# ctet-july-2020-notification-exam-pattern-syllabus-online-application

- Link: https://amaravathiteacher.com/ctet-july-2020-notification-exam-pattern-syllabus-online-application/
- Published: 2020-02-17T23:09:28+05:30
- Author: amaravathiteacher

## **ctet-july-2020-notification-exam-pattern-syllabus-online-application**󠀁[](https://amaravathiteacher.com/ctet-july-2020-notification-exam-pattern-syllabus-online-application/)󠁿

### **ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.01.2020**

### **\* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.02.2020**

### **\* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.02.2020 (15:30 pm)**

### **\* పరీక్ష తేది: 05.07.2020**

### **సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై-2020 పరీక్ష షెడ్యూలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం జులై 5న సీటెట్-2020 పరీక్ష నిర్వహించనున్నారు. **

### **పరీక్షకు సంబంధించి.. జనవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. **

### **అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. **

### **అయితే ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. **

### **జులై 5న దేశవ్యాప్తంగా 112 నగరాల్లో 20 భాషల్లో సీటెట్-2020 పరీక్షను సీబీఎస్‌‌ఈ నిర్వహించనుంది. **

### **రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఉదయం 9.30 నుంచి 12 వరకు వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.**

### **సీటెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఆయా పేపర్లకు అర్హతలు వేర్వేరుగా ఉంటాయి.. వివరాలు ఇలా..**

### **✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)**

### **అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.**

### **✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)**

### **అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.**

### **FEES:- సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లు రాసేవారు రూ.1200 చెల్లించాలి. **

### **ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లు రాసేవారు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.**

### **✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.**

### **✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.**

### **సన్నద్ధత ఇలా…**⏎ **➦ అభ్యర్థులు సీటెట్ పరీక్షకు సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో సూచించిన సిలబస్ ప్రకారం పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది.****➦ జులై 5న పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రిపరేషన్‌కు 6 నెలల గడువు ఉంది. ఈ 6 కాలాన్ని అభ్యర్థులు సమర్థమంతంగా వినియోగించుకోవాలి.****➦ విభాగాల వారీగా ప్రిపరేషన్‌కు తగిన సమయాన్ని కేటాయించుకోవాలి.****➦సబ్జెక్టుల వారీగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం. ఇది రివిజన్ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.****➦ కాన్సెప్ట్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోడానికి నోట్స్ రాయడం చాలా ఉపకరిస్తుంది.****➦ సీబీఎస్‌ఈ ప్రకటించింన సిలబస్ ప్రకారమే పరీక్షలకు ప్రిపేప్ కావాలి. ఇందుకోసం మార్కెట్‌లో లభించే పుస్తకాలను రిఫరెన్స్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. సీటెట్ పరీక్షకు సంబంధించిన సిలబస్ అంతా ఆ పుస్తకాల్లో ఉందా? లేదా? అన్నది సరిచూసుకోవాల్సి ఉంటుంది.****➦మాక్ టెస్టులు రాయడం, పాతప్రశ్నపత్రాలను తిరగేయడం చేయాలి. దీనివల్ల అభ్యర్థుల్లో పరీక్షపై ఉన్న భయంపోయి.. నమ్మకం ఏర్పడుతుంది. ఇలా చేస్తే.. పరీక్షలో విజయం ఖాయమైనట్లే..**

### **󠀁[CTET EXAM NOTIFICATION DOWNLOAD PDF](https://ctet.nic.in/webinfo/Handler/FileHandler.ashx?i=File&ii=224&iii=Y&_ga=2.249172865.745974014.1581960782-1570858038.1551888528)󠁿**

### **󠀁[ONLINE APPLICATION FORM FOR CTET](https://examinationservices.nic.in/examsys/root/home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgOaXrFcakbe+oeIaBL3xeDE=)󠁿**

### **󠀁[CTET JULY-2020 OFFICIAL WEBSITE](https://ctet.nic.in/webinfo/Public/Home.aspx)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
