గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి.
ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి.
కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని.. రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు.
దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ది 20.09.2020 నుండి ది 26.09.2020 వరకు నిర్వహించు వ్రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకొనిన అభ్యర్ధులు, పరీక్షా హాల్ టికెట్లను తేది:12.09.2020 ను అధికారికముగా గ్రామ సచివాలయము వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
పరీక్షా కేంద్రములకు సంబంధించిన చిరునామా పూర్తి వివరాలు ను సందర్శించి తెలుసుకోవచ్చు.CLICK HERE
19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి.
వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.