# goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers

- Link: https://amaravathiteacher.com/goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers/
- Published: 2020-09-09T08:41:49+05:30
- Author: amaravathiteacher

## **goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/09/IMG-20200916-
WA0004.jpg?resize=618%2C423&ssl=1)

### **Septembr 21st నుంచి ఆన్లైన్ బడులు\***

### **\*తొమ్మిది నుంచి ఇంటర్ వరకే\***

### **21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి కమీషనర్   గారి వివరణ.\***

### ** \*నేడు పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు పై  కమీషనర్ గారిని వివరణ కోరగా  21వ తేదీన అన్ని యాజమాన్యాల అందరూ ఉపాధ్యాయులు (Primary, UP,HS ) హాజరు కావాలని తెలిపారు\***

### **  \*22వ తేదీ నుండి  50% ఉపాధ్యాయులు హాజరుకావాలి.\***

### **     \*ఏకోపాధ్యాయ  పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజు హాజరు కావాలని తెలియజేశారు\***

### **   \*ఈ విషయం పై అన్ని జిల్లాల DEO లకు  కొద్ది సేపటి క్రితం  కమీషనర్ గారు  సమాచారం అందించటం జరిగింది\***

### ** ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు హాజరు కావాలి.**

### ** అదేవిధంగా 22వ తేదీ నుండి 50% మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలన్నారు. **

### **\*️కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బడులు తెరిచేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. **

### **తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ****ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. **

### **️కరోనాతో 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. తొమ్మిది నుంచి ఇంటర్ వరకు స్కూల్స్, కాలేజీలు తెరిచేందుకు విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసుకుంది.**

### **️అయితే, విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్లో ****బోధించాలని నిర్ణయించింది. **

### **స్కూళ్లు తెరిచే రోజునే తల్లిదండ్రుల పర్యవేక్షక కమిటీలతో (పీఎంసీ) సమావేశం ఏర్పాటు చేసి కొవిడ్ నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.**

### ** ️ఉపాధ్యాయులు 50 శాతం హాజరుకావాలని సూచించింది. ఆన్‌లైన్ బోధన, టెలీ కౌన్సెలింగ్, విద్యావారధి ఈ కార్యక్రమాల ద్వారా బోధిస్తున్న పాఠాలపై అనుమానాలు**

### **ఉంటేనే విద్యార్థులు పాఠశాల లకు రావాల్సి ఉంటుంది. అది కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక సమ్మతి తీసుకోవాలని స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. **

### **️అన్ని స్కూళ్ల హెచ్ఎంలు, కాలేజీ ప్రిన్సిపాల్స్**

### **ప్రాంగణాలను శుభ్రం చేయించి, “శానిటైజ్ చేయించాలని తెలిపింది. నోట్ బుక్, పెన్నులు, పెన్సిల్, ఎంజర్, వాటర్ బాటిల్ మొదలైన వస్తువులను విద్యార్థులు పంచుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. **

### **️విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి గత విద్యాసంవత్సరంలో వారి అభ్యాసన ఫలితాలను అంచనా వేయడానికి పరీక్షలు నిర్వహించాలి.**

### ** ️23న రెండో రౌండ్ ఉపాధ్యాయులు వారి సబ్జెక్ట్ కు అనుగుణంగా ఇదే పని చేపట్టాలి. పరీక్ష ఫలితాలను విశ్లేషించి పరిష్కార సాధన కోసం**

### **విద్యార్థులకు మార్గదర్శకత్వం, సౌలభ్యాన్ని బట్టి రోజు వారీగా వర్క్ షీట్లు ఇవ్వాలి.**

### **️విద్యార్థులు వర్క్ షీట్లను ఇంట్లో లేదా పాఠశాలలో ప్రాక్టీస్ చేయవచ్చు. అక్టోబరు ఐదో తేదీ వరకు విద్యాసంస్థలు ఇలానే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.**

### ** ️ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంటి నుంచే పాఠాలు బోధించాలి.**

### **ఉన్నత విద్యా సంస్థలు, పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు**

### **మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది. **

### **లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆప్షన్‌ ఇచ్చింది. **

### **ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని పేర్కొన్నది.**

### **ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే..\***

### **\*21 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..\***

### **\*9 నుంచి 12 తరగతులకు బోధన..\***

### **అక్టోబరు 5న స్కూళ్లు ప్రారంభించే ఆలోచన.**

### **󠀁[విద్యార్థి తల్లిదండ్రుల/సంరక్షకుని అంగీకార పత్రము డౌన్లోడ్](https://drive.google.com/file/d/1bvFjJSyq-jN93Vz1wcKzUT8HpvHnLrur/view)󠁿-2**

