Earned-Leave-Rules-E.L-S.L-Government-Orders-Complete-details

Earned-Leave-Rules-E.L-S.L-Government-Orders-Complete-details

వేసవిలో సంపాదిత సెలవులు

    పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను “సంపాదిత సెలవులు” అందురు.

     15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.

    వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు, జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.35 Dt:16-1-1981)

(G.O.Ms.No.151 Dt:14-11-2000)

(G.O.Ms.No.174 Dt:19-12-2000)

     వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరు చేస్తారు.

(G.O.Ms.No.114 Dt:28-4-2005)

     సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.

(Rc.No.362 Dt:16-11-2013)

వేసవి సెలవులు 49 రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:

 సూత్రం: 

డ్యూటీ కాలము x 1/11-(365×1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6

పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు 

>1-1

>2-1

>3-2

>4-2

>5-3

>6-3

>7-4

>8-5

>9-5

>10-6

>11-6

>12-7

>13-7

>14-8

>15-8

>16-9

>17-10

>18-10

>19-11

>20-11

>21-12

>22-12

>23-13

>24-13

>25-14

>26-15

>27-15

>28-16

>29-16

>30-17

>31-17

>32-18

>33-18

>34-19

>35-19

>36-20

>37-21

>38-21

>39-22

>40-22

>41-23

>42-23

>43,44,45,46,47,48,49-24 రోజులు

ఆర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE)* *సంబంధిత ఉత్తర్వులతో:*

✍ *అర్జితసెలవు(Earned Leave) ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను ‘సరెండర్ లీవ్’ అందురు.*

*(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)*

*(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)*

 *ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.*

 *ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం (ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.*

*(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)*

 *సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే.*

*(G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)*

 *సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.*

*(G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)*

 *సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించ బడదు.*

*(Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)*

 *సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు. ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.*

*(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)*

G.O.NO.35, dt.16-01-1981 FOR EARNED LEAVE

E.L.for election related work Memo.No.20214

ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరు చేయు అధికారం కలిగి ఉంటారో అట్టి అధికారే ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించ వచ్చును.*

*(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)*

 *అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.*

*(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)*

 *జనవరి 1వ తేదిన గాని,జూలై 1వ తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలోంచి ముందుగా సరెండర్ సెలవు తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు నమోదు చేయాలి.*

*(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)*

 *అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.*

 *సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె (HRA) మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.*

*(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)*

 *ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.*

*(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)*

 *పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరు చేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువ గాకుండా ఉండ వలెను.*

*(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)*

 *పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును.*

*(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)*

 *సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి.*  *సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.*

*(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)*

*అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి.

అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఎర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.*

ssc-advance-supplementary-duty-high-schools-may-2018-E.L-PRESERVATION

prevention-Earned-Leave-HM-Non-Teaching-Staff-High-schools-MAY-2019

error: Content is protected !!