how-to-get-GPA-10/10-10th-class-public-exams-Telugu-subject
తెలుగు.. తేలికే కదా అని ఆదమరిస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగా చదివితే నిజానికి సులభంగానే ఉంటుంది. పాదభంగాలు లేకుండా పద్యాలు రాయడానికి పద్యాలను కంఠస్థం చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో అభ్యర్థి సృజనాత్మకతను ప్రదర్శించాలి. అప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి.
తెలుగు పరీక్షను రెండు విధాలుగా నిర్వహిస్తారు.
ఒకటి జనరల్ తెలుగు (01T, 02T) రెండోది కాంపోజిట్ తెలుగు (03T, 4S).
మొదటి రోజు ప్రశ్నపత్రం ఇచ్చేటప్పుడు విద్యార్థి ఆ ప్రశ్నపత్రం తన ఐచ్ఛికానిదో? కాదో? పరిశీలించుకోవాలి. జనరల్ తెలుగు రాయబోయి కాంపోజిట్ తెలుగు రాసి మార్కులు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు.
కాబట్టి ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ఐచ్ఛికాన్ని పరిశీలించుకోవాలి.
పరీక్ష రాయడానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఇస్తారు.
ముందు దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రశ్నలను అర్థం చేసుకోవాలి.
అంతర్గత ఎంపిక వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది.
కాబట్టి ఏ ప్రశ్నలకు సమాధానం రాయాలో వాటికి ‘టిక్’ మార్క్ ఇచ్చుకోవాలి.
జవాబు రాసేటపుడు ప్రశ్నను సమాధాన పత్రంలో రాయాల్సిన అవసరం లేదు.
దాని సంఖ్యను సరిగా వేస్తే చాలు. ప్రశ్న సంఖ్య సరిగా వేయకపోతే పేపరు దిద్దేటప్పుడు అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు విసుగు వచ్చే అవకాశం ఉంటుంది. మూల్యాంకనం చేయరు.
ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాసేలా అన్ని ప్రశ్నలనూ సాధన చేయాలి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు
పేపర్-1
ప్రతిపదార్థం చదివేటప్పుడు పద్య అన్వయ క్రమాన్ని పాటిస్తూ చదవాలి. అర్థాలు రాయాలి. కర్త పదంతో ప్రతిపదార్థం ప్రారంభించి క్రియాపదంతో పూర్తి చేయాలి.
* కంఠస్థ పద్యం పాదభంగం లేకుండా రాసేలా సాధన చేయాలి. పద్యభాగం అర్థవంతంగా రాయాలి.
వ్యక్తీకరణ – సృజనాత్మకత సామర్థ్యంలో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వాటిలో పద్యభాగం, గద్యభాగం నుంచి 2 చొప్పున వస్తాయి. వీటిలో ఒక కవి పరిచయం, ఒక ప్రక్రియ తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి పాఠ్యాంశాల కవులు, ప్రక్రియలు చదువుకోవాలి.
*వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు పది లేదా పన్నెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి.
ఈ విభాగంలోవి స్వీయ రచన ప్రశ్నలు కాబట్టి సమాధానాలు సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి.
* భాషాంశాలు మొత్తం చదివి జవాబులు పెట్టాలి.
పాఠ్యాంశాల వెనుక ఉండే పదజాలం, వ్యాకరణాంశాలు సమగ్రంగా చదువుకోవాలి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
పేపర్-2
ఉపవాచకం, వాచకంలోని సృజనాత్మక అంశాల మీద ప్రశ్నలతో ఉంటుంది.
* సంఘటనా క్రమంలోని ప్రశ్నకు సమాధానం సరిగా రాయాలంటే రామాయణ కథపై పూర్తి అవగాహన ఉండాలి. 6 కాండలలో కథ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకూ ఉంటుందో తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
* అపరిచిత పద్యం, అపరిచిత గద్యం కింద ఇచ్చే ప్రశ్నలు పూర్తిగా చదివి అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
* వ్యక్తీకరణ – సృజనాత్మకతలోని లఘు ప్రశ్నలలో ఒక పాత్ర స్వభావం సంఘటన ద్వారా నీవేం తెలుసుకున్నావు? అనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి, రామాయణంలోని ముఖ్య సంఘటనలను గుర్తుంచుకోవాలి.
