Google Summer Internship 2021: ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది.
బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. లైఫ్ సెటిలయ్యే అవకాశం కల్పిస్తున్న గూగుల్
నిరుద్యోగులకు గూగుల్ గుడ్‌న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది.
ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది.
హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది.
పూర్తి వివరాలతో పాటు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ.
ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది.
ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు: ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేయాలి.
చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి.
ఇతర అర్హతలు: జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గారిథమ్స్ తెలిసి ఉండాలి.
వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి.
దరఖాస్తు విధానం:
మొదట వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అందులో Application Engineering Intern, Summer 2021 సెర్చ్ చేయాలి.
అందులో హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.
12 నుంచి 14 వారాలు: ఈ ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు కొనసాగుతోంది.
ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది.
డిసెంబర్ 11, 2020 దరఖాస్తుకు చివరితేది. ఇండియా మొత్తం మీద హైదరాబాద్, బెంగుళూర్‌లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్ బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి.
అంతేకాకుండా ఒకటికన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే జావా, సీ ప్లస్ ప్లస్, పైథాన్ తెలిసి ఉండాలి.
అంతేకాకుండా ఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి.