class-1st-to-inter-online-classes-government-guidelines-time-period

class-1st-to-inter-online-classes-government-guidelines-time-period

ఆన్‌లైన్‌ క్లాసులకు ఓకే!

‌ టైమ్‌పై తరగతుల వారీగా పరిమితులు

1-8 తరగతులకు 30-45 నిమిషాల చొప్పున 2 సెషన్లు

9-12 క్లాసులకు 45 నిమిషాలు.. 4 సెషన్లు

ప్రీప్రైమరీకి 30 నిమిషాలు.. పనిదినాల్లో మాత్రమే

రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

పాఠశాల విద్యలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ‘ప్రగ్యాత’ పేరుతో స్కూళ్ల యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీచేసింది.

విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలను తయారుచేసినట్లు తెలిపింది.

దీక్ష(ఒక దేశం-ఒక డిజిటల్‌ వేదిక), టీవీ(ఒక క్లాస్‌-ఒక ఛానెల్‌), స్వయం(వివిధ అంశాలపై ఆన్‌లైన్‌ మూ క్స్‌), ఐటీపాల్‌(పరీక్షల తయారీకి వేదిక), ఏఐఆర్‌ (కమ్యూనిటీ రేడియో మరియు సీబీఎ్‌సఈ శిక్షా వాణి ద్వారా పోడ్కాస్ట్‌) మరియు ఎన్‌ఐఓఎస్‌ అభివృద్ధి చేసిన విభిన్న సామర్థ్యం గల విద్యార్థుల కో సం అధ్యయన సామగ్రి మొదలైన వాటి ద్వారా దేశంలో డిజిటల్‌ విద్యా వ్యాప్తికి మార్గదర్శకాలు రూపొందించారు.

ఆన్‌లైన్‌ విధానం, పాక్షిక ఆన్‌లైన్‌ విధానం, ఆఫ్‌లైన్‌ విధానంపై మార్గదర్శకాలు రూపొందించారు.

గత 4 నెలల నుంచి పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ మధ్య కాలంలో కొన్ని పాఠశాలలు రెగ్యులర్‌ స్కూల్స్‌ మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండడం విద్యార్థులపై దుష్ఫలితాలు చూపే ప్రమాదం ఉందంటూ ఈ మార్గదర్శకాలలో స్ర్కీన్‌ టైమ్‌పై పరిమితి విధించారు.

ప్రీప్రైమరీ తరగతులకు సంబంధించి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్‌ అవ్వడానికి 30 నిమిషాలు కేటాయించారు.

1నుంచి 8వ తరగతుల వరకు  విద్యార్థులకు ఒక్కో సెషన్‌ 30 నుంచి 45 నిమిషాలు మించకుండా రోజుకు రెండు సెషన్స్‌ నిర్వహించాలని పేర్కొన్నారు.

9 నుంచి 12వ తరగతి వరకు ఒక్కో సెషన్‌ 45 నిమిషాలకు మించకుండా రోజుకు నాలుగు సెషన్లు నిర్వహించాలన్నారు.

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ను అందిపుచ్చుకోవాలని మార్గదర్శకాల్లో సూచించారు.

కేవలం పని దినాల్లో తప్ప.. వారాంతంలో తరగతులు నిర్వహించరాదని ఆదేశించడమే  కాకుండా, ఆన్‌లైన్‌ అసె్‌సమెంట్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. ఐసీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, విద్యుత్‌, బడ్జెట్‌ , నైపుణ్య మానవ వనరుల కొరత ఉన్న కారణంగా డిజిటల్‌ విద్యలోకి మారడం పలు రాష్ట్రాలకు సవాల్‌గా మారింది.

ఆయా రాష్ర్టాల్లో ఉన్న వనరుల దృష్ట్యా షార్ట్‌ టర్మ్‌, లాంగ్‌ టర్మ్‌ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

ఎంత మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది, స్మార్ట్‌ ఫోన్‌ ఎందరికి ఉంది, కేబుల్‌ కనెక్షన్‌ తో టెలివిజన్‌ ఎంతమందికి అందుబాటులో ఉం ది.. వంటి సమాచారాన్ని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!