### **󠀁[6th TO 9TH CLASS VARADHI WORK BOOKS ALL SUBJECTS AP SCERT](https://amaravathiteacher.com/varadhi-all-subjects-worksheets-from-class-6th-to-9th-class-ap-2020/)󠁿**

### **󠀁[10th CLASS VARADHI WORK BOOKS ALL SUBJECTS AP SCERT](https://amaravathiteacher.com/varadhi-worksheets-for-10th-class-all-subjcts-pdf-fils-2020/)󠁿**

### **కోవిడ్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.**

### **అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు  అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. **

### ** కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది. **

### **తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత పాటించేలా, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన అన్ని ప్రామాణిక నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. **

### **ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు స్వచ్ఛందంగా వచ్చి ఉపాధ్యాయుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్న 9-12వ తరగతి విద్యార్థులకుగాను ప్రత్యేక సూచనలను విడుదల చేసింది. **

### **ఈ నెల 21 నుంచి తల్లిదండ్రుల అనుమతితో ఆయా తరగతుల విద్యార్థులు పాఠశాలలకు రావడానికి కేంద్రం అనుమతించిన విషయం విదితమే. **

### **తరగతి గదుల నిర్వహణ, రవాణా సదుపాయాలతో పాటు పాఠశాలల్లో పాటించాల్సిన అన్ని జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. **

### **విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపింది.**

### **21  వ తేదీ నుంచి  స్వచ్ఛందంగా హాజరు అయ్యే 9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇవ్వాల్సిన అంగీకార పత్ర ము… నమూనా**

### **󠀁[విద్యార్థి తల్లిదండ్రుల/సంరక్షకుని అంగీకార పత్రము డౌన్లోడ్](https://drive.google.com/file/d/1bvFjJSyq-jN93Vz1wcKzUT8HpvHnLrur/view?usp=sharing)󠁿-1**

### **󠀁[SONU SOOD SCHOLARSHIPS DETAILS & ONLINE LINK](https://amaravathiteacher.com/sonu-sood-offers-scholarships-2020-for-poor-students/)󠁿**

### **󠀁[10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS DOWNLOAD](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### **󠀁[CENTRAL GOVERNMENT GUIDELINES FOR REOPEN SCHOOLS & COLLEGES DOWNLOAD ](https://drive.google.com/file/d/1FBMlvYDGUaD3zlhtr32blF77vozKdlYb/view?usp=sharing)󠁿**

### **󠀁[APPSC DEPARTMENTAL EXAMS RESULTS FROM 2008 TO 2019](https://amaravathiteacher.com/appsc-departmental-test-exams-results-from-2008-to-2019/)󠁿**

### **పాఠశాలల పునఃప్రారంభానికి ముందస్తు ప్రణాళిక**

### **SYకంటైన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలల్ని తెరవొచ్చు. **

### **కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లోకి అనుమతి లేదు. **

### **కంటైన్‌మెంట్‌ జోన్లలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్ల కూడదు.**

### **\* పాఠశాలల్లోని ప్రయోగశాలలు, ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేయాలి.**

### **\* క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించిన పాఠశాలలను తప్పని సరిగా నిబంధనల ప్రకారం శానిటైజ్‌ చేయాలి.**

### **\* ఉపాధ్యాయులు, సిబ్బంది 50శాతం మంది హాజరయ్యేలా చూడాలి.**

### **\* 9-12 విద్యార్థులకు భౌతికంగా లేదా వర్చువల్‌ తరగతులకు హాజరయ్యే ఐచ్ఛికం ఇవ్వాలి. భౌతికంగా హాజరయ్యే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.**

### **\* బయో మెట్రిక్‌ హాజరు పద్దతి అవసరం లేదు.**

### **\* ఉపాధ్యాయులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. **

### **వీలుంటే ఆరు బయట కూర్చొనేలా చూడాలి.**

### **\* ప్రాంగణంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనే ఏర్పాట్లు ఉండాలి.**

### **\* ‘క్యూ’ పద్ధతి పాటించే విషయంలో ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్‌ చేయాలి.**

### **\* సమావేశాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు సహా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలు నిషేధం**

### **\* ప్రతి పాఠశాలలోనూ రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబరు, స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్‌ నంబర్లు ప్రదర్శించాలి.**

### **\* తరగతి గదుల్లో ఏసీ, వెంటిలేషన్‌ తదితర అంశాల్లో సంబంధిత మార్గదర్శకాలు అమలుచేయాలి.**

### **\* విద్యార్థులు లాకర్లు ఉపయోగించొచ్చు.**

### **\* స్విమ్మింగ్‌ పూల్‌ తప్పని సరిగా మూసివేయాలి.**

### **\*♦పాఠశాలలు తెరిచిన తర్వాత …\***

### **\* విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. వాటి వద్ద పరిశుభ్రత పాటించాలి. థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి.**

