# corporate-look-for-government-schools-ap-2020

- Link: https://amaravathiteacher.com/corporate-look-for-government-schools-ap-2020/
- Published: 2020-06-28T08:29:03+05:30
- Author: amaravathiteacher

## _**corporate-look-for-government-schools-ap-2020**_󠀁[](https://amaravathiteacher.com/corporate-look-for-government-schools-ap-2020/)󠁿

### **సర్కారు స్కూళ్లకు ****‘కార్పొరేట్‌’ లుక్కు.**

### **మొదటి దశలో 15,715 స్కూళ్లలో ఏర్పాట్లు\***

### **\*♦రూ.3,310 కోట్లతో చకచకా పనులు\***

### **\*♦నాణ్యతకు పెద్దపీట.. ఖర్చులో పారదర్శకత\***

### **\*♦ప్రతి స్కూలులో 9 రకాల సదుపాయాలు\***

### **\*♦పరికరాలను పరిశీలించిన మంత్రి సురేష్‌\***

### **కార్పొరేట్‌’ లుక్కు ‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను రూపుదిద్దేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి, నాడు–నేడు’ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.**

### ** 9 రకాల సదుపాయాలను ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయించేలా సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 44,512 ప్రభుత్వ స్కూళ్లలో మొదటి దశ కింద 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. **

### **తొమ్మిది రకాల పనుల్లో వినియోగించే పరికరాల నాణ్యత విషయంలో పేరున్న ప్రముఖ సంస్థల బ్రాండెడ్‌ రకాలను వినియోగిస్తున్నారు. **

### **ఆయా కంపెనీల వివిధ పరికరాలు, వస్తువులతో శనివారం విజయవాడలోని సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయంలో ప్రత్యేక స్టాల్స్‌ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.**

### **► స్కూల్‌ పేరెంట్సు కమిటీలతోనే ఈ పనులన్నీ జరిపిస్తున్నాం.**

### ** నాణ్యమైన బ్రాండెడ్‌ పరికరాలను ప్రొక్యూర్‌ చేస్తున్నామని, జ్యుడీషియరీ ప్రివ్యూ అనంతరం వీటిని టెండర్ల ద్వారా సమకూరుస్తున్నామన్నారు.**

### **► ప్రతి పనికి సంబంధించిన ప్రతి పైసా ఖర్చును ఎప్పటికప్పుడు ‘మనబడి, నాడు నేడు’ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.**

### **► స్కూళ్లు తెరిచే నాటికి పనులన్నీ పూర్తి చేయిస్తాం. స్కూళ్ల భద్రత కోసం ప్రత్యేకంగా వాచ్‌మెన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.**

### **► పనులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా బిల్లులు అప్‌లోడ్‌ కాగానే గ్రీన్‌చానల్‌లో చెల్లింపులు జరుగుతాయి. అవన్నీ పారదర్శకంగా డ్యాష్‌బోర్డులో కనిపించేలా చేశాం.**

### **► ఈ పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఒత్తిళ్లు ఉంటే  ప్రభుత్వానికి తెలియచేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తాం. వాటిని వెంటనే పరిష్కరిస్తాం.**

### **► 2018 డీఎస్సీకి సంబంధించి కోర్టు కేసులు పరిష్కారమైన వాటికి వెంటనే నియామకాలు. **

### **తక్కిన వ్యాజ్యాలను త్వరగా పరిష్కారమయ్యేలా చేస్తున్నాం.**

### ** అవి అయిన వెంటనే కొత్త డీఎస్సీకి సంబంధించి ఖాళీల సంఖ్యను సిద్ధం చేసి చర్యలు తీసుకుంటాం.**

### **► పదో తరగతి పరీక్షల విద్యార్థులకు త్వరలో గ్రేడింగ్‌లు.**

### **డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సుల పరీక్షలు, ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటికే యూనివర్సిటీల వీసీలతో చర్చించి సీఎంకు విన్నవించాం. **

### **వీటిపై కేంద్రం, యూజీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రకారం ముందుకు వెళ్తాం.**

### **\*♦విద్యార్థుల సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌\***

### **కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కూళ్లు మూతపడి ఇంటిదగ్గరే ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారానే కాకుండా దూరదర్శన్‌ సప్తగిరి చానెల్, ఆకాశవాణిల ద్వారా వీడియో, ఆడియో పాఠ్యాంశాలను వినిపిస్తోంది. వాటి ఆధారంగా వర్క్‌బుక్కులలో హోమ్‌వర్కులు చేసేలా చర్యలు తీసుకుంది. **

### **వాటిని పరిశీలించి సందేహాలు తీర్చేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండేందుకు వారానికొక రోజు స్కూలులో టీచర్లు ఉండేలా కూడా ఏర్పాట్లు చేసింది. **

### **తాజాగా విద్యార్థులు తమ సందేహాలను ఇంట్లో ఉంటూనే నిపుణులైన టీచర్ల ద్వారా నివృత్తి చేసుకొనేలా టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ స్కూళ్ల ఆంగ్ల మాధ్యమ ప్రత్యేకాధికారిణి కె.వెట్రిసెల్వి తెలిపారు. **

### **మొబైల్‌ ఫోన్‌ ద్వారా విద్యార్థులు ‘1800123123124’ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలి. **

### **ఆ తర్వాత ఏ తరగతి చదువుతున్నారో అడిగే నెంబర్‌ను నొక్కాలన్నారు. **

### **ఆ వెంటనే సంబంధిత తరగతి సబ్జెక్టు నిపుణులకు ఆ కాల్‌ వెళ్తుందని, ఆ నిపుణుడు లైన్లోకి వచ్చి సదరు విద్యార్థికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారని వివరించారు. **

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
