# Financial-assistance-Rs.10,000/-Self-owned-Auto/Taxi-Drivers-expenditure

- Link: https://amaravathiteacher.com/financial-assistance-rs-10000-self-owned-auto-taxi-drivers-expenditure/
- Published: 2019-09-12T19:43:27+05:30
- Author: amaravathiteacher

## **_Financial-assistance-Rs.10,000/-Self-owned-Auto/Taxi-Drivers-expenditure_**󠀁[](https://amaravathiteacher.com/financial-assistance-rs-10000-self-owned-auto-taxi-drivers-expenditure/)󠁿

### **Transport Department – Financial assistance of Rs.10,000/- per annum to Self ****owned Auto/Taxi Drivers for expenditure towards insurance, fitness certificate, ****repairs and other requirements–**

### **రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి.**

### **‘వైఎస్ఆర్ వాహన మిత్ర’ పథకాన్ని ఈ నెలాఖరు (October 31st) వరకు పొడిగించారు. **

### **అంతలోపు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించనుంది ప్రభుత్వం. **

### **అర్హులందరికీ ప్రతీ ఏటా రూ.10,000 ఆర్థిక సాయం లభిస్తుంది.**

### **ఒక వ్యక్తి ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక సాయాన్ని పొందేందుకు అర్హులు. **

### **రెండు ఆటోలు ఉన్నా ఒకే సాయం అందుతుంది. **

### **ఒక ఇంట్లో వేర్వేరు పేర్ల మీద రెండు ఆటోలు ఉన్నా ఒకే సాయం అందుతుంది.**

### **ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. **

### **అర్హులైన లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **సెప్టెంబర్ 10, మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది.**

### **15 రోజుల్లో ఆ బ్యాంకు ఖాతా తెరవాలి ఈ ప్రయోజనాన్ని పొందేందుకు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. **

### **ఈ బ్యాంకు ఖాతాను తెరిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలను గ్రామ వాలంటీర్ల నుంచి తీసుకోవచ్చును. **

### **ఈ బ్యాంకు ఖాతా రుణం కింద మినహాయించుకోవడానికి వీలులేని బ్యాంకు ఖాతా అయి ఉండాలి. **

### **దీనిని 15 రోజుల్లో తెరవాలి. **

### **మంగళవారం నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన డ్రైవర్లకు ఆ మొత్తాన్ని ఈ నెలాఖరు నాటికి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తారు.**

### **󠀁[Financial Assistance to Self-Owned Auto/Taxi/Maxi Cab Drivers అప్లికేషను ఫారం](https://www.aptransport.org/images/pdf/application-form-for-financial-assistance-to-self-owned-auto-taxi-maxi-cab-drivers.pdf)󠁿**

### **రూ.10,000కు వీరు అర్హులు… డ్రైవర్లకు వాలిడిటీ కలిగిన లైసెన్స్ ఉండాలి. **

### **రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వాహన పన్ను చెల్లింపులు అన్నీ పక్కాగా ఉండాలి. **

### **అలా ఉంటేనే అర్హులుగా పరిగణింపబడతారు. **

### **ఒక కుటుంబంలో ఎన్ని ఆటోలు లేదా ట్యాక్సీలు ఉన్నప్పటికీ ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. **

### **సొంతగా ఆటో, కారు, క్యాబ్ కలిగి ఉండి, యజమాని నడుపుతుండాలి.**

### ** ప్రతి డ్రైవర్ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. **

### **గులాబీ రంగు కార్డు ఉన్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందదు.**

### **డేటా బేస్‌లో అప్ లోడ్**

### **ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపిస్తారు అధికారులు. **

### **వీరు వాస్తవాలను పరిశీలించిన అనంతరం పట్టణాల్లో పురపాలక కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ నుంచి ఆమోదం తీసుకొని సీఎఫ్ఎంఎస్ డేటా బేస్‌లో అప్ లోడ్ చేస్తారు.**

