Centa-teaching-professionals-olympiad-Reliance-foundation–awards-2019

Centa-teaching-professionals-olympiad-Reliance-foundation–awards-2019

Teacher Award: టీచర్లకు అవార్డులు… రూ.1 లక్ష విలువైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్

సెంటా టీపీఓలో విజేత‌లుగా నిలిచిన వారి అభిప్రాయం ప్రకారం…

ప‌రీక్ష‌లో విజ‌యం సాధించేందుకు ప్ర‌త్యేకంగా సిద్ధం అవ‌డం కంటే నిరంతరం బోధ‌నాభ్యాసంలో ఉన్న‌వారి సామ‌ర్థ్యాల‌ను ప‌రీక్షించే విధంగానే ఉంటుంది.

75 నగరాల్లో ఉపాధ్యాయులకు సెంటా పోటీలు

భార‌త‌దేశ‌ వ్యాప్తంగా బోధ‌న‌లో నైపుణ్యతను పెంపొందించ‌డమే ల‌క్ష్యంగా సెంటా కృషిచేస్తోంది. సెంట‌ర్ ఫ‌ర్ టీచ‌ర్ అక్రిడిటేష‌న్(సెంటా), టీచింగ్ ప్రొఫెష‌న‌ల్స్ ఒలంపియాడ్(టీపీఓ)లు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులకు వారి నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రతీ ఏటా వార్షిక పోటీలను నిర్వహిస్తుంటాయి.

ఈ సందర్భంగా డిసెంబర్‌14, 2019న భారతదేశ వ్యాప్తంగా ఉన్న 75 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.*

ఈ మేరకు సెంటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించనుంది. అదే విధంగా పోటీలో విజేతలుగా నిలిచినవారికి రూ. లక్ష నగదుతో పిటు రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డును అందించనున్నారు.* *అదేవిధంగా టీపీవో ధృవీకరణ పత్రంతో పాటు, యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో మాస్టర్‌ క్లాస్ హాజ‌ర‌య్యేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది.*

*ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్‌ 25, 2019 తుది గడువని సెంటా తెలిపింది.

సెంటా టీపీవో పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి  లింక్ ద్వారా లాగిన్‌ అయి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

ఈ పోటీలకు 18 ఏళ్లకు పైబడి, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, బీఈడీ/డీఈడీ విద్యార్థులు, పాఠ‌శాల ఉపాధ్యాయులు, స‌ప్లిమెంట‌ల్ టీచ‌ర్లు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేట‌ర్లు, కంటెంట్ క్రియేట‌ర్లు, బోధ‌నాభ్యాసంపై ఆస‌క్తి క‌లిగి ఉన్న ఇత‌రులు ఎవ‌రైనా పాల్గొనవచ్చని సెంటా తెలిపింది*

*పరీక్షా విధానం

సెంటా టీపీఓకు 12 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల బోర్డుల‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జీ వంటి అన్ని బోర్డులు అండగా నిలుస్తున్నాయి.

భార‌త‌దేశవ్యాప్తంగా 30,000కు పైగా పాఠ‌శాల‌ల త‌ర‌ఫున ఉపాధ్యాయులు పోటీ ప‌డుతున్నారు. సెంటా టీపీఓ పరీక్షలో మ‌ల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

ఈ పరీక్ష నిడివి రెండు గంట‌లు కాగా  ఎన్‌సీఈఆర్‌టీ సిల‌బ‌స్‌లోని కామ‌న్ టాపిక్‌ల‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

ప్రధానంగా ఆయా అంశాల‌ను అర్థం చేసుకోవ‌డం, అన్వయించుకోవ‌డంపై ప్రశ్నలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సెంటా వ్యవస్థాప‌కురాలు అంజ‌లీ మాట్లాడుతూ… బోధ‌న‌ను ఉత్తమ‌మైన వృత్తిగా ఎంచుకోవ‌డాన్ని ప్రోత్స‌హించేందుకు సెంటా టీపీఓ ఎప్పుడు క‌ట్టుబ‌డి ఉంటుంది.* *ఉపాధ్యాయులలోని ప్రతిభను గుర్తించి నగదుతో ప్రోత్స‌హిస్తాం.*

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారా? రూ.1 లక్ష విలువైన అవార్డు గెలుచుకునే అవకాశమిది.

ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తూ, రాణిస్తున్న టీచర్లకు రిలయెన్స్ ఫౌండేషన్ ప్రతీ ఏటా అవార్డులు అందిస్తోంది.

సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్-CENTA, టీచర్స్ ప్రొఫెషనల్స్ ఒలంపియాడ్-TPO సంయుక్తంగా ఈ పురస్కారాలను అందించనుంది. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో 2019 డిసెంబర్ 14న ఈ కార్యక్రమం జరగనుంది.

ఆసక్తిగల ఉపాధ్యాయులు  వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌కు 2019 నవంబర్ 25 చివరి తేదీ. సెంటా టీపీఓ మ‌ల్టీపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల‌తో రెండు గంట‌ల నిడివి గ‌ల‌ ప‌రీక్ష ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ సిల‌బ‌స్‌లోని కామ‌న్ టాపిక్‌ల‌కు సంబంధించిన స‌బ్జెక్టుల ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఆయా అంశాల‌ను అర్థం చేసుకోవ‌డం, అన్వ‌యించుకోవ‌డంపై ప్ర‌శ్న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. సెంటా టీపీఓలో విజేత‌లుగా నిలిచిన వారి అభిప్రాయం ప్రకారం…

ప‌రీక్ష‌లో విజ‌యం సాధించేందుకు ప్ర‌త్యేకంగా సిద్ధం అవ‌డం కంటే నిరంతరం బోధ‌నాభ్యాసంలో ఉన్న‌వారి సామ‌ర్థ్యాల‌ను ప‌రీక్షించే విధంగానే ఉంటుంది.

బోధ‌న‌ను ఉత్త‌మ‌మైన వృత్తిగా ఎంచుకోవ‌డాన్ని ప్రోత్స‌హించేందుకు సెంటా టీపీఓ క‌ట్టుబ‌డి ఉంది. ఆ ఆస‌క్తిని గుర్తించ‌డం న‌గ‌దు బ‌హుమ‌తుల‌తో ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా సాగుతోంది.

సెంటా టీపీఓ పరీక్షకు 18 ఏళ్ల వయస్సు గల ఉపాధ్యాయులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. డిగ్రీ పాస్ కావాలి.

స్కూల్ టీచర్లు, సప్లిమెంటరీ టీచర్లు, ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లు, కంటెంట్ క్రియేటర్లు, బీఈడీ/డీఈడీ విద్యార్థులు, బోధనాభ్యాసంపై ఆసక్తిగలవారు ఎవరైనా ఇందులో పాల్గొనొచ్చు.

1000 మందిని ఎంపిక చేసి రిలయెన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డులను అందిస్తారు.

ఒక్కొక్కరికీ రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాన్ని అందిస్తారు.

టీపీఓ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు పుస్తకానికి సహ రచయితగా ఉండే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్ క్లాస్‌కు హాజ‌ర‌య్యేందుకు అవ‌కాశం లభించొచ్చు.

సెంటా టీపీఓకు 12 రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ఆయా రాష్ట్రాల బోర్డుల‌తో పాటుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జి లాంటి అన్ని బోర్డులు అండగా నిలుస్తున్నాయి.

ప్రతీ ఏటా భార‌త‌దేశవ్యాప్తంగా 30,000 పైగా పాఠ‌శాల‌ల త‌ర‌ఫున ఉపాధ్యాయులు పోటీప‌డుతున్నారు.

ప్రైవేట్ స్కూల్స్ కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లా శంఖ‌వ‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మోడ‌ల్ స్కూల్‌కు చెందిన సౌమ్య మిట్ట‌ప‌ల్లె స‌బ్జెక్ట్ కేట‌గిరీలో సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ ఇంగ్లిష్ విభాగంలో మూడో ర్యాంకును సాధించారు.

సెంటా టీపీఓ 2018లో జాతీయ స్థాయిలో 377వ ర్యాంక్‌ను పొందారు.

ఆమె రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ టీచ‌ర్ అవార్డ్, టీపీఓ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని సొంతం చేసుకున్నారు.

మరింత స‌మాచారం కోసం [email protected], +91 9840240612, సంప్రదించండి.

CENTA OFFICIAL WEBSITE

error: Content is protected !!