central-government-announced-3-districts-in-AP-5-districts-in-Telanagana-lock-down

central-government-announced-3-districts-in-AP-5-districts-in-Telanagana-lock-down

ఏపీలో మూడు జిల్లాలు లాక్‌డౌన్.. సేవలన్నీ బంద్!

ఏపీలో ఇంటింటికీ రూ.1000, ఉచిత రేషన్… ఇచ్చే డేట్ ఇదే..

AP Lockdown News | పేదలకు ఉచిత రేషన్, కేజీ కందిపప్పుతో పాటు రూ.1000 ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

మార్చి 29వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంచుతామని జగన్ చెప్పారు.

ఏప్రిల్ 4వ తేదీన గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి వారికి రేషన్, రూ.1000 ఇచ్చి వెళతారని జగన్ ప్రకటించారు.

ఉచితంగా రేషన్, రూ.1000 చొప్పున ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఖర్చు అవుతాయని జగన్ అన్నారు.

  కరోనా వైరస్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆదివారం సాయంత్రం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు.

దేశంలో 75 జిల్లాలను లాక్ డౌన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో ఏపీలో మూడు, తెలంగాణలో ఐదు జిల్లాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్ 19) వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

కోవిడ్ 19ప్రభావం ఉన్న దేశంలోని 75 జిల్లాలను లాక్‌ డౌన్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నెల 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని పేర్కొంది.

లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూసివేయనున్నట్లు ప్రకటించింది. 

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 75 జిల్లాల జాబితాను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 3 జిల్లాలు ఉన్నాయి.

ఏపీలో కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాలు,

పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తూ, ప్రతి ఇంటికి రూ.1000* ఆర్థికసాయం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్‌ అందుబాటులోకి ఉంటుందని, రేషన్‌ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు.

ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అందరూ 14 రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఎమన్నారో ఆయన మాటల్లోనే..

*104కు కాల్‌ చేయండి*
కరానాను ఎదుర్కొవడంలో మిగిలిన రాష్ట్రాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది.

రాష్ట్రంలో 6 కేసులు మాత్రమే నమోదు కాగా, అందులో ఒక కేసు నయమయ్యింది.

రాష్ట్రంలో 2.50లక్షలకు పైగా ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. అందువల్లే పరిస్థితి చాలా వరకు అదుపులో ఉంది. ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేయండి.

*31వ తేదీ వరకు సకలం బంద్‌ చేద్దాం*
కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్‌ సంస్థలకు హాలీడేస్‌ ఇచ్చాం.

31వ తేదీ వరకు సెలవులు ఇచ్చాం. పదో తరగతి పరీక్షలు యధాతథంగా జరుగుతాయి.

ఇవన్నీ జరుగుతుండగానే దేశం మొత్తం మీదా దీన్ని శాశ్వతంగా అరికట్టాలనే దానిపై చర్చ జరుగుతుంది.

ప్రతి రాష్ట్రంలో కూడా అవగాహన పెరగాలి. ఇంకొకరికి వ్యాధి సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలి.

ప్రతిఒక్కరూ నిర్ధిష్టమైన ప్రాంతంలో ఉండగలిగితే వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చు. మనం కూడా 31వ తేదీ వరకు సకలం బంద్‌ చేద్దాం.

ఇందులో భాగంగానే మనం కూడా రవాణా వ్యవస్థను కట్టడి చేస్తాం.

అందరూ కూడా సహకరించుకోవాలి.  ఆటోలు, ట్యాక్సీలు కూడా తప్పనిసరి అయితేనే ఉపయోగించుకోవాలి.

ఇద్దరి కంటే కూడా ఎక్కువగా ఎక్కించుకోవద్దని సూచిస్తున్నాం.

గోల్డ్‌ షాపులు, బట్టల షాపులు అన్నీ కూడా మార్చి 31 వరకు మూత వేయాలి. ఫ్యాక్టరీలు, గోడౌన్లు కూడా అవసరమైతేనే నడపండి.

ప్రభుత్వం కూడా రోటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులను వాడుకుంటాం.

విదేశాల నుంచి వచ్చిన వారిలో 11,670 మందిని స్కాన్ చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారంతా 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు.

వారు బయటకు రాకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం కరోనా భయంతో రేట్లు పెంచేసి అమ్మితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హెచ్చరించారు.

వారిని అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు.

అన్నీ ధరల రేట్లను కలెక్టర్లు ప్రకటన ఇస్తారని, అంతకు మించి వస్తువులను విక్రయిస్తే.. వారి వివరాలను ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల కోవిడ్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఏపీలో ఇప్పటి వరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న సీఎం జగన్ వారిలో ఒకరికి నయం అయిందన్నారు.

మీ చుట్టుపక్కల ఉన్న వారికి కరోనా లక్షణాలు ఉంటే 104కు నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలన్నారు.

ఏపీ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు ఉచిత రేషన్, కేజీ పప్పు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

error: Content is protected !!