how-to-enable-whatsapp-rolling-out-new-group-privacy-settings

WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్… కొత్త ఫీచర్ వచ్చేసింది
గ్రూప్ ప్రైవసీకి సంబంధించి కొత్త ఫీచర్ రిలీజైంది. మిమ్మల్ని ఎవరు గ్రూప్స్‌లో యాడ్ చేయకూడదో మీరే నిర్ణయించొచ్చు.
యూజర్లకు వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది వాట్సప్. వెంటవెంటనే కొత్తకొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది.
కొద్దిరోజుల క్రితమే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్…
ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది.
ఈ ఫీచర్ వచ్చిందంటే… ఇక మీకు వాట్సప్ గ్రూప్స్ సమస్యే ఉండదు. అంటే మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు.
దీని ద్వారా అవసరంలేని గ్రూప్స్‌లోకి మిమ్మల్ని బలవంతంగా యాడ్ చేసే తలనొప్పి తగ్గిపోతుంది. ఇన్నాళ్లూ మీ అనుమతి లేకుండా మిమ్మల్ని గ్రూప్‌లో ఎవరుపడితే వాళ్లు యాడ్ చేసేవాళ్లు.
కొద్ది రోజుల క్రితం గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సప్.
అంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ అనుమతి తప్పనిసరి. మీకు ఇన్విటేషన్ పంపించి మిమ్మల్ని గ్రూప్‌లోకి ఆహ్వానించేవారు.
ఇప్పుడు గ్రూప్ ప్రైవసీకి సంబంధించి కొత్త ఫీచర్ రిలీజైంది. మిమ్మల్ని ఎవరు గ్రూప్స్‌లో యాడ్ చేయకూడదో మీరే నిర్ణయించొచ్చు.
WhatsApp Group Privacy: వాట్సప్‌లో గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్ చేయండి ఇలా
ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
టాప్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేయండి.
అకౌంట్లో ప్రైవసీ క్లిక్ చేయండి.
ప్రైవసీలో గ్రూప్స్ క్లిక్ చేయండి.
అందుకో మీకు Everyone, My contacts, My contacts except, Nobody అని నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.మీరు Everyone సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా గ్రూప్స్‌లో యాడ్ చేయొచ్చు.
My contacts సెలెక్ట్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారే గ్రూప్స్‌లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది.
My contacts except సెలెక్ట్ చేస్తే ఎవరు మిమ్మల్ని గ్రూప్స్‌లో యాడ్ చేయొద్దో వారి కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
అదే మీరు Nobody అని సెలెక్ట్ చేశారంటే మిమ్మల్ని ఎవరూ గ్రూప్స్‌లో యాడ్ చేయలేరు.
ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది వాట్సప్.
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
