Childcare-leave-for-male-employees-in-central-government-employees

Childcare-leave-for-male-employees-in-central-government-employees

పురుషులకూ చైల్డ్‌ కేర్‌ లీవులు*

*➪ కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు*

*➪ పూర్తి జీతంతో తొలి 365 రోజులు సెలవులు*

*➪ 80 శాతం వేతనంతో మరో 365 రోజులు లీవు*

➪ న్యూఢిల్లీ,

✰ కేంద్రప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది.

✰ కేంద్రప్రభుత్వ పురుష ఉద్యోగులకు కూడా ఇక నుంచి శిశు సంరక్షణ సెలవులు ఇవ్వనున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం ప్రకటించారు.

✰ పెండ్లి కానివారు, పెండ్లి అయ్యి భార్య చనిపోయినవారు, విడాకులు తీసుకున్నవారు.. సింగిల్‌ పేరెంట్‌గా తమ బిడ్డల ఆలనాపాలనా తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత ఉన్నవారికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.

✰ దీని ప్రకారం సింగిల్‌ పేరెంట్‌ పురుష ఉద్యోగులకు మొదటి 365 రోజుల సెలవులకు పూర్తి వేతనం చెల్లిస్తారు.

✰ మలిదఫా 365 రోజుల సెలవులకు 80 శాతం వేతనం ఇస్తారు.

✰ శిశు సంరక్షణ సెలవులో ఉన్నప్పటికీ సాధారణ సమయంలో ఉద్యోగులకు లభించే పర్యాటక సెలవుల (ఎల్టీసీ) ప్రయోజనాలు కూడా పొందవచ్చని మంత్రి తెలిపారు.

✰ మరోవైపు, శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు 22 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే అవసరమైన సమయంలో వారి సంరక్షకులు శిశు సంరక్షణ సెలవులు పెట్టుకొనేందుకు ప్రస్తుతం వీలున్నది.

✰ అయితే ఈ వయో పరిమితి నిబంధనను ఎత్తేస్తున్నట్టు కూడా మంత్రి పేర్కొన్నారు.

RGUKT IIIT ADMISSIONS NOTIFICATION & STUDY MATERIAL, MODEL PAPERS MATHS, P.S & B.S

AP GOVERNMENT WOMEN CHILDCARE APPLICATION & COMPLETE DETAILS

TEACHERS TRANSFERS ONLINE APPLICATION & CLEAR VACANCIES IN 13 DISTRICTS

STUDENTS ENROLLMENT PARTICULARS IN ALL DISTRICTS & TRANSFERS POINTS CALICULATOR

ALL SCHOOLS REOPENS ON NOVEMBER 2ND INSTRUCTIONS

error: Content is protected !!