### **ఆ తర్వాత అర్హులుగా తేల్చుతారు డ్రైవర్ల లైసెన్స్, ఆధార్ కార్డు వివరాలు రవాణా శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ డేటాబేస్‌తో పోల్చి చూస్తారు. సరైనదిగా తేలితే అర్హులుగా గుర్తిస్తారు.**

### **అర్హులైన దరఖాస్తుదారులందరికీ రవాణా శాఖ కమిషనర్ నిధులను విడుదల చేస్తారు. రూ.10,000 నగదును ప్రభుత్వం నేరుగా డ్రైవర్ల చేతికి అందించదు. బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసిన తర్వాత, ఈ నెలాఖరులోగా ఖజానా నుంచి అందులో జమ చేస్తుంది.**

### **అందుకే ఈ ఆర్థిక సాయం.. సొంతగా ఆటో/ట్యాక్సీ/క్యాబ్ నడిపి, జీవనాన్ని కొనసాగిస్తున్న డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. **

### **రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది డ్రైవర్లకు, రూ.400 కోట్ల మేర సాయం అందనుంది. **

### **వాహనాల బీమా, మరమ్మతులు తదితరాల కోసం ప్రభుత్వం డ్రైవర్లకు ఈ సాహాయాన్ని అందిస్తోంది.**

### **రూ.10,000 పొందేందుకు అర్హతలు.. క్లుప్తంగా…**

### ** – ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ సొంతది అయి ఉండి, యజమానే నడపాలి. **

### **– ఆటో/లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.**

### **-వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, పన్నుల రసీదులు) అన్నీ సరిగ్గా ఉండాలి.**

### ** – అర్హుడు దారిద్య్రరేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. **

### **– దరఖాస్తు సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి.**

### **అర్హతలు మరియు కావలసిన డాక్యుమెంట్లు**

### **󠀁[ఆటో/టాక్సీ/మ్యాక్సీ క్యా బ్ డ్రైవర్ మ్రియు వాహన యజమాని ఆర్ధకి సహాయ పథకమునకు దరఖాస్తు](https://www.aptransport.org/images/pdf/application-form-telugu.pdf)󠁿**

### **1)దరఖాస్తుదారు పేరు పై ఆటో రిక్షా / టాక్సీ / మాక్సి క్యాబ్‌ను రవాణా శాఖలో రిజిస్టర్ చేసి ఉండాలి.**

### **2) ఆటో రిక్షా / తేలికపాటి మోటారు వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.**

### **3) 18 సంవత్సరములు పైబడిన వారు అర్హులు.**

### **4) ఆంధ్రప్రదేశ్ నివాసియై ఉండాలి( నివాస చిరునామా వైట్ రేషన్ కార్డ్ /మీసేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లొ నమోదై ఉండాలి.).**

### **5) దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి (వైట్ రేషన్ కార్డ్ / అన్నపూర్ణ కార్డ్ / అంత్యోదయ కార్డ్ కలిగి ఉండాలి).**

### **6) వ్యక్తిగత పేరుతో ఎటువంటి ఋణములు లేని బ్యాంకు ఖాతా ఉండాలి (బ్యాంక్ యొక్క పాస్ బుక్ మొదటి పేజీ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది).**

### **7) లబ్ధిదారునికి ఆధార్ సంఖ్య ఉండాలి,లబ్ధిదారుడు మొబైల్ నంబర్ సమర్పించాలి.**

### **󠀁[ONLINE APPLICATION FORM](http://125.21.84.200/ysrcheyutha/autoDriverAppForm.do)󠁿**

### **󠀁[FOR MORE DETAILS G.O.MS.No. 34, DATE 09-09-2019](https://drive.google.com/file/d/1gondR4pz22xRyqbijP5FQdXw499LI_zC/view?usp=sharing)󠁿**

### **󠀁[OFFICIAL WEBSITE AP TRANSPORT](https://www.aptransport.org/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
