# government-plans-implement-new-methodology-pre-primary-schools

- Link: https://amaravathiteacher.com/government-plans-implement-new-methodology-pre-primary-schools/
- Published: 2020-10-17T08:55:54+05:30
- Author: amaravathiteacher

## **government-plans-implement-new-methodology-pre-primary-schools**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/10/PREPRIMARY-
SCHOOLS.jpg?resize=448%2C276&ssl=1)

### విద్యా పునాదులు మరింత పటిష్టం

### వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు

### పిల్లల్లో మెదడు వికసించే దశలో ఆట పాటలతో చదువు

### అందుకు అనుగుణంగా పీపీ1, పీపీ2లలో పాఠ్యాంశాలు

### టీచర్లకు హ్యాండ్‌ బుక్స్‌, పిల్లలకు బొమ్మల పుస్తకాలు

### సిలబస్‌ రూపొందించిన ఎస్‌సీఈఆర్‌టీ

### విద్యారంగంలో సమూల మార్పుల దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.

### దీనికి సంబంధించి సిలబస్‌, పుస్తకాలను రూపొందించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్‌ ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది.

### ఇటీవల జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేనాటికి 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని వివిధ అధ్యయనాలు పేర్కొంటున్నందున ఆ దశలోనే వారిలో చదువుకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

### ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.

### వీటిలో దశలవారీగా ప్రీప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.

### ప్రీప్రైమరీ కింద మూడేళ్ల పిల్లలకు పీపీ1, నాలుగేళ్ల పిల్లలకు పీపీ2 ఉంటాయి.

###  ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల సమయాల్లోనే ఈ పీపీ1, పీపీ2 తరగతులు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించింది.

### జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన కరిక్యులమ్‌ను అనుసరించి ఈ పీపీ1, పీపీ2 పుస్తకాలు ఉండనున్నాయి.

### **బోధన, క్లాసులు ఇలా..**

### **⇔ **టీచర్లకు హా‍్యండ్‌బుక్‌తో పాటు పిల్లలకు నాలుగేసి బొమ్మల పుస్తకాలను ఎస్‌సీఈఆర్టీ రూపొందించింది. 

### **󠀁[AP TEACHRS TRANSFERS GUIDELINES & SCHEDULE](https://amaravathiteacher.com/ap-teachers-transfers-rationalization-guidelines-october-2020/)󠁿**

### **󠀁[PROMOTIONS SENIORITY LISTS FOR ALL 13 DISTRICTS CLICK HERE](https://amaravathiteacher.com/ap-teachers-transfers-rationalization-how-to-know-mandal-wise-schools-enrollment/)󠁿**

### **⇔ **3 సెమిస్టర్లుగా ఇవి ఉంటాయి. జూన్‌-సెప్టెంబర్‌, అక్టోబర్‌-డిసెంబర్‌, జనవరి-మార్చిగా విభజించి ఆ మేరకు హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు.⏎ **⇔ **పీపీ1, పీపీ2 పిల్లల కోసం వేర్వేరుగా బొమ్మల రూపంలో ఉన్న ఫన్‌బుక్‌, రైమ్స్‌ బుక్‌, స్టోరీ బుక్‌, వర్క్‌ బుక్‌ తయారుచేస్తున్నారు.**⇔ **టీచర్లకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలు పిల్లలకు ఎలా చెప్పాలో సూచనలు ఇస్తారు.**⇔ **ఇంగ్లిష్‌, తెలుగు అక్షరమాల, అంకెలతో పాఠ్యపుస్తకాలు ఉంటాయి. పీపీ1లో పరిచయం చేసిన వాటినే పీపీ2లో కొంచెం వివరంగా చూపిస్తూ నేర్పిస్తారు.**⇔ **పదినెలల బోధనా కాలంలో నెలకో అంశాన్ని బోధించేలా పుస్తకాలు రూపొందించారు. **⇔ **టీచర్లు ఆ అంశాల గురించి చెబుతున్నపుడు వర్కుబుక్‌లో పిల్లలతో వాటిని గుర్తు పట్టేలా చేస్తారు.**⇔ **పీపీ1 పిల్లలకు మౌఖికంగా తరగతులుంటాయి. పీపీ2లో రాతకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవడేలా చేస్తారు. **⇔ **ఉదయం 9-15కి తరగతులు ప్రారంభమవుతాయి.

### ఒక్కోటి అరగంట సేపు చొప్పున మొత్తం 6 పీరియడ్లుంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతికి సమయం ఇస్తారు.⏎ **⇔ **తరువాత 2 నుంచి 3 వరకు క్లాసులు కొనసాగించి 3.10కి ఇళ్లకు పంపిస్తారు.

### **ఆటపాటలతో విద్యాబోధన:**⏎ అరగంట కొక అంశాన్ని ఆటపాటలతో నేర్పించేలా కరిక్యులమ్‌ ఉంటుంది. ఆయా పీరియడ్లలో ఏం చెప్పాలో ఎన్‌సీఈఆర్‌టీ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి ఎస్‌సీఈఆర్‌టీ ఈ కరిక్యులమ్‌ను రూపొందించింది.

### అంగన్‌వాడీ టీచర్లకు వీటిపై శిక్షణ ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలను యూట్యూబ్‌లో పెట్టి అంగన్‌వాడీ టీచర్లు నేర్చుకొనేలా చేయనున్నారు.**– ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి**

### **󠀁[ANGANWADI WORKERS & HELPERS RCRUITMENT DETAILS](https://amaravathiteacher.com/replacement-of-5905-anganwadi-workers-helpers-posts-in-ap/)󠁿**

### **󠀁[TEACHERS TRANSFERS POINTS ONLINE CALICULATOR ](https://amaravathiteacher.com/ap-teachers-transfers-points-online-calculator/)󠁿**

### **󠀁[SONU SOOD MERIT SCHOLARSHIPS DETAILS & OFFICIAL WEBSITE](https://amaravathiteacher.com/sonu-sood-offers-scholarships-2020-for-poor-students/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
