how-to-gas-booking-through-your-whatsapp-mobile-proceesure

how-to-gas-booking-through-your-whatsapp-mobile-proceesure

గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని చేస్తున్నారా?

అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి.

వచ్చే నెల నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ మారబోతున్నాయి.

నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ హోమ డెలివరీ నిబంధనల్లో మార్పు చోటుచేసుకోబోతోంది.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తున్నాయి.

కన్సూమర్ హక్కులను కాపాడేందుకు, అలాగే గ్యాస్ సిలిండర్లలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

కొత్త డెలివరీ సిస్టమ్ ఎలా ఉండబోతోందో ఒకసారి తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్ కొత్త హోమ్ డెలివరీ వ్యవస్థకు *డీఏసీ* అని పేరు పెట్టారు.

 *డీఏసీని డెలివరీ అథంటికేషన్ కోడ్ అని పిలుస్తారు.* 

గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేయదు. మళ్లీ మీరు ఈ కోడ్‌ను తెలియజేయాలి.

గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డీఏసీ మెసేజ్ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెప్పాలి.

అప్పుడే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతవరకు కోడ్ మీ వద్దనే ఉంటుంది.

వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్… ఇలా చెయ్యండి…

ఇన్నాళ్లూ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే అదో రకమైన ఇబ్బంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చక్కగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

ఎలాగో తెలుసుకుందాం.

ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీరు… గ్యాస్ బుక్ చేసుకోవడమే కాదు… మీ బ్యాంక్ అకౌంట్‌లో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ గత ఆరు నెలల్లో ఎన్నిసార్లు, ఎంతెంత డిపాజిట్ అయ్యిందో తెలుసుకోవచ్చు, అంతే కాదు మీరు ఎన్ని సిలిండర్లు వాడారు, ఇంకా ఎన్ని వాడొచ్చు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో వాట్సాప్ వాడకం కామన్. అందుకే… గ్యాస్ బుకింగ్ కూడా వాట్సాప్ ద్వారా చేసుకునే వీలు కల్పించారు.

ప్రస్తుతానికి HP గ్యాస్ వినియోగదారులు ఇలా వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఆ ప్రక్రియను తెలుసుకుందాం.

VARADHI WORK BOOKS/WORK SHEETS FOR 1ST CLASS TO 10TH CLASS PDF FILES

10th CLASS ALL SUBJECTS ONLINE TEST LINK

వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే విధానం :
– HP గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.

– HP గ్యాస్ బుకింగ్ వాట్సాప్ నంబర్ ఇదే 9222201122
– నంబర్ సేవ్ చేశాక… వాట్సాప్ కాంటాక్ట్స్‌లో గ్యాస్ బుకింగ్ నంబర్ సెర్చ్ చెయ్యాలి.

– నంబర్ దొరికాక… ఓపెన్ చేసి… HELP అని టైప్ చేసి… సెండ్ చెయ్యాలి.
– వెంటనే మీకు ఓ మెసేజ్ వస్తుంది. అది ఇలా ఉంటుంది “Please send any of the below keywords to get help. SUBSUDY/QUOTA/LPGID/BOOKగ్యాస్ బుకింగ్ కోసం :
– BOOK అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.

కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలు మీకు వాట్సాప్ రిప్లై రూపంలో వస్తాయి. అవి కరెక్టే అయితే… Y అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. వెంటనే బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతూ మెసేజ్ వస్తుంది. అందులో రిఫరల్ నంబర్, డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ వస్తాయి. అంతే.

సబ్సిడీ వివరాలు కోసం :
– SUBSIDY అని టైప్ చేసి… సెండ్ చెయ్యాలి. మీ వివరాలు ఇలా కనిపిస్తాయి.
1: Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
2: Refill subsidy sent on:2019-12-07 to your account 6XXXXX523 Bank: AXIS BANK
3: Refill subsidy sent on:2019-11-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
4: Refill subsidy sent on:2019-09-27 to your account 6XXXXX523 Bank: AXIS BANK
5: Refill subsidy sent on:2019-08-31 to your account 6XXXXX523 Bank: AXIS BANK
6: Refill subsidy sent on:2019-07-28 to your account 6XXXXX523 Bank: AXIS BANK

కోటా వివరాల కోసం :
– QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
– మీకు ఓ మెసేజ్ వస్తుంది. మీరు 4/12 సబ్సిడీ సిలిండర్లు వాడారు అని చెబుతారు. అంటే నాలుగు వాడారు. మరో 8 వాడుకోవచ్చు.

LPG వినియోగదారు 17 నంబర్లను తెలుసుకోవడానికి LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.

లేదా www.mylpg.in లో వివరాలు ఇచ్చి… ఐడీ పొందొచ్చు.

SONU SOOD MERIT SCHOLARSHIPS ONLINE APPLICATION & OFFICIAL WEBSITE

error: Content is protected !!