# how-to-earn-money-from-youtube-channel-details

- Link: https://amaravathiteacher.com/how-to-earn-money-from-youtube-channel-details/
- Published: 2019-12-21T19:59:38+05:30
- Author: amaravathiteacher

## **how-to-earn-money-from-youtube-channel-details**

### **యూట్యూబ్ ద్వారా మన స్కూలు లో మనం చేసే కృత్యాలు, ప్రయోగాలు, TLM ప్రదర్సనలు వీడియోలు అప్లోడ్ చేయవచ్చు. **

### **ఈ విడియోలు ద్వారా కొద్దిగా ఆదాయం కూడా వస్తుంది.**

### **ప్రపంచంలో 200 కోట్ల మందికిపైగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. **

### **యూట్యూబ్ ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారూ ఈ ప్రపంచంలో ఉన్నారు. **

### **అలా డబ్బు సంపాదించేవారిలో మీరూ చేరాలంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలి. **

### **మీ సొంత వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చెయ్యాలి. **

### **యూట్యూబ్ చెప్పిన రూల్స్ పాటించాలి. మీకు ఫేస్‌బుక్, ట్విట్టర్, జీమెయిల్ అకౌంట్లు ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. **

### **ఇక ఆలస్యమెందుకు ఎలా సంపాదించాలో ఏమాత్రం అయోమయం లేకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి… ఫాలో అయిపోండి.**

 

**ఇలా చెయ్యండి.**
**\* ముందుగా గూగుల్‌లో సైన్ ఇన్ అవ్వండి. మీ జీమెయిల్ అకౌంట్ ఐడీయే
గూగుల్ ఐడీ కూడా. అదే యూట్యూబ్ ఐడీ కూడా. **

### **ఆ ఐడీ పేరే మీ యూట్యూబ్ ఛానెల్ పేరు కూడా. **

### **ప్రస్తుతానికి అదే పేరుతో మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చెయ్యవచ్చు. **

### **భవిష్యత్తులో పేరు మార్చుకోవచ్చు.**⏎ **\* యూట్యూబ్‌లో సైన్ ఇన్ అయిన తర్వాత… రైట్ సైడ్ టాప్‌లో అప్‌లోడ్ బటన్ ఉంటుంది. **

### **దాన్ని క్లిక్ చేసి మీ మొదటి వీడియోని అప్‌లోడ్ చెయ్యండి. **

### **మీ వీడియోకి టైటిల్ ఇవ్వండి. పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత పబ్లిష్ (Publish) ఆప్షన్ క్లిక్ చెయ్యండి. **

### **ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. **

### **ఏ వీడియో అయినా మీరు స్వయంగా తీసినదై, మీ సొంత వీడియో అయి ఉండాలి. **

### **మీ ఇంట్లో పిల్లల డాన్సులు, పాటలు పాడేవి, ఇంట్లో పిల్లులు, కుక్కలతో ఆడుకునేవి, చుట్టుపక్కల ఉండే పక్షులు, వంటలు, బొమ్మలు వెయ్యడం, టూరిస్ట్ ప్లేస్‌లు, సినిమాలపై రివ్యూలు ఇలా ఏవో ఒకటి మీరే స్వయంగా షూట్ చేసి… ఆ వీడియోలను మాత్రమే అప్ లోడ్ చెయ్యాలి. **

### **వేరే వాళ్ల వీడియోలను అప్ లోడ్ చెయ్యకూడదు.**

### **మీరు పబ్లిష్ చేసిన వీడియోలు… మీ యూట్యూబ్‌ ఛానెల్‌లోని వీడియో మేనేజర్‌ ఫోల్డర్‌లో కనిపిస్తాయి. (www.youtube.com/my_videos). ఆ వీడియోలకు యూట్యూ్బ్ మేనేజ్‌మెంట్ యాడ్స్ జతచేస్తుంది. **

