grama-valunteer-notification-online-application-guidelines

grama-valunteer-notification-online-application-guidelines

గ్రామ-వార్డు వలంటీర్ల నియామక విధి విధానాలు రెడీ

 నోటిఫికేషన్‌ విడుదల అయినది.

నేటి నుంచి 5 వరకు దరఖాస్తుల స్వీకరణ

కేటగిరీల వారీగా రిజర్వేషన్‌ విధివిధానాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం

స్థానికులకే అవకాశం.. దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో టెన్త్‌ అర్హత

18-35 మధ్య వయస్సు వారే అర్హులు

ఎంపికకు మండల, పట్టణ స్థాయిలో అధికారుల కమిటీలు

11 నుంచి ఇంటర్వ్యూలు.. ఆగస్టు 1న ఎంపికైన వారి జాబితా వెల్లడి

ఆగస్టు 5-10 తేదీల మధ్య శిక్షణ.. అదే నెల 15 నుంచి విధుల్లోకి.

ఆంధ్రప్రదేశ్ గ్రామ,  వార్డు వాలంటీర్ల  నియామకం  పై ఒక అవగాహన:

ఉద్యోగం పేరు : 

గ్రామ,వార్డు    వాలంటీర్లు.

విద్యార్హత:

వార్డు వాలంటీర్లు  కు అయితే డిగ్రీ ,గ్రామ వాలంటీర్లు కు ఆయితే  ఇంటర్, గిరిజన ప్రాంత వాలంటీర్లకు  అయితే పదోవ తరగతి .

వేతనం  :5000+ ప్రయాణపు  ఖర్చులు .

వయసు:18-35

 ఉద్యోగాల సంఖ్య : 

దాదాపుగా నాలుగు లక్షలు .

రిజర్వేషన్  :

ST,SC,BC,minority లకు 50%  రిజర్వేషన్ .

(  ప్రతి కేటగిరీ లో 50%  మహిళలకే  ప్రాధాన్యత .)

గ్రామ- వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.

వలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది.

నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరి ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం విదితమే.

వీరి ఎంపికకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. అందులోని నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌లో పేర్కొంటారు.

జూలై ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు.

ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వలంటీర్ల నియామకానికి అర్హతలు 

– కనీస విద్యార్హత పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి.

– 18-35 ఏళ్ల మధ్య వయస్సు వారే దరఖాస్తుకు అర్హులు

– ఏ గ్రామంలో, పట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు.

– ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు,

స్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు.

నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం,

తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు.

బేస్‌లైన్‌ సర్వే ఆధారంగా 50 ఇళ్ల గ్రూపుల ఏర్పాటు 

 బేస్‌ లైన్‌ సర్వే ఆధారంగా గ్రామం,

వార్డులో ఉన్న కుటుంబాలను 50 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు.

మండల స్థాయిలో ఎంపీడీపీ, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులను కూడా వర్గీకరిస్తుంది.

పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్‌ కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మరొక సీనియర్‌ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది.

గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్లకన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపులతో సర్దుబాటు చేస్తారు.

GRAMA VOLUNTEER NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

GRAMA VOLUNTEER ONLINE APPLICATION USER MANUAL

గ్రామ వాలంటీర్ల అప్లికేషన్ మొదలు అయినది:* 

అప్లై చేసుకొనే పద్దతి:

*STEP 1:* ముందుగా పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి. 

*STEP 2:* అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి. 

*STEP 3:* తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.

*STEP 4:* తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా వీటిని అప్లోడ్ కూడా  చేయాలి.

*STEP 5:* తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.

*చివరగా APPLY పై క్లిక్ చేయండి.

మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.*

ఎంపిక విధానం.. 

– వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు.

గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది.

అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు. 

– ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది.

– అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.

– వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు.

పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు. 

– మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. 

– వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.

– ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ-వార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం.

ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది.

నోటిఫికేషన్ జారీ : 

జూన్ -22

దరఖాస్తుల  పరిశీలన:

10-  జులై 

ఇంటర్వ్యూ: 

జులై-11 నుండి జులై -25

మెరిట్ లిస్ట్ : 

ఆగష్టు -1

శిక్షణ కార్యక్రమము : 

ఆగష్టు -5  నుండి ఆగష్టు -10  వరకు .

అపాయింట్మెంట్  : 

ఆగష్టు-15.

DUTIES & QUALIFICATIONS OF GRAMA VOLUNTEER

ONLINE APPLICATION FOR GAMA VALUNTER CLICK HERE

NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

error: Content is protected !!