Career-Edge-Digital-Teacher-Online-Course-for-Teachers-from-TCSiON-2020
టీచర్లకు డిజిటల్ కోర్సులో ఉచిత శిక్షణ*
డిజిటల్ శకంలో ‘టెక్నాలజీ వినియోగంతో బోధన’పై 15 రోజుల ఉచిత కోర్సును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి చెందిన టీసీఎస్ అయాన్ ప్రారంభించింది.
‘కెరీర్ ఎడ్జ్ – డిజిటల్ టీచర్’ పేరిట రూపొందించిన ఈ ఆన్లైన్ కోర్సులో టీచర్లు ఎవరైనా చేరి, తమ డిజిటల్ బోధన నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
కొవిడ్ నేపథ్యంలో ఇప్పుడు లక్షలాది మంది టీచర్లు తరగతుల నిర్వహణకు డిజిటల్ సాధనాలను వినియోగించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో టీచర్లకు ప్రత్యేకంగా అవసరమైన నైపుణ్యాలు, ఆధునాతన బోధన విధానాలు వంటివి ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
రోజుకు 1-2 గంటల పాటు సమయం వెచ్చిస్తే సరిపోయేలా దీనిని రూపకల్పన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు అభినందనలు తెలుపుతూ ఈ కోర్సును అందిస్తున్నట్లు టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి తెలిపారు.
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
https://learning.tcsionhub.in/ courses/career-edge-digital- teacher/
కరోనా మహమ్మారి లక్షలాది మంది ఉపాధ్యాయులపై అపారమైన ఒత్తిడిని కలిగించింది.
బోధనలో తప్పనిసరిగా డిజిటల్ ఉపకరణాలను స్వీకరించేలా చేసింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎ్స)కు చెందిన టీసీఎస్ అయాన్ ఉపాఽధ్యాయులకు ఉచిత డిజిటల్ కోర్సును ‘కెరీర్ ఎడ్జ్-డిజిటల్ టీచర్‘ పేరుతో ఆవిష్కరించింది.
ఈ కోర్సు కోసం ప్రతి రోజూ 1-2 గంటల సమయాన్ని 15 రోజుల పాటు వెచ్చించాల్సి ఉంటుందని టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ రామస్వామి తెలిపారు.
కోర్సును ఎక్కడి నుంచైనా, ఏ ఉపకరణం ద్వారా అయినా నేర్చుకోవచ్చన్నారు.
విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అంతర్గత పరీక్షలను నిర్వహించి ‘డిజిటల్ టీచర్స్’ సర్టిఫికెట్ను అందజేస్తామని తెలిపారు.
ఉపాధ్యాయులు సంప్రదాయ తరగతి గది, వీడియో సదస్సులకు ఆవల డిజిటల్ ఉపకరణాల వైపు మరలాల్సిన సమయం ఇదేనన్నారు.
ఆసక్తిగల వారు https://learning.tcsionhub.in/ -courses/ careeredgedigitalteacher వెబ్సైట్ ద్వారా కోర్సును అభ్యసించవచ్చని ఆయన పేర్కొన్నారు.*
Course Syllabus
This course comprises the following modules
TCSION FOR DIGITAL TEACHER ONLINE COURSE
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
