celebrations-of-sports-day-on-30th-January-2020-instructions-proceedings

celebrations-of-sports-day-on-30th-January-2020-instructions-proceedings

File No.SSA-15024/46/2019-SAMO-SSA

*‍♂సమగ్ర శిక్ష – ఆంధ్రప్రదేశ్, అమరావతి*

*ది.30-01-2020 తేదీన క్రీడా దినోత్సవం నిర్వహించుటకు మార్గదర్శకములు

      _జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎక్సఆఫీసియో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారులందరూ జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులకు SCERT రూపందించిన అకాడమిక్ క్యాలెండరు ప్రకారంది. 30.01.2020 వ తేదీన “క్రీడా దినోత్సవం” నిర్వహించుటకు మార్గదర్శకాలు పాటించవలసి యున్నది._

        _క్రీడా దినోత్సవం నిర్వహించుట ద్వారా విద్యార్ధులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుటకు శారీరక, మానసిక, ఆరోగ్యం సాధించుటకు, జీవన విలువలు, నైపుణ్యాలు పెంపొందించుటకు క్రీడలు దోహదపడతాయి._

* కొన్ని ముఖ్య సూచనలు:*

1. అందరు జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎక్సఆఫీసియో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారులందరూ క్రీడా దినోత్సవం ది.30.01.2020 తేదీన నిర్వహించుటకు విస్తృత ప్రచారం ఇవ్వవలెను.

2. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవలెను.

3.క్రీడా దినోత్సవం జయప్రదంగా నిర్వహించుటకు జిల్లా స్థాయిలో అకడమిక్ మోనిటరింగ్ అధికారి మరియు కమ్యూనిటి మోబలైజేషన్ అధికారి బాధ్యత వహించవలెను.

4.మార్గదర్శక సూత్ర్ములు అన్ని పాఠశాలలకు పంపించి అందరు ప్రధానోపాధ్యాయులు కార్యక్రమము విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవలెను.

5. క్రీడా దినోత్సవం నిర్వహించడమే కాకుండా దీనికి సంబంధించిన పోటోలతో డాక్యుమెంటేషన్ సమగ్ర శిక్ష కార్యాలయమునకు అందజేయుటకు మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవలెను.

6.క్రీడా దినోత్సవ నిర్వహణకు సహాయ గ్రాంటు సమగ్ర శిక్ష కార్యాలయము ద్వారా విడుదల చేయబడును.

*✴ మండల స్థాయిలో నిర్వహించవలసిన కార్యక్రమాలు:*

➤ మండలములోని అన్ని పాఠశాలల భాగస్వామ్యం

➤ పాఠశాల స్థాయిలో క్రీడా వారోత్సవాలు నిర్వహించాలి.

➤ పాఠశాల స్థాయిలో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్ధిని, విద్యార్ధులకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించాలి.

➤ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి.

➤ విద్యార్ధులను అన్ని పోటీలలో పాల్గొనేలా ప్రోత్సాహించాలి.

*✴ మండల విద్యాశాఖాధికారుల బాధ్యతలు:*

➤ మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.

➤ నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా MEO ఉంటారు.

➤ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మండలములో కమిటీ కన్వీనర్ గా ఉంటారు.

➤ సీనియర్ ప్రధానోపాధ్యాయులు కమిటీ మెంబర్ గా ఉంటారు.

➤ మండలములోని ముగ్గురు సీనియర్ PET లు మెంబర్లుగా ఉంటారు.

〰〰〰〰〰〰〰〰

 కమిటీ బాధ్యతలు:*

1. క్రీడా దినోత్సవం నిర్వహించుటకు అన్ని వసతులతో కూడిన ఒక ఉన్నత పాఠశాలను గుర్తించవలెను.

2. క్రీడా దినోత్సవం నిర్వహణా రోజుకు వారం రోజుల ముందు ది.23.01.2020న ఒక ప్రకటన ద్వారా అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వవలెను.

3. పాఠశాల స్థాయిలో సెలెక్ట్ కాబడిన విన్నర్స్ మరియు రన్నర్స్ జాబితాలను 28.01.2020 న మండల స్థాయి కమిటీకి అందించవలెను.

4. మండల స్థాయి కమిటీ ది.29.01.2020 మరియు 30.01.2020 తేదీలలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించవలెను.

5. మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ది.30-01-2020 తేదీన క్రీడా దినోత్సవం సభలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వవలెను.

* కార్యక్రమ అమలు విధానము:*

SPORTS/YOGA DAY INSTRUCTIONS DOWNLOAD

2019-20 సంవత్సరంలో ఈ క్రింది కేటగిరిలలో మండల స్థాయి, పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించవలెను._

*⚛1)  టెన్ని కాయిట్*

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 1+1=2

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 1+1=2

⚫ మొత్తం: 4

*⚛2) కబడ్డీ*

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 12+12=24

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 12+12=24

⚫ మొత్తం: 48

*⚛3) ఖో-ఖో*

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 12+12=24

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 12+12=24

⚫ మొత్తం: 48

*⚛4) వాలీబాల్*

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 12+12=24 

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 12+12=24

⚫ మొత్తం: 48

*⚛5) యోగా*

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 2+2=4

➤ విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 2+2=4

⚫ మొత్తం: 8

⚫ మొత్తం విన్నర్స్ & రన్నర్స్ బాలికలు: 78

⚫ మొత్తం విన్నర్స్ & రన్నర్స్ బాలురు: 78

⚫ మొత్తం: 156

〰〰〰〰〰〰〰〰

*✳పోటీల నిర్వహణకు నిబంధనలు:*

*👉విద్యార్థినీ, విద్యార్ధుల అర్హతలు⤵*

➤ వయో పరిమితి: U-14 yrs

➤ పుట్టిన తేదీ: 1-01-2005

➤ తరగతి/ వయస్సు:  8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులు అర్హులు. (9,10 తరగతుల విద్యార్థులు అనర్హులు)

SPORTS ANNEXURE-1 DOWNLOAD

SPORTS DAY/YOGA DAY GUIDELINES IN TELUGU DOWNLOAD

error: Content is protected !!