అనంతపురం జిల్లాలో ఇరువురు ఉపాధ్యాయుల మధ్య సంపాదిత సెలవుని నగదుగా మార్చుకొని కూడా సేవాపుస్తకంలో రికార్డు చేయని వైనంపై పరస్పర ఆరోపణల పర్యవసానం….
రాష్ట్రం మొత్తం అట్టి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా?…. అని విద్యాశాఖ విచారణ*
*రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు తమ సంపాదిత సెలవులను సరెండర్ చేసినపుడు (నగదుగా మార్చుకొనినపుడు) సదరు విషయాన్ని SR లో రికార్డు చేయడంలేదని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో….
2014 -15 విద్యాసంవత్సరం నుండి MRC లోగాని/హైస్కూల్స్ లోగాని ఎవరైనా ఉపాధ్యాయులు/HM లు సంపాదిత సెలవును నగదుగా మార్చుకొని కూడా SR లో రికార్డు చేయని/చేయించుకోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ వివరాలను ది.20.10.2020 లోపు తమ కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు*