Expansion-of-YSR-Aarogyasri-guidelines-eligibility criteria-Health Cards

Expansion-of-YSR-Aarogyasri-guidelines-eligibility criteria-Health Cards

Expansion of Dr.YSR Aarogyasri Scheme to the people getting annual income up to Rs.5.00 Lakhs- guidelines for eligibility criteria on issuing Health Cards

G.O.RT.No. 628 Dated: 15-11-2019.

1) All Rice Card Holders are eligible.
2) Families which are eligible for YSR Pension Kanuka Card and
Jagananna Vidya and Vasathi Deevena Card are also eligible.
3) For other families, the following criteria are applicable.
(i) Land owners holding:
a) Less than 12.00 Acres of wet land
b) Less than 35.00 Acres of dry land
c) Total less than 35.00 Acres (Wet & Dry)
(ii) Annual income of the Households:
a) All households whose annual income is less than or up to
Rs.5.00 Lakhs (Salary certificate evidence)
b) Income Tax Payers: Families who are filing Income Tax
Returns up to Rs.5.00 Lakhs are eligible (Income Tax Return
evidence).
(iii) Municipal Property Tax Payers:
All households paying Municipal Property Tax for the area less
than 3000 SFT (334 Sq. Yds)
(iv) Employees
Any employee, other than permanent Government employee/
pensioner, whose annual income is less than or upto Rs.5.00
Lakhs is eligible. It includes outsourcing, Contract, Part time
employees, Sanitary workers, Honorarium based employees
working in Government sector and employees of Private sector.
(v) Families/Households not having more than one personal car.

అందరికీ ఆరోగ్యశ్రీ 

– రాష్ట్రంలో 95 శాతానికి పైగా ప్రజలకు వర్తింపు 
– 35 ఎకరాల్లోపు భూమి, ఏడాదికి రూ.ఐదు లక్షల ఆదాయం ఉన్న వారూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 

రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపు.

35 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి.. కుటుంబంలో ఒక వ్యక్తిగత కారున్న వారికి సైతం పథకాన్ని వర్తింప చేస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేకించి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులును జారీ చేయనున్నారు.

ఇందుకు సంబంధించి అర్హత, మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను వైద్య, ఆర్యోగ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

ఈ మార్గదర్శకాల ఆధారంగా ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ పంపించి సర్వే చేయించటం ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు.

వచ్చే నెల 20వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తారు. 

అర్హతలు ఇవీ.. 
– ప్రభుత్వం కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుదారులు 
– వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డుదారులు 
– జగనన్న విద్య, వసతి దీవెన కార్డుదారులు 
– 12 ఎకరాల్లోపు మాగాణి, 35 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు 
– మాగాణితోపాటు మెట్ట కలిపి 35 ఎకరాల్లోపు భూమి గలవారు 
– వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు (రుజువు కోసం వేతన సరి్టఫికెట్‌) 
– రూ.ఐదు లక్షల లోపు, వరకు  ఆదాయం గలవారు (రుజువు కోసం ఆదాయపు పన్ను రిటరŠన్స్‌) 
– పట్టణాల్లో 3 వేల లోపు చదరపు అడుగులకు (334 చదరపు గజాలు) ఆస్తి పన్ను కట్టేవారు 
– రూ.ఐదు లక్షల లోపు, రూ.ఐదు లక్షల వరకు వార్షిక ఆదాయం గల  ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌ టైమ్, పారిశుద్ధ్య కార్మికులు, గౌరవ వేతనం పొందే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని ఉద్యోగులందరూ 
– కుటుంబానికి వ్యక్తిగతంగా ఒక కారు ఉన్నా అర్హులే 

Expansion of Dr.YSR Aarogyasri Scheme to the people getting annual income up to Rs.5.00 Lakhs- guidelines for eligibility criteria on issuing Health Cards G.O.NO.628

error: Content is protected !!