇవ్వవలసి ఉంటుంది. పోటీ సంబంధిత సమాచారం మీకు మరో విధంగా చేరవేసేందుకు మాకు సులువవుతుంది. **

### **అయితే, మీ వివరాలు ఎవ్వరికి ఇవ్వబడవు.**⏎ **పోటీ దరఖాస్తు ఫారంలో సరియైన వివరాలు ఇచ్చే బాధ్యత విధ్యార్థులదే.****బహుమతుల వితరణ సమయంలో విద్యార్థులు గెలిచిన పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నవారని ధృవీకరించవలసి ఉంటుంది.****ఫలితాల నిర్ణయంలో దాసుభాషితం న్యాయ నిర్ణేతల నిర్ణయమే అంతిమం. దీనిలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు ఉండదు.**

### **󠀁[Dasubhashitam — Telugu Audio Books CLICK HERE](https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