### **\* కరోనా లక్షణాలు లేనివారిని అనుమతించాలి.**

### **\* కరోనా జాగ్రత్తలకు సంబంధించి గోడపత్రికలు డిస్‌ప్లే చేయాలి.**

### **\* ఏ ప్రాంతంలోనూ ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.**

### **\* సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.**

### **\*♦తరగతి గదుల్లో…\***

### **\* విద్యార్థులు కూర్చొనే చోట ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి.**

### **\* తరగతి జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కు ధరించే ఉండాలి.**

### **\* నోట్‌బుక్‌, పెన్నులు, పెన్సిళ్లు, మంచినీరు బాటిళ్లు తదితర వస్తువులు ఏవీ కూడా ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడాలి.**

### **\*♦ప్రయోగశాలల్లో …\***

### **\* ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్‌ సమయంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి.**

### **\* ఉపయోగించే పరికరాలన్నిటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.**

### **\* పరికరాలు ఉపయోగించే ముందు తర్వాత చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి.**

### **\*♦గ్రంథాలయాల్లో…\***

### **\* ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి**

### **\* మాస్కు తప్పనిసరిగా ధరించాలి**

### **\* కేఫ్‌టేరియా, మెస్‌ సౌకర్యాలు మూసివేయాలి.**

### **󠀁[DD SAPTHAGIRI VIDEIO LESSONS SCHEDULE & LIVE LESSONS](https://amaravathiteacher.com/revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel-august/)󠁿**

### **󠀁[10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS DOWNLOAD ](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### **రవాణా, ఇతరత్రా సమయాల్లో…\***

### **\* బస్సులు, ఇతరత్రా రవాణా సాధనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడంతోపాటు సామాజిక దూరం పాటించేలా చూడాలి.**

### **\* పాఠశాల ప్రాంగణం రోజూ శుభ్రం చేయాలి.**

### **\* కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను శానిటైజ్‌ చేయాలి.**

### **\* మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి.**

### **\* విద్యార్థులతో పరిశుభ్రత పనులు చేయించరాదు.**

### **\* విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించాలి.**

### **\* పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్‌ చేసి ప్రత్యేక గదిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.**

### **\*♦ఉన్నత విద్యా సంస్థల్లో పాటించాల్సిన జాగ్రత్తలు..\***

### **\* పరిశోధన, వృత్తిపరమైన కోర్సులు నిర్వహించే సంస్థల్లో ప్రయోగశాలలకు అనుమతులు కరోనా ప్రామాణిక నిర్వహణ నిబంధనలకు లోబడి ఉండాలి.**

### **\* నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఉపయోగించే పరికరాల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలి. స్థలం అందుబాటులో ఉంటే ఆయా పరికరాలను ఆరుబయట లేదా వరండాలలో అమర్చి భౌతిక దూరం పాటించేలా చూడాలి.**

### **\* ఆన్‌లైన్‌ తరగతులు, రెగ్యులర్‌ తరగతులు సమ్మిళితంగా కొనసాగాలి.**

### **\* రెగ్యలర్‌ తరగతి గదుల్లో విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వేర్వేరు టైమ్‌ స్లాట్‌ను అమలు చేయాలి.**

### **\* ఆరు అడుగుల దూరం పాటిస్తూ సిటింగ్‌ ఏర్పాట్లుండాలి.**

### **\* వసతి గృహాల్లోనూ పడకల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి.**

### **\* వైరస్‌ సోకిన విద్యార్థులకు వెంటనే ప్రత్యేక గదులు కేటాయించాలి. వైద్య సదుపాయం కల్పించాలి.**

### **\* ఆహారశాలల్లో రద్దీ నివారణకు భోజన సమయాలను వేర్వేరుగా కేటాయించాలి.**

### **\* చేతులు శానిటైజ్‌ చేసుకొనే వసతులు అందుబాటులో ఉండాలి.**

### **󠀁[VARADHI WORK SHEETS FOR 10TH CLASS AP SCERT DOWNLOAD PDF FILES](https://amaravathiteacher.com/varadhi-worksheets-for-10th-class-all-subjcts-pdf-fils-2020/)󠁿**

### **󠀁[VARADHI WORK SHEETS FRO 6TH TO 9TH CLASS ALL SUBJECTS (T.M & E.M)](https://amaravathiteacher.com/varadhi-all-subjects-worksheets-from-class-6th-to-9th-class-ap-2020/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
