Google-Post-Box-A-Digital-Wellbeing-Experiment-mobile-app

Google-Post-Box-A-Digital-Wellbeing-Experiment-mobile-app

Google Post Box -Mobile App*

*➖ Post Box App*

    _మీకు వచ్చే మెసేజ్ లు, నోటిఫికేషన్లు, ఆర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్ లోకి వెళ్లిపోతాయి.

మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి.

లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్ లు చూడొచ్చు._

     స్మార్ట్ ఫోన్… రోజూ అనేక అవసరాలను తీర్చే సాధనంగా మారిపోయింది.

స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి.

అయితే ఈ గ్యాడ్జెట్ ఇప్పుడు సమస్యగా మారిపోయింది.

స్మార్ట్ ఫోన్ లో యాప్స్ ఎక్కువగా ఉండటం, వాటి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తోనే గడపాల్సి వస్తోంది.

మెసేజ్ లు, అలర్ట్స్, నోటిఫికేషన్లు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి.

స్మార్ట్ ఫోన్ కాస్త ఎక్కువగా ఉపయోగించేవారికి రోజూ 1000 పైగా నోటిఫికేషన్స్ వస్తాయని అంచనా.

అందులో వాట్సప్ మెసేజ్ లు, టెక్స్ట్ మెసేజ్ లు, యాప్ నోటిఫికేషన్లు, పుష్ నోటిఫికేషన్స్, అలర్ట్స్… ఇలా చాలా ఉంటాయి.

నోటిఫికేషన్ రాగానే చూడకుండా ఉండలేని పరిస్థితి యూజర్లది.

ఎంత బిజీ పగుల్లో ఉన్నా, చివరకు హాలిడేస్ లో, వెకేషన్లో ఉన్నా ఈ నోటిఫికేషన్ల సమస్య తప్పదు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ యాప్ రూపొందించింది.

డిజిటల్ వెల్ బీయింగ్ లో భాగంగా ‘పోస్ట్ బాక్స్’ యాప్ ను రూపొందించింది.

ఆ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

గతంలో ఇళ్ల ముందు పోస్ట్ బాక్సులు ఉండేవి. లెట్స్ ఏవైనా వస్తే పోస్ట్ బాక్స్ లో వేసి వెళ్లిపోయేవాడు పోస్ట్ మ్యాన్. తీరికగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసి లెటర్స్ చదవడం అప్పట్లో ఉన్న అలవాటు.

సరిగ్గా ఇదే కాన్సెప్ట్’ పోస్ట్ బాక్స్ యాప్ రూపొందించింది గూగుల్. ఈ యాప్ ఆన్ చేశారంటే… మీకు వచ్చే మెసేజ్ లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్ లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి.

లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్ లు చూడొచ్చు. అంటే మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా సెలవుల్లో ఉన్నప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని డిట్రాక్ట్ చేయొద్దు అనుకుంటే పోస్ట్ బాక్స్ యాప్ ఆన్ చేస్తే చాలు.

ఒక్క మెసేజ్, నోటిఫికేషన్ కూడా రాదు.

అన్నీ పోస్ట్ బాక్స్ లోకి వెళ్లిపోతాయి.

DOWNLOAD GOOGLE POSTBOX APP CLICK HERE FOR DOWNLOAD

PHP Code Snippets Powered By : XYZScripts.com
error: Content is protected !!