find-your-vote-any-mistakes-new-votes-corrections-of-your-voter-id

find-your-vote-any-mistakes-new-votes-corrections-of-your-voter-id

ఓటరు జాబితాలో మీ వివరాలు తప్పుగా ఉన్నాయా? మీ పేరు, ఊరు, అడ్రస్ లాంటి వివరాలేవైనా మార్చుకోవాలనుకుంటున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు.

 ఓటర్ లిస్ట్‌లో మీ వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవచ్చు.

అన్ని పోలింగ్ బూత్‌లల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి తప్పులు సరిదిద్దుకోవచ్చు.

అంతేకాదు కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయంలోనూ ప్రత్యేక కౌంటర్లుంటాయి. వీటితో పాటు మీ సేవా కేంద్రాల్లోనూ తప్పులు సరిదిద్దుకోవచ్చు. మీ పేరులో తప్పులు ఉన్నా, తల్లి, తండ్రి, భర్త పేరు తప్పుగా ఉన్నా, ఇంటి అడ్రస్‌లో ఏవైనా తేడాలు ఉన్నా వాటిని సరిచేసుకోవచ్చు.

కొత్తగా ఓటు నమోదు చేయాలనుకుంటే ఫామ్-6, ఓటర్ జాబితాలో అడ్రస్ మార్చడానికి ఫామ్-7, మీ వివరాలు తప్పుగా ఉంటే ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మరో అవకాశం..ఓటరు మార్పులు, చేర్పులకు ఇంకో చాన్స్‌*

*15 వరకు వెరిఫికేషన్‌ జోరుగా సాగుతున్న ప్రక్రియ*

*ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.

దీనిపై ఇప్పటికే అధికారులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.

ఓటరు జాబితాలో ఉన్న తప్పుఒప్పులను సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టర్‌ వెరిఫికేషన్‌ ప్రొగ్రాం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

దీంతో అక్టోబరు 15వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

దీని ప్రకారం ఓటర్లు జాబితాలను పరిశీలించుకుని సవరణలు చేసుకోవచ్చు.

18ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే వీలుంది.*

సవరణ విధానం ఇలా…

ఓటరు జాబితా సర్వేలో భాగంగా బూత్‌లెవల్‌ అధికారులు ఇంటింటికీ వస్తారు. ఈ సమయంలో పూర్తి వివరాలు వారికి చెప్పాలి. సవరణ కోసం ఏడు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని చూపించాలి. లేకుంటే సమీపంలో కామన్‌సర్వీసు సెంటర్‌(సీఎస్‌సీ)కి వెళ్లి సవరణ చేసుకోవచ్చు.

తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటరు సహాయక కేంద్రానికి కూడా వెళ్లొచ్చు.

ఓటర్స్‌ సర్వీసు పోర్టల్‌ లేదా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా మార్పులకు దరఖాస్తు చేసుకునే వీలుంది.

దివ్యాంగ ఓటర్లు హెల్ప్‌లైన్‌ 1950కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయొచ్చు.

సవరణకు వచ్చిన అభ్యర్థనలను బూత్‌లెవల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు

SEARCH YOUR NAME IN CEO AP

నమోదు ఇలా….*

*18ఏళ్లు నిండి ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరులేని వారు ఫారం-6ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ ఆన్‌లైన్‌ ద్వారా యాప్‌ లేదా స్వయంగా దరఖాస్తు అందించే అవకాశం ఉంది. 

మరణించిన, శాశ్వత వలస కారణాలపై తొలగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

ఇందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరులు దరఖాస్తు చేసుకున్న తర్వాత పూర్తి ఆధారాలు పరిశీలించిన తరువాతే తొలగింపు జరుగుతుంది.

ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఓటు బదిలీ కోసం పారం 8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.*

ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్ బుక్, పాస్‌పోర్ట్, ప్రభుత్వ సంస్థలు లేదా అనుబంధ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, రైతు గుర్తింపు కార్డుల్లో ఏదైనా ప్రూఫ్ చూపించాలి. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్-NVSP ద్వారా కూడా మీరు ఓటరు జాబితాలో మీ వివరాలను సరిచేసుకోవచ్చు.

1950 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి మీ వివరాలను సరిచేయొచ్చు.

మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు పరిశీలన జరుపుతారు.

2020 జనవరిలో తుది జాబితా ప్రచురితమవుతుంది.

ONLINE EGISTRATION E-REGISTRATION

error: Content is protected !!