### **తద్వారా యూడ్స్‌పై వచ్చే రెవెన్యూలో 60 శాతం మీకు ఇస్తుంది. **

### **ఇలా జరగాలంటే రెండు కండీషన్లు ఉన్నాయి. **

### **(1) ఏడాదిలో మీకు సొంతంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి.**

### ** (2) మీ వీడియోల మొత్తం వ్యూస్ 4లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి. **

### **ఈ రెండు కండీషన్లూ పూర్తవడానికి మీకు కనీసం 2 నెలల నుంచీ ఏడాది పడుతుంది. **

### **మీరు మంచి వీడియోలు పెడితే త్వరగా టార్గెట్ చేరుకుంటారు. వారానికి కనీసం 3 వీడియోలైనా పోస్ట్ చేస్తే మంచిది. **

### **మీరు టార్గెట్ చేరుకున్నదీ లేనిదీ అనలిటిక్స్ ఫోల్డర్‌ (https://www.youtube.com/analytics)లో చూసుకోవచ్చు.**

 

**\* టార్గెట్ చేరుకున్నాక, మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు అప్లై చేసుకోవచ్చు. **

### **ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ (www.google.com/adsense) అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, మీకు ఓ ఐడీ నెంబర్‌ను యాడ్ సెన్స్ ఇస్తుంది. ఆ ఐడీని కాపీ చేసి… యూట్యూబ్‌ అకౌంట్‌లోని మోనెటైజేషన్ ఆప్షన్ (www.youtube.com/account_monetization)లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. **

### **ఓ వారంలో యూట్యూబ్ నుంచీ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచీ మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. **

### **తద్వారా మీకు మనీ రావడం మొదలవుతుంది.**

 

**\* యూట్యూబ్ ద్వారా మీరు ఎంత సంపాదించిందీ యూట్యూబ్‌ ఛానెల్‌లో కనిపించదు. **

### **అది తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్ లోకి (www.google.com/adsense) వెళ్లి చూసుకోవచ్చు.\* **

### **యాడ్ సెన్స్ అకౌంట్‌లో మీ సంపాదన 90 డాలర్లు (రూ.6 వేలకు పైగా) దాటగానే… గూగుల్ అకౌంట్‌లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రెస్‌కి గూగుల్ నుంచీ ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది. **

### **ఆ కోడ్‌లో ఉన్న ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది.**

### **󠀁[YOUTUBE CHANNEL MONETIZATION HERE](http://www.youtube.com/account_monetization)󠁿**

### **\* కోడ్ ఎంటర్ చేశాక… వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాల్ని యాడ్ సెన్స్ అడుగుతుంది. **

### **వాటిని కూడా యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.**

### **\* బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాక… మీ సంపాదన 100 డాలర్లు (రూ.7 వేలకు పైగా) అవ్వగానే… సింగపూర్‌లోని గూగుల్ బ్రాంచ్ నుంచీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ డబ్బును (100 డాలర్లను) పంపిస్తుంది గూగుల్. **

### **ఆ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది. **

### **ఈ మొత్తం ప్రాసెస్‌లో మీ యూట్యూబ్ ఛానెల్ పేరు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఇతర వివరాలు ఏవైనా, ఎప్పుడైనా మీరు మార్చుకునేందుకు వీలుంది. **

### **గూగుల్ వంద శాతం పక్కాగా పనిచేసే కంపెనీ. **

### **అందువల్ల పైన చెప్పిన యూట్యూబ్ రూల్స్ కూడా మీరు పక్కాగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే మీ ఛానెల్ క్లోజ్ అవుతుంది.**

### **󠀁[GOOGLE ADSENSE CLCK HERE](http://www.google.com/adsense)󠁿**

### **󠀁[YOUTUBE CHANNEL SIGN HERE](https://www.youtube.com/channel/UCbLUEURNtCCto6YAhkHt-nQ/featured)󠁿**

### 󠀁[YOUTUBE CHANNEL VIDEOS ](https://studio.youtube.com/channel/UCbLUEURNtCCto6YAhkHt-nQ/videos/upload?utm_campaign=upgrade&utm_medium=redirect&utm_source=%2Fmy_videos&filter=%5B%5D&sort=%7B%22columnType%22%3A%22date%22%2C%22sortOrder%22%3A%22DESCENDING%22%7D)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