* ఉపవాచకంలోని వ్యాసరూప ప్రశ్న ‘రామాయణం’పై ఉంటుంది. కాబట్టి కాండలలోని కథకు సంబంధించిన ప్రశ్న లేదా రామాయణం విశిష్టత గురించిన ప్రశ్నలను చదవాలి.
* సృజనాత్మక ప్రశ్నలకు మార్కుల సూచికలను అనుసరించి మార్కులు వేస్తారు. సృజనాత్మక ప్రశ్నకు నియమాలను అనుసరించి లేఖ, కరపత్రం, సంభాషణ వంటివి రాయాలి. లేఖ, కరపత్రం వంటివి ఒక పేజీలో పూర్తయ్యేలా రాయాలి.
* భాషాంశాల్లో జాతీయాలు వివరించడం, వాక్యభేదాలు, క్రియాభేదాలు గుర్తుంచుకోవాలి. కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంగా మార్చేటప్పుడు ‘‘చేతబడి’’ అనే పదం గుర్తుంచుకుంటే సునాయాసంగా సమాధానాలు గుర్తించగలుగుతారు.
చేయకూడనివి
* ప్రశ్నపత్రం పూర్తిగా చదవకుండా సమాధానాలు రాయడం ప్రారంభించకూడదు.
* సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నను రాయవలసిన అవసరంలేదు. మార్జిన్‌లో ప్రశ్న సంఖ్య వేస్తే చాలు.
* అక్షరాలన్నీ ఒకే సైజులో పదానికి పదానికి మధ్య ఖాళీ ఉంచుతూ మూల్యాంకనం చేసే వారికి అర్థమయ్యేలా రాయాలి.
* వ్యాసరూప ప్రశ్నలకు 20 నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించకూడదు.
* కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి.
* హాల్ టికెట్ నంబరు ఎక్కడా వేయకూడదు. మెయిన్ ఆన్సర్ బుక్‌లెట్ నంబర్ మాత్రం ప్రతి అడిషినల్ షీట్ (అదనపు సమాధాన పత్రం), బిట్‌పేపర్ మీద వేయాలి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
ముఖ్యమైన ప్రశ్నలు
పేపర్ – 1
ప్రతిపదార్థాలు, కంఠస్థ పద్య భావాలు
1. శివరాజంతట మేల్ముసుంగు
2. అనలజ్యోతుల నీ పతివ్రతం
3. సురుచిర తారకాకుసుమ
4. వడిగొని టేకు లుప్పరిల్ల
5. దెసలను కొమ్మలొయ్య
6. నీరముతప్త లోహమున
7. ఉరుగుణవంతుడొడ్లు
8. తన చూపంబుధి మీద జాచి
వ్యాసరూప ప్రశ్నలు
1. శివాజీ వ్యక్తిత్వం గురించి రాయండి.
2. అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.
3. ‘‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిళ్ళు’’ – సమర్థించండి.
4. వెన్నెల పాఠ్యాభాగ సారాంశం రాయండి.
5. హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధం రాయండి.
6. మానవ జీవితంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి అనడాన్ని నీవెలా సమర్థిస్తావు?
7. ‘గోరంత దీపాలు’ కథానికలో వృద్థుని పాత్ర స్వభావం గురించి రాయండి.
8. చిత్ర గ్రీవాన్ని గురించి సొంత మాటలలో రాయండి.
పేపర్- 2
ఉపవాచక ప్రశ్నలు
1. ‘‘రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ’’ సమర్థించండి.
2. శ్రీరామ జననం గురించి రాయండి.
3. సీతారామ కళ్యాణాన్ని వర్ణించండి.
4. శ్రీరాముడు వనవాసమేగడానికి కారణాలేమిటి?
5. అయోధ్య కాండ ఆధారంగా శ్రీరాముని గుణగణాలు వర్ణించండి.
6. సీతాపహరణ వృత్తాంతం రాయండి.
7. శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి రాయండి.
8. రామ రావణ యుద్ధాన్ని వర్ణించండి.
సృజనాత్మక ప్రశ్నలు
1. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని వర్ణిస్తూ రాయండి.
2. అమరావతి శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ లేఖ రాయండి.
3. మహిళల పట్ల వివక్ష, దాడులను ఖండిస్తూ కరపత్రం రాయండి.
4. చూడాకర్ణుడు, వీణాకర్ణుని మధ్య సంభాషణను రాయండి.
5. మీ పాఠాశాల వార్షికోత*వానికి అందరినీ ఆహ్వానిస్తూ ఆహ్వానపత్రం తయారు చేయండి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
