HANTAVIRUS-in-Chaina-complete-details-March-2020

HANTAVIRUS-in-Chaina-complete-details-March-2020

Hantavirus : హంటా వైరస్‌కి భయపడాల్సిన పనే లేదు… ఎందుకంటే…

ప్రజల్లో భయాందోళనలు గలిగించడం కొందరికి అలవాటైపోతోంది. హంటా వైరస్ సంగతేంటో తెలుసుకుందాం.

కరోనా వైరస్ సమస్య ఇలా ఉంటే… చైనాలో హంటా వైరస్ ప్రబలుతోందనీ, ఆల్రెడీ ఓ వ్యక్తి చనిపోయాడని… కొందరు సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేస్తన్నారు.

నిజానికి ఇదో అత్యంత చిన్న విషయం. దీన్ని కావాలని బూతద్దంలో చూపిస్తూ… ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు.

సపోజ్ మనం తినే ఆహారంలో తేడా వచ్చి ఓ 50 మందికి కడుపులో తిప్పితే… వాళ్లలో ఒకరిద్దరు చనిపోవడం సర్వసాధారణం.

చైనాలో కూడా అదే జరిగింది. హంటా వైరస్ అనేది కొద్ది మందికి వ్యాపించిన తర్వాత… వాళ్లలో ఓ వ్యక్తి చనిపోయాడు.

మిగతా వాళ్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. దీన్ని కొంపలు ముగిపోతున్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.

చైనా నుంచి మరో వైరస్ రాబోతోందని ఎక్కడ లేని అనవసరపు ప్రచారం చేస్తున్నారు.

హంటా వైరస్ అనేది అంటు వ్యాధి కాదు. కాబట్టి అది బలవంతంగా సోకదు.

మనుషుల నుంచి మనుషులకు రాదు.

ఎలుకల్లో ఉండే ఈ వైరస్… ఎలుకలు మనుషుల్ని కుట్టినా, ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా, ఎలుకల లాలాజలం తిన్నా, ఎలుకల వ్యర్థాల్ని తిన్నా తద్వారా వైరస్ వస్తుందే తప్ప… ఇది అందరికీ సోకే వైరస్ కానే కాదు. అందువల్ల అసలు ఈ వైరస్ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు.

మన దేశంలో లెక్కలేనన్ని ఎలుకలున్నాయి.

కానీ శతాబ్దాలుగా ఏనాడూ వాటి వల్ల మనకు హంటా వైరస్ రాలేదు.

ఎందుకంటే మనం వాటి జోలికి వెళ్లం, వాటిని తినం. చైనాలో అలా కాదు. వాళ్లు ఎలుకల్ని కూడా తింటారు.

రకరకాలుగా వండుకుంటారు. కాబట్టి… ఎక్కడో తేడా వచ్చి కొందరికి వైరస్ సోకింది.

మీకు తెలుసా… హంటా వైరస్ అనేది తొలిసారి కొరియా యుద్ధంలో బయటపడింది.

అప్పట్లో 3000 మంది వైరస్ బారిన పడగా… 190 మంది చనిపోయారు.

ఆ తర్వాత ఈ వైరస్ ఎవరికీ పెద్దగా సోకలేదు. ప్రపంచం దీన్ని ఎప్పుడో మర్చిపోయింది.

దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!

WHAT IS LOCK DOWN? PUBLIC DOS AND DONT’S READ

error: Content is protected !!