Financial-assistance-Rs.10,000/-Self-owned-Auto/Taxi-Drivers-expenditure

Financial-assistance-Rs.10,000/-Self-owned-Auto/Taxi-Drivers-expenditure

Transport Department – Financial assistance of Rs.10,000/- per annum to Self owned Auto/Taxi Drivers for expenditure towards insurance, fitness certificate, repairs and other requirements–

రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి.

‘వైఎస్ఆర్ వాహన మిత్ర’ పథకాన్ని ఈ నెలాఖరు (October 31st) వరకు పొడిగించారు.

అంతలోపు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించనుంది ప్రభుత్వం.

అర్హులందరికీ ప్రతీ ఏటా రూ.10,000 ఆర్థిక సాయం లభిస్తుంది.

ఒక వ్యక్తి ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక సాయాన్ని పొందేందుకు అర్హులు.

రెండు ఆటోలు ఉన్నా ఒకే సాయం అందుతుంది.

ఒక ఇంట్లో వేర్వేరు పేర్ల మీద రెండు ఆటోలు ఉన్నా ఒకే సాయం అందుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

అర్హులైన లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 10, మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది.

15 రోజుల్లో ఆ బ్యాంకు ఖాతా తెరవాలి ఈ ప్రయోజనాన్ని పొందేందుకు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.

ఈ బ్యాంకు ఖాతాను తెరిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలను గ్రామ వాలంటీర్ల నుంచి తీసుకోవచ్చును.

ఈ బ్యాంకు ఖాతా రుణం కింద మినహాయించుకోవడానికి వీలులేని బ్యాంకు ఖాతా అయి ఉండాలి.

దీనిని 15 రోజుల్లో తెరవాలి.

మంగళవారం నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన డ్రైవర్లకు ఆ మొత్తాన్ని ఈ నెలాఖరు నాటికి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తారు.

Financial Assistance to Self-Owned Auto/Taxi/Maxi Cab Drivers అప్లికేషను ఫారం

రూ.10,000కు వీరు అర్హులు… డ్రైవర్లకు వాలిడిటీ కలిగిన లైసెన్స్ ఉండాలి.

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వాహన పన్ను చెల్లింపులు అన్నీ పక్కాగా ఉండాలి.

అలా ఉంటేనే అర్హులుగా పరిగణింపబడతారు.

ఒక కుటుంబంలో ఎన్ని ఆటోలు లేదా ట్యాక్సీలు ఉన్నప్పటికీ ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది.

సొంతగా ఆటో, కారు, క్యాబ్ కలిగి ఉండి, యజమాని నడుపుతుండాలి.

ప్రతి డ్రైవర్ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.

గులాబీ రంగు కార్డు ఉన్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందదు.

డేటా బేస్‌లో అప్ లోడ్

ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపిస్తారు అధికారులు.

వీరు వాస్తవాలను పరిశీలించిన అనంతరం పట్టణాల్లో పురపాలక కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ నుంచి ఆమోదం తీసుకొని సీఎఫ్ఎంఎస్ డేటా బేస్‌లో అప్ లోడ్ చేస్తారు.

ఆ తర్వాత అర్హులుగా తేల్చుతారు డ్రైవర్ల లైసెన్స్, ఆధార్ కార్డు వివరాలు రవాణా శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ డేటాబేస్‌తో పోల్చి చూస్తారు. సరైనదిగా తేలితే అర్హులుగా గుర్తిస్తారు.

అర్హులైన దరఖాస్తుదారులందరికీ రవాణా శాఖ కమిషనర్ నిధులను విడుదల చేస్తారు. రూ.10,000 నగదును ప్రభుత్వం నేరుగా డ్రైవర్ల చేతికి అందించదు. బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసిన తర్వాత, ఈ నెలాఖరులోగా ఖజానా నుంచి అందులో జమ చేస్తుంది.

అందుకే ఈ ఆర్థిక సాయం.. సొంతగా ఆటో/ట్యాక్సీ/క్యాబ్ నడిపి, జీవనాన్ని కొనసాగిస్తున్న డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది డ్రైవర్లకు, రూ.400 కోట్ల మేర సాయం అందనుంది.

వాహనాల బీమా, మరమ్మతులు తదితరాల కోసం ప్రభుత్వం డ్రైవర్లకు ఈ సాహాయాన్ని అందిస్తోంది.

రూ.10,000 పొందేందుకు అర్హతలు.. క్లుప్తంగా…

– ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ సొంతది అయి ఉండి, యజమానే నడపాలి.

– ఆటో/లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

-వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, పన్నుల రసీదులు) అన్నీ సరిగ్గా ఉండాలి.

– అర్హుడు దారిద్య్రరేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

– దరఖాస్తు సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి.

ఆటో/టాక్సీ/మ్యాక్సీ క్యా బ్ డ్రైవర్ మ్రియు వాహన యజమాని ఆర్ధకి సహాయ పథకమునకు దరఖాస్తు

2) ఆటో రిక్షా / తేలికపాటి మోటారు వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

3) 18 సంవత్సరములు పైబడిన వారు అర్హులు.

4) ఆంధ్రప్రదేశ్ నివాసియై ఉండాలి( నివాస చిరునామా వైట్ రేషన్ కార్డ్ /మీసేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లొ నమోదై ఉండాలి.).

5) దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి (వైట్ రేషన్ కార్డ్ / అన్నపూర్ణ కార్డ్ / అంత్యోదయ కార్డ్ కలిగి ఉండాలి).

6) వ్యక్తిగత పేరుతో ఎటువంటి ఋణములు లేని బ్యాంకు ఖాతా ఉండాలి (బ్యాంక్ యొక్క పాస్ బుక్ మొదటి పేజీ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది).

7) లబ్ధిదారునికి ఆధార్ సంఖ్య ఉండాలి,లబ్ధిదారుడు మొబైల్ నంబర్ సమర్పించాలి.

ONLINE APPLICATION FORM

FOR MORE DETAILS G.O.MS.No. 34, DATE 09-09-2019

OFFICIAL WEBSITE AP TRANSPORT

error: Content is protected !!