# Chandrayaan-2-landing-live-video-watch-how-vikram-lander-to-make-soft-landing-on-moon

- Link: https://amaravathiteacher.com/chandrayaan-2-landing-live-video-watch-how-vikram-lander-to-make-soft-landing-on-moon/
- Published: 2019-09-06T20:45:03+05:30
- Author: amaravathiteacher

## **Chandrayaan-2-landing-live-video-watch-how-vikram-lander-to-make-soft-landing-on-moon**

[[

## **Chandrayaan-2 Moon Landing**

## **ఆ అద్భుత క్షణాలను ఇక్కడ Liveలో చూడండి**

### **మరికొద్ది గంటల్లో ‘చంద్రయాన్-2’ నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీదకు దిగనుంది.**

### ** ఆ అరుదైన దృశ్యాన్ని లైవ్‌లో చూసే అవకాశాన్ని ఇస్రో మీకు కల్పిస్తోంది. పీఐబీ ఇండియా ‘యూట్యూబ్’లో ఈ వీడియోను షేర్ చేసింది. **

### **శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 1 గంటకు ఈ లైవ్ వీడియోలో ‘చంద్రయాన్-2’ ల్యాండింగ్‌ను చూడవచ్చు.**

### **ఇటీవలే చంద్రయాన్-2 నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడికి 35 కిలోమీటర్లు నుంచి 101 కిలోమీటర్ల మధ్య చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.40 గంటల నుంచి 1.55 గంటల మధ్య చంద్రుడిలోని దక్షిణ ధ్రువంలో దిగనుంది. **

### **రాత్రి 1.40కి అది చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది. విక్రమ్ ల్యాండర్‌ను విడిచిన చంద్రయాన్-2 ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడికి 96 నుంచి 125 కిలోమీటర్లు కక్ష్యలో తిరుగుతోంది.**

### **చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ దిగే స్థలం ఎగుడు దిగుడులతో నిండి ఉంది. **

### **దీంతో శాస్త్రవేత్తలు ల్యాండర్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అనే టెన్షన్ నెలకొంది. **

### **ఈ నేపథ్యంలో ‘చంద్రయాన్-2’ ఆర్బిటర్‌కు ఉండే హై రిజుల్యూషన్ కెమేరా ద్వారా అనుకూలమైన స్థలాన్ని వెతికి ల్యాండర్‌ను దించేలా ప్లాన్ చేశారు. **

### **ఆ తర్వాత ల్యాండర్ దిగేందుకు సుమారు 15 నిమిషాలు పడుతుంది. **

### **ఈ మిషన్‌లో ఇదే కీలకమైన ప్రక్రియ. **

### **ఇందులో ఏ మాత్రం తప్పిదం జరిగినా.. ప్రయోగం వ్యర్థమవుతుంది.**

### **చంద్రయాన్-2.. ‘విక్రమ్’ ల్యాండింగ్ వీడియో LIVE (శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. 1 గంటకు మొదలు):**

### **ఇలా పనిచేస్తుంది:**

 * 
   ### **ఇప్పటికే చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. దానికదే చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. దానికి ఉండే ఇంధనాలను మండించడం ద్వారా దాన్ని మెల్లగా నిర్దేశిత ప్రాంతంలో దించుతారు.**
   
 * 
   ### **ఇది సెకండ్‌కు మూడు అడుగుల చొప్పున కిందికి దిగుతుంది. అనంతరం ల్యాండర్‌లో ఉండే ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది.**
   
 * 
   ### **27 కిలోల బరువుండే ప్రజ్ఞాన్ రోవర్‌లో సోలార్ ప్లేట్లు తెరుచుకుని సూర్యరశ్మిని గ్రహించి పని చేయడం మొదలుపెడుతుంది.**
   
 * 
   ### **ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై తిరిగేందుకు వీలుగా ఆరు చక్రాలను ఏర్పాటు చేశారు. రాళ్లు, గుంతల్లో సైతం సులభంగా ప్రయాణించేలా వీటి చక్రాలను రూపొందించారు.**
   
 * 
   ### **ఈ రోవర్‌లో కూడా ప్రత్యేకంగా ఓ కెమేరాను ఏర్పాటు చేశారు. అది రోవర్ తిరుగుతున్న పరిసరాల ఫొటోలను తీసి విక్రమ్ ల్యాండర్ ద్వారా బెంగళూరులోని ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు ఫొటోలను, ఇతరాత్ర సమాచారాన్ని పంపిస్తుంది.**
   
 * 
   ### **14 రోజులపాటు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత దక్షిణ దృవంలో అమావాస్య వస్తుంది. ఆ ప్రాంతంలో ఎండ పడకపోవడం వల్ల రోవర్, ల్యాండర్‌ల్లో సోలార్ వ్యవస్థ పనిచేయడం మానేస్తుంది.**
   
 * 
   ### **ఆ సమయంలో -180 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, దాని వల్ల విక్రమ్, ప్రజ్ఞాన్‌లు గడ్డకడతాయని భావిస్తున్నారు.**
   
 * 
   ### **ఎండ వచ్చిన తర్వాత ల్యాండర్, రోవర్‌లు పనిచేస్తాయా లేదా అనేది అనుమానమే. అందుకే శాస్త్రవేత్తలు ఆ 14 రోజుల్లోనే కావల్సినంత సమాచారాన్ని సేకరించాలని భావిస్తున్నారు. అయితే, చంద్రయాన్-2 ఆర్బిటార్ మాత్రం సుమారు ఏడాదిపాటు కొనసాగుతుంది.**
   

### **చంద్రయాన్-2’ జాబిల్లిపై ల్యాండయ్యే క్షణాలను ప్రధాని నరేంద్ర మోదీ కూడా లైవ్‌లో వీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘చంద్రయాన్-2.. చంద్రుడి దక్షిణ దృవంలో ల్యాండవుతుంది. **

### **ఈ ప్రత్యేక క్షణాలను తప్పకుండా వీక్షించండి. ఆ ఫోటోలను మీ సోసల్ మీడియా వేదికలపై షేర్ చేయండి. **

### **కొన్ని ఫొటోలను నేను కూడా రిట్వీట్ చేస్తాను’’ అని మోదీ ట్వీట్ చేశారు.**

### **󠀁[Chandrayaan-2 Moon Landing ఆ అద్భుత క్షణాలను ఇక్కడ Liveలో చూడండి](https://youtu.be/lqQe7WsFVQg)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
