government-help-poor-brahmin-for-upanayanam-brahmin-welfare-corporation

government-help-poor-brahmin-for-upanayanam-brahmin-welfare-corporation

పేద బ్రాహ్మణ కుటుంబాలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు మరో పథకాన్ని జగన్ సర్కారు అమలు చేయనుంది.

పేద బ్రాహ్మణ కుటుంబాలకు త్వరలో ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పనుంది.

పేద బ్రాహ్మణ కుటుంబాలు ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ ద్వారా ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు.

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన ఏడేళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న వారు ఉపనయనం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందజేస్తారు.

‘భారతి’ పథకంతో రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం అలాగే విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు ‘భారతి’ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.

ఈ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.

దీనికి సంబంధించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

1ST CLASS TO PG BHARATHI SCHEME GUIDELINES IN TELUGU

Bharati Scheme : Re-scan & upload documents DOWNLOAD

ఏడాదికి రూ.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.

ఈ పథకంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారికి మరోసారి ఆర్థిక సాయాన్ని ఇవ్వరు.

కనీసం ఏడాది కాలం మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో అడ్మీషన్స్ పొందిన మాత్రమే ఈ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నట్లు అధికారులు తెలిపారు.

15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటి వరకు 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు.

వారందరికీ త్వరలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.

Registeration-Bharati Scheme : for Education (2019-20)

AP BRAHMIN CORPORATION OFFICIAL WEBSITE

error: Content is protected !!