# Delhi-Schools-Record-CBSE-Class-12th-Results-What-is-the-magic-done-by-Kejriwal

- Link: https://amaravathiteacher.com/delhi-schools-record-cbse-class-12th-results-what-is-the-magic-done-by-kejriwal/
- Published: 2020-07-17T15:57:52+05:30
- Author: amaravathiteacher

## **Delhi-Schools-Record-CBSE-Class-12th-Results-What-is-the-magic-done-by-Kejriwal**󠀁[](https://amaravathiteacher.com/delhi-schools-record-cbse-class-12th-results-what-is-the-magic-done-by-kejriwal/)󠁿

### **CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ స్కూళ్లు రికార్డు.. కేజ్రీవాల్ చేసిన మేజిక్ ఏంటి?**

### **2020లో సీబీఎస్ఈ ప్రకటించిన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్లు 98 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.**

### **ఇటీవల వెలువడిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. **

### **ఇంత భారీ సక్సెస్ సాధించడం వెనుక కారణం ఏంటి?**

### **2015లో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఓ హామీ ఇచ్చారు. **

### **ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు**

### ** ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైంది.**

### **ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో సాధించిన ఉత్తీర్ణత శాతం.**⏎ **2020: 98%****2019: 94.24%****2018: 90.6 %****2017: 88.2%****2016: 85.9%**

### **అరవింద్ కేజ్రీవాల్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఆ ప్రత్యేకత ఏముంది? **

### **ఢిల్లీ స్కూళ్లు దేశంలోనే ప్రత్యేకంగా నిలబడడానికి ఈ పది కారణాలు ఉన్నాయి.**⏎ **1. దేశంలోనే విద్యాశాఖకు అత్యధిక బడ్జెట్. **

### **ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌లో 25 శాతం విద్య కోసమే కేటాయించారు.**

### ** గత ఆరేళ్లుగా ఇదే కొనసాగుతుంది. **

### **దేశంలోనే విద్య కోసం కేటాయించిన అత్యధిక బడ్జెట్ ఇదే.**⏎ **2. ఆరేళ్లలో రెట్టింపయిన క్లాస్ రూమ్‌లు: **

### **ఆరేళ్లలో ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్ల క్లాస్ రూమ్‌లో రెట్టింపయ్యాయి. ****17,000 నుంచి 37,000కి పెరిగాయి.**⏎ **3. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు: **󠀁[](https://amaravathiteacher.com/delhi-schools-record-cbse-class-12th-results-what-is-the-magic-done-by-kejriwal/)󠁿

### **ప్రభుత్వ స్కూళ్లలో స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియంలు, ల్యాబ్‌లు, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. **

### **దీంతో విద్యార్థులు స్కూల్‌కి వెళ్లడానికి, చదువు మీద ఆసక్తి పెరగడానికి దోహదపడింది**

### **4. కేంబ్రిడ్జ్, సింగపూర్, ఫిన్ లాండ్ నుంచి టీచర్ ట్రైనింగ్ : **

### **ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లకు అత్యుత్తమ సంస్థల నుంచి ట్రైనింగ్ లభించింది. **

### **వారు ఆ శిక్షణను సద్వినియోగం చేశారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు.**⏎ **5. రాజకీయ నాయకులు నేరుగా పాలుపంచుకోవడం: **

### **సీఎం కేజ్రీవాల్ తరచూ విద్యార్థులు, టీచర్లతో మాట్లాడుతూ ఉంటారు. **

### **వారిలో ఉత్సాహన్ని, స్ఫూర్తిని నింపుతారు. గత ఏడాది కేజ్రీవాల్ స్వయంగా ఓ పేరెంట్ టీచర్ మీటింగ్‌కి హాజరయ్యారు. **

### **ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న మనీష్ సిసోడియా కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంటారు.**

### **6. నిపుణుల సలహాలు : **

### **ఆక్స్ ఫర్డ్‌లో చదువుకున్న ఆప్ ఎమ్మెల్యే ఆతిషి సారధ్యంలోని కోర్ ఎడ్యుకేషన్ టీమ్ ఎన్జీవోలు, మోడల్ స్కూళ్ల నుంచి బెస్ట్ టాలెంట్‌ను ఢిల్లీ విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు.**⏎ **7. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ : **

### **విద్యార్థుల ఎదుగుదలతో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. **

### **ఢిల్లీ ప్రభుత్వం తరచూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది.**

### **8. ఎస్టేట్ మేనేజర్లుగా మాజీ ఆర్మీ ఉద్యోగులు :**

### **ఢిల్లీలోని ఇతర కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మాజీ ఆర్మీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నారు. **

### **స్కూల్ ప్రిన్సిపాల్స్ అనే వారు విద్య మీద దృష్టి పెడతారు. **

### **మిగిలిన క్రీడా సంబంధిత అంశాలన్నీ ఈ ఎస్టేట్ మేనేజర్స్ చూసుకుంటారు.**

### **9. విద్యాబోధనలో కొత్తదనం : **

### **విద్యాబోధనలో కొత్త కొత్త విధానాలను ప్రభుత్వం అవలంభిస్తోంది. **

### **మిషన్ చునౌతీ, మిషన్ బునియాద్ అనే ప్రోగ్రామ్స్ చేపట్టింది. **

### **దీని ద్వారా ప్రతి విద్యార్థి కూడా రాయడం, చదవడం నేర్చుకుంటారు. **

### **ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు ఇంప్లిమెంట్ చేస్తుంది.**⏎ **10. సాంకేతిక పరిజ్ఞానం: **

### **ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు విద్యార్థులకు బోధించడానికి మొబైల్ ట్యాబ్లెట్స్ వాడతారు. **

### **ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ప్రొజెక్టర్లు ఉంటాయి.**

### ** ప్రపంచ స్థాయిలో నాలెడ్జ్ సాధించడానికి అనువైన వాతావరణం ఉంటుంది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
