Covid-19-cases-treatment-in-aarogysri-g.o.no-77

Covid-19-cases-treatment-in-aarogysri-g.o.no-77

Inclusion of certain procedures under Dr YSR Aarogyasri Scheme to treat the cases of Suspected and Confirmed positive COVID –19 cases – Orders – Issued.

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్  కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.*

కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.

అందులో భాగంగానే మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది.

♦నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా నిర్ధారించింది. 

♦క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. 

♦ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్‌ చేయనున్నారు. 

♦వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు. 

♦ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా ఉండనుంది. 

♦ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు.

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

FOR MORE DETAILS G.O.NO.77 PDF FILE

error: Content is protected !!