health-medical-family-welfare-department-health-provider-exams-results

health-medical-family-welfare-department-health-provider-exams-results

ఏపీ ‘హెల్త్‌ ప్రొవైడర్’ పరీక్ష ఫలితాలు వెల్లడి

ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.. జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఏపీ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి డిసెంబరు 10న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను జోన్ల వారీగా.. హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పేరుతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఆన్‌లైన్ విధానంల నిర్వహించిన రాతపరీక్షలో అన్ని జోన్ల పరిధిలో కలిపి మొత్తం 11,441 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

ZONE-1 RESULTS

ZONE-2 RESULTS

జోన్లవారీగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితా ఓసారి పరిశీలిస్తే.. జోన్-1 పరిధిలో 2,090 మంది అభ్యర్థులు, జోన్-2 పరిధిలో 2,810 మంది అభ్యర్థులు, జోన్-3 పరిధిలో 2,132 మంది అభ్యర్థులు, జోన్-4 పరిధిలో 4,409 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

ఏపీలో మొత్తం 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి ఆరోగ్యశాఖ నవంబరు 16న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.  డిసెంబరు 10న ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించింది. తాజాగా ఫలితాలను వెల్లడించింది.

శిక్షణ ఇలా..
రాతపరీక్షల్లో అర్హత సాధించిన వారి నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆరునెలల పాటు శిక్షణ నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది.

శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియమించనున్నారు.

వేతనం..
ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనంగా నెలకు రూ.25,000 అందజేస్తారు. శిక్షణ సమయంలో ఎలాంటి స్టైపెండ్ చెల్లించరు.

ZONE-3 RESULTS

ZONE-4 RESULTS

Commissionerate of Health Family Welfare MAIN WEBSITE CLICK HERE

error: Content is protected !!