# Earned-Leave-Rules-E.L-S.L-Government-Orders-Complete-details

- Link: https://amaravathiteacher.com/earned-leave-rules-e-l-s-l-government-orders-complete-details/
- Published: 2019-09-01T12:42:51+05:30
- Author: amaravathiteacher

## **Earned-Leave-Rules-E.L-S.L-Government-Orders-Complete-details**

## వేసవిలో సంపాదిత సెలవులు

###     **పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను “సంపాదిత సెలవులు” అందురు.**

### **     15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.**

### **    వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు, జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.**

### **(G.O.Ms.No.35 Dt:16-1-1981)**

### **(G.O.Ms.No.151 Dt:14-11-2000)**

### **(G.O.Ms.No.174 Dt:19-12-2000)**

### **     వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరు చేస్తారు.**

### **(G.O.Ms.No.114 Dt:28-4-2005)**

### **     సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.**

### **(Rc.No.362 Dt:16-11-2013)**

### **వేసవి సెలవులు 49 రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:**

###  **సూత్రం: **

### **డ్యూటీ కాలము x 1/11-(365×1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6**

### **పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు **

### **>1-1**

### **>2-1**

### **>3-2**

### **>4-2**

### **>5-3**

### **>6-3**

### **>7-4**

### **>8-5**

### **>9-5**

### **>10-6**

### **>11-6**

### **>12-7**

### **>13-7**

### **>14-8**

### **>15-8**

### **>16-9**

### **>17-10**

### **>18-10**

### **>19-11**

### **>20-11**

### **>21-12**

### **>22-12**

### **>23-13**

### **>24-13**

### **>25-14**

### **>26-15**

### **>27-15**

### **>28-16**

### **>29-16**

### **>30-17**

### **>31-17**

### **>32-18**

### **>33-18**

### **>34-19**

### **>35-19**

### **>36-20**

### **>37-21**

### **>38-21**

### **>39-22**

### **>40-22**

### **>41-23**

### **>42-23**

### **>43,44,45,46,47,48,49-24 రోజులు**

### **ఆర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE)\* \*సంబంధిత ఉత్తర్వులతో:\***

### **✍ \*అర్జితసెలవు(Earned Leave) ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను ‘సరెండర్ లీవ్’ అందురు.\***

### **\*(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)\***

### **\*(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)\***

### ** \*ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.\***

### ** \*ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం (ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.\***

### **\*(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)\***

### ** \*సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే.\***

### **\*(G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)\***

### ** \*సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.\***

### **\*(G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)\***

### ** \*సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించ బడదు.\***

### **\*(Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)\***

### ** \*సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు. ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.\***

### **\*(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)\***

### **󠀁[G.O.NO.35, dt.16-01-1981 FOR EARNED LEAVE ](https://docs.google.com/viewer?a=v&pid=sites&srcid=ZGVmYXVsdGRvbWFpbnxnb3NkaWFyeXxneDo0NmJkMzdmYTg3NTJmYjlh)󠁿**

### **󠀁[E.L.for election related work Memo.No.20214](https://8548e357-a-62cb3a1a-s-sites.googlegroups.com/site/gosdiary/earned-leave/E.L.for%20election%20related%20work%20Memo.No.20214.jpg?attachauth=ANoY7cou0hj2fbVMGx7mLIw0KeMItR6GiMyOjS8PGRPljSdgRyC_rOmtgKe8drrcBbk1ZkIl6bq_R7WAIgywgbSYYEJrEG3FFAaO-uP2kITxrpzEaUGBoYlFo5VUFru2zNJmVdi-IQTR67CfLfH1606hCl6MoGejff7yxYUBcyzdnD01atj8aTKfuWiDUsCTOAzo1q1tuNytbY3Up4DUJwrhjMHrZFJ033qSp3rxbkERuqZjka8ivUYXo1HgdDfKckKEw5EEU0eqHaaTRqwU-juBwNT0nuvHiQ%3D%3D&attredirects=0)󠁿**

### **ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరు చేయు అధికారం కలిగి ఉంటారో అట్టి అధికారే ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించ వచ్చును.\***

### **\*(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)\***

### ** \*అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.\***

### **\*(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)\***

### ** \*జనవరి 1వ తేదిన గాని,జూలై 1వ తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలోంచి ముందుగా సరెండర్ సెలవు తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు నమోదు చేయాలి.\***

### **\*(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)\***

### ** \*అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.\***

### ** \*సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె (HRA) మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.\***

### **\*(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)\***

### ** \*ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.\***

### **\*(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)\***

### ** \*పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరు చేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువ గాకుండా ఉండ వలెను.\***

### **\*(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)\***

### ** \*పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును.\***

### **\*(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)\***

### ** \*సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి.\*  \*సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.\***

### **\*(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)\***

### **\*అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి. **

### **అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఎర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.\***

### **󠀁[ssc-advance-supplementary-duty-high-schools-may-2018-E.L-PRESERVATION](https://amaravathiteacher.com/ssc-advance-supplementary-duty-high-schools-may-2018-e-l-preservation-ap-teachers/)󠁿**

### **󠀁[prevention-Earned-Leave-HM-Non-Teaching-Staff-High-schools-MAY-2019](https://amaravathiteacher.com/prevention-earned-leave-hm-non-teaching-staff-high-schools-2019/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
